March16-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
మరోసారి బీజేపీ అధికారంలోకి రావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు నిచ్చారు. నాగర్ కర్నూలులో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.తెలంగాణలో రెండో రోజు ఆయన పర్యటన కొనసాగుతుంది. నల్లగొండ, నాగర్‌కర్నూలు, మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానాలకు సంబంధించి బీజేపీ అభ్యర్థులను ఆయన ప్రజలకు పరిచయం చేశారు. తెలుగులో ఆయన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఎన్నికల కోడ్ అమలులోకి కాసేపట్లో రానుందన్న మోదీ, కోడ్ రాకముందే దేశ ప్రజలు డిసైడ్ అయ్యారన్నారు.
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
BJP : మూడో సారి మోదీ సర్కార్.. ఇదే దేశం నినాదం
మరోసారి బీజేపీ అధికారంలోకి రావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు నిచ్చారు. నాగర్ కర్నూలులో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.తెలంగాణలో రెండో రోజు ఆయన పర్యటన కొనసాగుతుంది. నల్లగొండ, నాగర్‌కర్నూలు, మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానాలకు సంబంధించి బీజేపీ అభ్యర్థులను ఆయన ప్రజలకు పరిచయం చేశారు. తెలుగులో ఆయన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఎన్నికల కోడ్ అమలులోకి కాసేపట్లో రానుందన్న మోదీ, కోడ్ రాకముందే దేశ ప్రజలు డిసైడ్ అయ్యారన్నారు.
Breaking : మోగిన ఎన్నికల నగారా షెడ్యూల్ విడుదల.. ఏపీలో ఎన్నికలు ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. తెలంగాణలోనూ అదే రోజు ఎన్నికలు జరగనున్నాయి. జూన్ నాలుగో తేదీన కౌంటింగ్ జరగనుంది. ఏప్రిల్ పద్దెనిమిదో తేదీన ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ పద్దెనిమిదోతేదీన నోటిఫికేషన్ వెలువడనుంది. ఆరోజు నుంచే నామినేషన్లను స్వీకరిస్తారు. ఇరవై ఐదో తేదీ నామినేషన్లను స్వీకరించడానికి ఆఖరి గడువుగా నిర్ణయించారు.
Big Breaking : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవితకు కస్టడీ
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు న్యాయమూర్తి కస్టడీ విధించారు. ఈరోజు ఆమెను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిన్న అరెస్టయిన కవితకు ఈరోజు వైద్య పరీక్షలు పూర్తి చేసిన అనంతరం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కోర్టుకు హాజరు పర్చారు. న్యాయమూర్తి నాగ్ పాల్ ఎదుట కవితను హాజరుపర్చగా ఆమెకు కస్టడీ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశించారు. భారీ బందోబస్తు మధ్య కోర్టుకు తరలించారు. కల్వకుంట్ల కవితకు ఏడు రోజుల రిమాండ్ విధించారు.
Ap Elections : వెయిటింగ్ మహా బోరు బాసూ... పోలింగ్ .. కౌంటింగ్‌కు ఇరవై రోజులు ఉగ్గబట్టి ఫలితం కోసం?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. కౌంటింగ్ జూన్ 4వ తేదీన జరగనుంది. అంటే కౌంటింగ్ పూర్తయిన దాదాపు ఇరవై రోజుల పాటు ఫలితాల కోసం ఎదురు చూడాల్సి ఉంటుంది. లోక్‌సభ ఎన్నికలు నిర్వహిస్తున్న ఏడు దశల్లో ఏపీ, తెలంగాణలో నాలుగో దశలో ఎన్నికలను నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ప్రజలు తమ ఓటు హక్కును మే 13వ తేదీన వినియోగించుకుంటారు. అయితే ఫలితాలు మాత్రం జూన్ నాలుగో తేదీ వరకూ తెలియదు.
Ys Jagan : లిస్ట్‌ను విడుదల చేసిన జగన్ .. సెంటిమెంట్ ఫాలో అయిన జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. రానున్న ఎన్నికల్లో వీరే తమ పార్టీ అభ్యర్థులని ఆయన ప్రకటించారు. కొద్దిసేపటి క్రితం తాడేపల్లి నుంచి కడపకు చేరుకున్న జగన్ అక్కడి నుంచి ఇడుపులపాయకు వచ్చారు. అక్కడ వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. రెండో సారి అధికారంలోకి వచ్చే దిశగా ఆయన సెంటిమెంట్ ను ఎంచుకున్నారు.
Rajinikanth : నాగోలు మెట్రో స్టేషన్ లో రజనీకాంత్
ప్రముఖ నటుడు రజనీకాంత్ నాగోల్ మెట్రో స్టేషన్ కు వచ్చారు. అక్కడ ఉన్న ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ ను ఆయన పరిశీలించారు. హైదరాబాద్ లో మెట్రో సేవలు అక్కడి నుంచే ఆపరేట్ చేస్తారు. ఇక్కడి నుంచి ఆపరేషన్ జరిగే తీరును రజనీకాంత్ అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
Amit Shah : కవిత అరెస్ట్‌పై స్పందించిన అమిత్ షా
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. చట్టం తన ప్రకారం తన పనితాను చేసుకుపోతుందన్నారు. ప్రభుత్వం చెబితే దర్యాప్తు సంస్థలు పనిచేయవన్న అమిత్ షా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కొన్నేళ్ల నుంచి ఈడీ, సీబీఐలు విచారిస్తున్నాయన్నారు. ఎన్నికలు వచ్చాయి కదా? అని దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేయవని, అరెస్ట్ చేయకుండా ఆగవని అన్నారు.
కరీంనగర్ లో కరెన్సీ కట్టలు...హోటల్ సెల్లార్లో ఆరు కోట్లు... ఎవరివంటే?
కరీంనగర్ ప్రముఖ హోటల్ లో పోలీసులు సోదాలు చేశారు. దాదాపు ఆరు గంటల పాటు సోదాలు నిర్వహించారు. హోటల్ పార్కింగ్ లో ఆరు కోట్ల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే ఇప్పుడే ఇంత పెద్దమొత్తంలో నగదు బయటపడటం అధికారులను సయితం ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఈ నగదు ఎవరిది అన్న దానిపై ఇంకా సమాచారం అందలేదు.
TDP : నేడు టీడీపీ మూడో జాబితా
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు మూడో విడత జాబితాను విడుదల చేయనున్నారు. ఇప్పటి వరకూ రెండు జాబితాలను చంద్రబాబు విడుదల చేశారు. ఇంకా 16 అసెంబ్లీ నియోజకవర్గాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ 144 అసెంబ్లీ స్థానాలు, 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దించాల్సి ఉంది. ఈ మేరకు వివిధ సర్వేలను అనుసరించి చంద్రబాబు గత కొద్ది రోజుల నుంచి కసర్తు చేశారు.
మీ మొబైల్లో ఈ మూడు సెట్టింగ్‌లు ఆన్ ఉన్నాయా? వెంటనే ఆఫ్ చేసుకోండి
ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఉదయం లేచింది నుంచి రాత్రి పడుకోబోయే వరకు స్మార్ట్‌ఫోన్‌లో మునిగిపోతున్నారు. అయితే ప్రస్తుతం సైబర్ క్రైమ్ కూడా పెరిగిపోతోంది. స్మార్ట్ ఫోన్లను వాడేవారిని నేరగాళ్లు సులభంగా మోసగిస్తున్నారు. అయితే ఫోన్ లో సెక్యూరిటీ అప్డేట్ను ఎప్పటికప్పుడు చేసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు టెక్ నిపుణులు. అలాగే మొబైల్లో ఏదైనా చేస్తున్నప్పుడు యాడ్స్ వస్తుంటాయి. వాటి వల్ల తీవ్ర అసౌకర్యానికి గురవుతుంటాము.