టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
హీరో విజయ్ పెట్టిన పార్టీ పేరు.. అర్ధం అదేనట..ఝార్ఖండ్ ఎమ్మెల్యేల బాధ్యత పొన్నం ప్రభాకర్ కే, బండ్లగణేష్ అప్లికేషన్... ఆ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు?
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
YSRCP : దెందులూరు సభ పునరాలోచనలో పడేసిందా? ఆరో జాబితా ఆలస్యమవుతుందా?
వైఎస్ జగన్ ఈసారి అధికారంలోకి రావడానికి అభ్యర్థులను మారుస్తున్నారు. నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జులను నియమిస్తున్నారు. దీంతో పార్టీలో అలజడి మొదలయింది. ఇప్పటి వరకూ వైసీపీలో ఐదు జాబితాలు విడుదలయ్యాయి. ఈ ఐదు జాబితాల్లో పదమూడు పార్లమెంటు నియోజకవర్గాల్లోనూ, అరవై వరకూ శాననసభ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జులను మార్చారు.
TDP : సత్తా ఉన్నోళ్లకు సీటు ఈసారి కష్టమేనట.. అసలు రీజన్ ఇదే
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తున్నారు. ఆయన కొద్దిరోజులుగా హైదరాబాద్‌లోనే ఉండి జాబితాను రూపొందిస్తున్నారు. జనసేన సీట్లను పక్కన పెట్టి పక్కాగా తమకు కేటాయించుకునే స్థానాలపై ఆయన కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. పార్టీ వర్గాల ద్వారా తెప్పించుకున్న నివేదికలతో పాటు రాబిన్ శర్మ టీం అందించిన సర్వే రిపోర్టులు దగ్గరపెట్టుకుని మరీ ఎవరికి టిక్కెట్ ఇవ్వాలి? ఎవరిని పక్కన పెట్టాలి? అన్న దానిపై ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.
Revanth Reddy : నిత్యానంద స్వామి లాగా దీవి కొనుక్కొని రాజు అవ్వు.. కేసీఆర్
త్వరలో మహిళలకు గ్యాస్ సిలిండర్లు, రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు హామీని అమలు చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. ఇంద్రవెల్లిలో తెలంగాణ పునర్నిర్మాణ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. గత ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా వెనక్కు తగ్గలేదన్నారు. అడవి బిడ్డల ప్రాంతాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తామని చెప్పారు.
Vijay : హీరో విజయ్ పెట్టిన పార్టీ పేరు.. అర్ధం అదేనట..
Vijay : తమిళ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నారా..? అనే ప్రశ్నలకు విజయ్ సమాధానం ఇచ్చేస్తూ.. నేడు తన రాజకీయ రంగప్రవేశం పై అధికారిక ప్రకటన ఇచ్చేసారు. ఇప్పటివరకు ‘విజయ్ పీపుల్స్ మూవ్మెంట్’ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవలు చేస్తూ వచ్చిన విజయ్.. ఇప్పుడు అన్యాయం పై పోరాడడం కోసం.. తన కొత్త పొలిటికల్ పార్టీని అనౌన్స్ చేశారు.
ఝార్ఖండ్ ఎమ్మెల్యేల బాధ్యత పొన్నం ప్రభాకర్ కే
ఝార్ఖండ్ ఎమ్మెల్యేల బాధ్యత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఈ టాస్క్‌ను అప్పగించారు. ఝార్ఖండ్ తో జరిగిన రాజకీయ పరిణామాలతో దాదాపు నలభై మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కు తరలించారు. వీరిలో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ ఎమ్మెల్యేలున్నారు. వీరందరినీ శామీర్‌పేట్‌లోని ఒక రిసార్ట్‌కు తరలించారు. వీరందరికి అక్కడే బస ఏర్పాటు చేశారు.
బండ్లగణేష్ అప్లికేషన్... ఆ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు?
మల్కాజ్గిరి ఎంపీ టికెట్ కోసం సినీ నిర్మాత బండ్లగణేష్ దరఖాస్తు చేసుకున్నారు. తాను మల్కాజ్ గిరి నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని ఆయన కోరారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా దరఖాస్తులను పార్టీ ఆహ్వానించడంతో ఆయన గాంధీ భవన్ కు వచ్చి దరఖాస్తు చేసుకున్నారు
HanuMan Collections: 92ఏళ్ళ చరిత్రని తిరగరాసిన 'హనుమాన్'..
HanuMan Collections: టాలీవుడ్ యంగ్ టాలెంట్ తేజ సజ్జ, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన 'హనుమాన్' మూవీ.. బాక్స్ ఆఫీస్ వద్ద ఇంకా సంచలనాలు సృష్టిస్తూనే ముందుకు వెళ్తుంది. అసలు థియేటర్స్ కూడా దొరకని పరిస్థితిలో రిలీజైన ఈ సినిమా.. వంద కోట్లు, రెండు వందల కోట్లు దాటి మూడు వందల కోట్ల మార్క్ వైపు పరుగులు పెడుతుంది.
ఇద్దరి పర్యటనలు వాయిదా?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు తమ బహిరంగ సభలను వాయిదా వేసుకున్నారు. పొత్తులో సీట్లు సర్దుబాటు కాకపోవడంతో దానిపైనే కసరత్తులు చేయాలని భావిస్తున్నారు. ఈ నెల 4వ తేదీ నుంచి ఇద్దరు నేతలు బహిరంగ సభలు ముందుగానే ప్రకటించాయి. అనకాపల్లిలో పవన్ కల్యాణ్ బహిరంగ సభ ఉంటుందని పార్టీ నేతలు ప్రకటించుకున్నారు.
Breaking : సుప్రీంకోర్టులో మార్గదర్శికి షాక్
మార్గదర్శి సంస్థకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మార్గదర్శి చిట్‌ఫండ్ కేసును తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేయాలన్న అభ్యర్థనను తిరస్కరించింది. మార్గదర్శి వేసిన పిటీషన్ సుప్రీంకోర్టు ధర్మాసనం డిస్మిస్ చేసింది. మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో నమోదయిన కేసులను తెలంగాణకు బదిలీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో మార్గదర్శి పిటషన్ వేసింది.
Breaking : పూనమ్ పాండే మృతి.. ఇందులో నిజమెంత?
ప్రముఖ బాలీవుడ్ నటి పూనమ్ పాండే మరణించారు. చిన్న వయసులోనే ఆమె మరణించారు. క్యాన్సర్‌తో గత కొంతకాలంగా బాధపడుతూ పూనమ్ పాండే మరణించినట్లు చెబుతున్నారు. సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ గా మారింది. పూనమ్ పాండే గర్భాశయ క్యాన్సర్ తో పూన్ మృతి చెందినట్లు పూనమ్ పాండే రియల్ అనే ఇన్స్టాగ్రామ్ లో పోస్టు చేశారు.