టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
ఇకపై ఆధార్‌తో బ్యాంకు ఖాతా, Japan భూకంపం..పెట్రోల్ దొరకదేమో అనే టెన్షన్! మున్సిపల్ కార్మికులతో చర్చలు విఫలం
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
Corona Virus : కేసులు పెరుగుతున్నాయ్.. అలర్ట్‌గా లేకుంటే ఇక అంతే!
కరోనా వైరస్ కేసులు దేశంలో పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ దీనిపై అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. గడచిన 24 గంటల్లో 636 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడంచారు. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య దేశంలో ప్రస్తుతం 4,394 కు చేరుకుంది. గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కరోనా బారిన పడి ముగ్గురు మరణించడం కూడా ఆందోళనకు మరొక కారణం.
India : ఇకపై ఆధార్‌తో బ్యాంకు ఖాతా అనుసంధానం అయి ఉండాల్సిందే.. అప్పుడే నగదు బదిలీ
కేంద్ర ప్రభుత్వం సీరియస్ నిర్ణయం తీసుకుంది. ఇకపై గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద డబ్బులు జమ చేయాలంటే బ్యాంకు ఖాతాలతో ఆధార్ నెంబరుతో అనుసంధానం కావాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీంతో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద కూలీలకు అందించే మొత్తాన్ని నేరుగా వారి బ్యాంకుల్లోనే జమ చేయనున్నారు.
Gold Price: ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలుసా?
అత్యంత విశ్వసనీయమైన, సంప్రదాయ పెట్టుబడులలో భూమి, బంగారం. రెండూ ఎల్లప్పుడూ చాలా లాభదాయకంగా ఉంటాయి. ముఖ్యంగా ఏడాదిలోపు బంగారం ధరలు తగ్గినట్లుగా ఎక్కడ లేదు. ఇది ఏడాదికి కనీసం 8 నుంచి 25 శాతం వరకు ధర పెరుగుతుంది. 2023 క్యాలెండర్ సంవత్సరంలో బంగారం ధర 16 శాతం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
Japan : భూకంపం దెబ్బకు ఎంత మంది మృతి చెందారంటే?
జపాన్ లో భూకంపం కారణంగా పదమూడు మంది మరణించినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. సోమవారం సంభవించిన వరస భూకంపాలతో జపాన్ ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. పదమూడు మంది ఇప్పటి వరకూ మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది
Ys Sharmila : వైఎస్ షర్మిల అడుగులు హస్తిన వైపు... విలీనానికే మొగ్గు
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని డిసైడ్ అయ్యారు. బుధవారం లేదా గురువారం షర్మిల ఢిల్లీకి వెళ్లనున్నారు. కాంగ్రెస్ లో విలీనం చేయడానికే షర్మిల మొగ్గు చూపుతున్నారు. ఈ మేరకు ఆమె ముఖ్యనేతలకు సంకేతాలు ఇచ్చారు.
పెట్రోల్ దొరకదేమో అనే టెన్షన్ వద్దు
ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు హైదరాబాద్‌లో చేపట్టిన ధర్నాను విరమించారు. పెట్రోల్, డీజిల్ లోడులతో చర్లపల్లిలోని డిపోల నుంచి ట్యాంకర్లు బంకులకు బయలుదేరాయి. ఇప్పటికే ఇవాళ ఉదయం నుంచి బంకుల వద్ద వాహనదారులు ఇంధనం కోసం బారులు తీరారు. భారత న్యాయ సంహిత చట్టంలో హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి జైలు శిక్షను ఇటీవల కేంద్రం భారీగా పెంచింది.
Rice : బియ్యం ధరలకు రెక్కలు.. కొనాలంటే ఇక కష్టమే మరి.. కృత్రిమ కొరత సృష్టించారా?
బియ్యం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రతి ఇంట్లో కనీస అవసరమైన బియ్యం ధరలు పెరగడంతో సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాదిన ఎక్కువగా బియ్యం నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ఇక్కడ గోధుమల కంటే బియ్యాన్నే ఇష్టపడి తింటారు. అందులోనూ సన్నబియ్యానికి డిమాండ్ ఎప్పుడూ అధికంగానే ఉంటుంది.
Chiranjeevi : వామ్మో.. చిరంజీవికి సందీప్ వంగ ఇంత పెద్ద అభిమానా..
మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి సపరేట్ గా చెప్పనవసరం లేదు. ఆయనికి ఆడియన్స్ లో మాత్రమే కాదు, సినిమా ఇండస్ట్రీలో పని చేసే దర్శకులు, హీరోల్లో కూడా అభిమానులు ఉంటారు. అలా ప్రస్తుతం ఇండస్ట్రీలో డైరెక్టర్స్ గా పని చేస్తున్న సందీప్ వంగ, బాబీ, ప్రశాంత్ నీల్ వంటి వారు చిరుకి అభిమానులే.
Revanth Reddy : ప్రతి అడుగూ బీఆర్ఎస్ ను వెనక్కు నెట్టేందుకు.. పట్టుబిగిస్తున్న రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. త్వరలో రాష్ట్ర సలహా మండలిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సలహా మండలి ఛైర్మన్‌గా సీఎం రేవంత్ రెడ్డి కొనసాగనున్నారు. సలహా మండలిలో మేధావులకు చోటు కల్పించాలని నిర్ణయించారు. జయప్రకాశ్ నారాయణ, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ఆకునూరి మురళి ప్రొఫెసర్లు హరగోపాల్, నాగేశ్వరరావులను నియమించే అవకాశముందని తెలిసింది.
మున్సిపల్ కార్మికులతో చర్చలు విఫలం
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ కార్మికులతో ప్రభుత్వం జరిపిన చర్చలు మరోసారి విఫలమయ్యాయి. బేసిక్ పే ఇవ్వడం కుదరదని సర్కార్ తేల్చి చెప్పడంతో మున్సిపల్ కార్మికులు తమ సమ్మెను కొనసాగించాలని నిర్ణయించారు. మున్సిపల్ కార్మికులకు బేసిక్ పే ఇస్తే అన్ని శాఖల వారూ అడుగుతారని మంత్రుల బృందం అభిప్రాయపడింది. ఆ ఒక్కటీ అడగొద్దని తెలిపింది.