19June-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
దేశ రాజధాని ఢిల్లీలో నీటి సంక్షోభం కొనసాగుతూనే ఉంది. అనేక ప్రాంతాల్లో నీటి కొరత ఇంకా తీరలేదు. దీంతో ఢిల్లీ వాసులు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీలో గతంలో ఎన్నడూ లేని విధంగా గత కొద్ది రోజుల నుంచి నీటి సంక్షోభం నెలకొంది. పైపులైన్ల నుంచి నీరు రాకపోవడంతో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. పైపులైన్లను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు పగులుగొడుతుండటంతో పోలీసు సిబ్బందిని వాటికి రక్షణగా నియమించారు.
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
Delhi : ఢిల్లీ లో కొనసాగుతున్న నీటి కొరత
దేశ రాజధాని ఢిల్లీలో నీటి సంక్షోభం కొనసాగుతూనే ఉంది. అనేక ప్రాంతాల్లో నీటి కొరత ఇంకా తీరలేదు. దీంతో ఢిల్లీ వాసులు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీలో గతంలో ఎన్నడూ లేని విధంగా గత కొద్ది రోజుల నుంచి నీటి సంక్షోభం నెలకొంది. పైపులైన్ల నుంచి నీరు రాకపోవడంతో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. పైపులైన్లను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు పగులుగొడుతుండటంతో పోలీసు సిబ్బందిని వాటికి రక్షణగా నియమించారు.
Tomato : లక్షాధికారులవుతున్న కర్నూలు, చిత్తూరు టమాటా రైతులు.. రాత్రికి రాత్రి జీవితం మారిపోయిందిగా
మదనపల్లె, కర్నూలు ప్రాంతాల్లో టమాటా రైతులు ఒక్కసారిగా లక్షాధికారులుగా మారిపోతున్నారు. దేశమంతటా టమాటా దిగుబడులు తగ్గిపోవడంతో ఊహించని ఆదాయం వస్తుంది. ముఖ్యంగా కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో రైతులు తాము పెట్టుబడి పెట్టిన దానికంటే కొన్ని రెట్లు అధికంగా లాభాలను ఆర్జిస్తున్నారు. సాధారణంగా ఈ ధరలు ఎండాకాలంలో వస్తాయంటారు. అప్పుడు వర్షాలు లేక గిట్టుబాటు ధరలు లభించవు.
Andhra Pradesh : ఇక ఆ విద్యార్థులకు ఆ దిగులు లేదు.. వాళ్లందరీకి ఉచితం.. గుడ్ న్యూస్ చెప్పిన సర్కార్
ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా పాఠపుస్తకాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పాఠపుస్తకాలతో పాటు నోట్ బుక్స్ ను కూడా ఉచితంగా అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. జులై 15వ తేదీ నాటికి పాఠ్యపుస్తకాలతో పాటు నోట్ బుక్స్ తో పాటు బ్యాక్ ప్యాక్ అందచేయాలని జీవో నెంబరు 28ని విడుదల చేసింది.
హజ్ యాత్రకు వెళ్లి 577 మంది మృతి
హజ్ యాత్రకు వెళ్లిన వారిలో 577 మంది మరణించారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. అరబ్ దౌత్యవేత్తలు తెలిపిన ప్రకారం మరణించిన వారిలో ఎక్కువ మంది ఈజిప్ట్, జోర్డాన్ దేశానికి చెందిన వారిగా గుర్తించారు. హజ్ యాత్రలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో వడదెబ్బ తగిలి కొందరు, ఉక్కపోతకు గురయి మరికొందరు మరణించారని చెబుతున్నారు.
Pawan Kalyan : డిప్యూటీ సీఎంగా బాధ్యతలను స్వీకరించిన పవన్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా పవన్ కల్యాణ్ బాధ్యతలను స్వీకరించారు. సచివాలయంలోని తన ఛాంబర్ లో ఆయన ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం బాధ్యతలను స్వీకరించారు. పంచాయతీరాజ్, మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకున్న సమయంలో ముఖ్యమైన ఫైళ్లపై సంతకాలను చేశారు.
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు
చెన్నై నుంచి ముంబయి వెళుతున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమయిన అధికారులు వెంటనే తనిఖీలు నిర్వహించారు. అయితే బాంబు ఏమీ లేదని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇండిగో సంస్థ ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేసింది. ప్రయాణికులు సురక్షితంగానే ఉన్నారని తెలిపింది.
Naveen Patnaik : అరుదైన నేత తనను ఓడించిన నేతను ప్రశసించిన మాజీ సీఎం
నవీన్ పట్నాయక్ మొన్నటి వరకూ ఓటమి ఎరుగరు. దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు ఒడిశాకు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. అయితే మొన్నటి ఎన్నికల్లో ఆయన పార్టీ బిజూ జనతాదళ్ ఓటమి పాలయింది. అయినా ఆయన కుంగిపోలేదు. నీరసించి ఎందుకీ ఫలితం అని నీరసపడలేదు. నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రి మోహన్ మాఝీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచారు. తనను ఓడించిన బీజేపీ నేతల మధ్యనే ఆయన ఉండి ఆ కార్యక్రమాన్ని వీక్షించారు.
YSRCP : రేపే వైసీపీ కీలక సమావేశం
వైసీపీ అధినేత జగన్ కీలక సమావేశం ఈ నెల 20వ తేదీన నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఈ నెల 21, 22 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు ఉండటంతో అందుకు ఒకరోజు ముందు జగన్ ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.
Amarnath Yathra : ఈ నెల 29 నుంచి అమర్నాధ్ యాత్ర
భక్తులు ఎంతగానో ఎదురు చూసే అమర్నాధ్ యాత్ర ప్రారంభం కానుంది. ఈ నెల 29వ తేదీ నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. ఈ యాత్ర మొత్తం నలభై ఐదు రోజుల పాటు జరగనుంది. అమర్నాధ్ యాత్రకు వెళ్లే భక్తుల కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. ఇందుకోసం భారీ భద్రతను ఉంచుతుంది.
Loksabha : 24 నుంచి జులై 3వరకూ పార్లమెంటు సమావేశాలు
ఈ నెల 24 నుంచి పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నెల 24 నుంచి జులై 3వ తేదీ వరకు పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయని తెలిపారు. నూతనంగా ఎన్నికయిన పార్లమెంటు సభ్యులతో ప్రమాణస్వీకారం ఉంటుందని ఆయన తెలిపారు.