16 July -టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
కర్ణాటకలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కొండచరియలు విరిగిపడటంతో ఏడుగురు మరణించినట్లు అధికారికవర్గాలు తెలిపాయి. మరికొంత మంది శిధిలాల కింద చిక్కుకుని ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దాదాపు పదిమంది ఈ శిధిలాల కింద చిక్కుకుని ఉన్నట్లు ప్రాధమికంగా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
కొండచరియలు విరిగిపడి.. ఏడుగురు మృతి... మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు
కర్ణాటకలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కొండచరియలు విరిగిపడటంతో ఏడుగురు మరణించినట్లు అధికారికవర్గాలు తెలిపాయి. మరికొంత మంది శిధిలాల కింద చిక్కుకుని ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దాదాపు పదిమంది ఈ శిధిలాల కింద చిక్కుకుని ఉన్నట్లు ప్రాధమికంగా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
Andhra Pradesh : నేడు చంద్రబాబు వారికి గుడ్ న్యూస్ చెప్పనున్నారా? కేబినెట్ భేటీలో ఇదే ప్రధానమా?
నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయాలన్న కృత నిశ్చయంతో ఉంది. ఇప్పటికే నాలుగువేల పింఛను అధికారంలోకి వచ్చిన మొదటి నెల అమలు చేశారు. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లుగానే మూడు వేలు కలపి మరీ వృద్ధులు, వితంతువులకు మూడు వేలు కలిపి ఏడు వేల రూపాయలను ఇచ్చారు.
Janasena : జనసేన ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో బలం పెంచుకునే ప్రయత్నం చేస్తుందా? లేదా?
పదేళ్ల పవన్ కల్యాణ్ ప్రయత్నం ఫలించింది. ఆయన అనుకున్నది సాధించారు. పదేళ్ల పాటు పార్టీని ఒంటి చేత్తో నడిపారు. 2014లో పవన్ కల్యాణ్ జనసేన పార్టీని ప్రారంభించినప్పుడు ఆయనతో ఎంతో మంది ఉన్నారు. నేతలు వరసబెట్టి చేరి ఆయనకు అండగా నిలుద్దామని వచ్చారు. కానీ ఏ ఒక్కరూ ఆయన వెన్నంటి నిలవలేదు
Heavy Rain : వర్షాలు ఇంకా కురుస్తాయట... మరో అల్పపీడనం పొంచి ఉంది
తెలంగాణలో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే గత మూడు ర్ోజుల నుంచి కుండపోత వర్షాలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు మరో ఐదు రోజులు పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
Kalvakuntla Kavitha : ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అస్వస్థతకు గురయ్యారు. తీహార్ జైలులో ఉన్న కల్వకుంట్ల కవిత అస్వస్థతకు గురికావడంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. తీహార్ జైలు నుంచి దీన్ దయాళ్ ఆసుపత్రికి కవితను తరలించి చికిత్స అందిస్తున్నారు. కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీహార్ జైలులో ఉన్నారు.
Andhra Pradesh : ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటి నుంచి అంటే? .. ప్రకటించిన మంత్రి
ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి అనగాని సత్యప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. సూపర్ సిక్స్ లో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని తెలుగుదేశం పార్టీ తన మ్యానిఫేస్టోలో ప్రకటించింది. అయితే అధికారంలోకి వచ్చి నెల రోజులు దాటుతున్నా దీనిపై ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేస్తున్నామని ప్రభుత్వం చెబుతూ వస్తుంది.
Telangana : నాలుగేళ్లు హ్యాపీనే... అసలు కథ ముందుంది మావా? బీఫారం వచ్చే వరకూ డౌటే?
తెలంగాణాలో గతంలో సీన్ రిపీట్ అవుతుంది. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు ప్రతిపక్ష బీఆర్ఎస్ ను వదిలి కాంగ్రెస్ లోకి వెళుతున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సంఖ్య పెరగడం బలం పరంగా కాంగ్రెస్ కు అవసరం. గత బీఆర్ఎస్ హయాంలోనూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఇతర పార్టీల నుంచి తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఏ పార్టీనీ కేసీఆర్ వదలలేదు.
KCR : సుప్రీంకోర్టులో కేసీఆర్ కొంత ఊరట దక్కిందిగా
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిటీషన్ పై నేడు సుప్రీంకోర్టులో కొంత ఊరట దక్కింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్తు కొనుగోళ్ల ఒప్పందాలపై నియమించిన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలని కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే దీనిపై విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి మీడియా సమావేశం పెట్టి విచారణకు ముందే వెల్లడించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
Raj Tarun : రాజ్ తరుణ్‌కు పోలీసులు నోటీసులు
సినీనటుడు రాజ్‌తరుణ్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 18వ తేదీ లోపు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. హీరో రాజ్ తరుణ్ తనను నమ్మించి పెళ్లి చేసుకుని మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ మేరకు నోటీసులు జారీ చేశారు.
Telangana : అంగన్వాడీలకు అదిరిపోయే న్యూస్ చెప్పిన సర్కార్
తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పింది. అంగన్ వాడీలకు పదవీ విరమణ తర్వాత ప్రయోజనాలను అందిస్తామని మంత్రి సీతక్క తెలిపారు. అంగన్ వాడీ టీచర్ కు రెండు లక్షల రూపాయలు రిటైర్మ్మెంట్ బెనిఫిట్స్ అందుతాయని తెలిపారు. అంగన్ వాడీ హెల్పర్ కు రిటైర్ అయిన తర్వాత లక్ష రూపాయలు అందచేస్తామని మంత్రి సీతక్క తెలిపారు.