2July-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
దేశంలో జికా వైరస్ కలకలం రేపుతుంది. తాజాగా మహారాష్ట్రలో జికా వైరస్ కేసులు నమోదు కావడంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమయింది. మహారాష్ట్రలోని పూనేలో ఆరు ఇన్ఫెక్షన్ కేసులు నమోదయినట్లు వైద్యులు తెలిపారు. పూనేలోని ఎరండ్వానే ప్రాంతానికి చెందిన గర్భిణికి జికా వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు.
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
Zika Virus : జికా వైరస్ ముప్పు... అలర్టయిన వైద్యశాఖ
దేశంలో జికా వైరస్ కలకలం రేపుతుంది. తాజాగా మహారాష్ట్రలో జికా వైరస్ కేసులు నమోదు కావడంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమయింది. మహారాష్ట్రలోని పూనేలో ఆరు ఇన్ఫెక్షన్ కేసులు నమోదయినట్లు వైద్యులు తెలిపారు. పూనేలోని ఎరండ్వానే ప్రాంతానికి చెందిన గర్భిణికి జికా వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు.
Raghu Rama Krishna Raju : రాజుగారి రూటే వేరు.. అందరిదీ ఒక దారి అయితే.. ఆయనది మాత్రం?
కనుమూరి రఘురామకృష్ణరాజు పరిచయం అక్కరలేని పేరు. నరసాపురం ఎంపీగా ఆయన 2019 నుంచి 2023 వరకూ వైసీపీలోనే ఉండి ఆ పార్టీకే కంట్లో నలుసుగా మారారు. ప్రతిరోజూ రచ్చబండ పేరుతో మీడియా సమావేశం పెట్టి మరీ పార్టీపైన, అధినేత జగన్ పైన విమర్శలు చేసే రఘురామకృష్ణరాజు గత ఎన్నికల్లో నరసాపురం టిక్కెట్ ఆశించినా దక్కలేదు.
Chandrababu : చంద్రబాబు హస్తిన పర్యటన కలిసి వచ్చేటట్లే ఉందిగా.. గుడ్ న్యూస్ సౌండ్ పెద్దదిగానే ఉంటుందట భయ్యా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ఖరారయింది. ఎల్లుండి ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. ఈనెల 4వ తేదీన ఆయన ముఖ్యమంత్రి హోదాలో హస్తిన పర్యటన పెట్టుకున్నారు. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలవనున్నారు.
Breaking : గుడ్ న్యూస్ .. ఆర్టీసీలో 3,035 పోస్టులకు గ్రీన్ సిగ్నల్
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ ఆర్టీసీలో ఉన్న 3,035 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టీజీఆర్టీసీలో పెద్దయెత్తున ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అనేక మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. కొన్నేళ్లుగా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది.
Breaking : టాలీవుడ్ కు షాకిచ్చిన రేవంత్ రెడ్డి.. అవి ఇస్తేనే అనుమతులు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగు చిత్ర పరిశ్రమకు మంచి సూచనలు ఇచ్చారు. అలాగే షాక్ కూడా ఇచ్చారు. సామాజిక బాధ్యత ఉండేలా సినీ పరిశ్రమ వ్యవహరించాలని ఆయన కోరారు. డ్రగ్స్, మాదక ద్రవ్యాలపై రెండు నుంచి మూడు నిమిషాల నిడివి గల వీడియో సందేశాన్ని సినిమా యూనిట్ అందిస్తేనే వారికి వెసులు బాటు ఇవ్వాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.
Hyderabad : పాతబస్తీలో తాట తీస్తున్న పోలీసులు.. రాత్రి పన్నెండు దాటితే?
హైదరాబాద్ లోని పాతబస్తీలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. వరస హత్యలు జరుగుతుండటంతో వాటిని అరికట్టేందుకు పాతబస్తీ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ ల ప్రాంతంలో రాత్రి వేళ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. పాతబస్తీలో సహజంగా తెల్లవారు జాము వరకూ యువకులు తిరుగుతూనే ఉంటారు. కొన్ని ఫుడ్ సెంటర్లు కూడా ఓపెన్ అయి ఉంటాయి.
Telangana : నిరుద్యోగులకు త్వరలో గుడ్ న్యూస్ చెప్పనున్న రేవంత్ సర్కార్
తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం త్వరలో నిరుద్యోగులకు త్వరలో గుడ్ న్యూస్ చెప్పనుంది. రెండు వారాల్లో జాబ్ క్యాలెండర్ విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. టీజీపీఎస్సీ భర్తీ చేసే గ్రూప్-1, 2, 3, 4 ఉద్యోగాలతో పాటు గురుకులాలు, పోలీసులు, వైద్య నియామకాల బోర్డులు, ఇతర విభాగాల పోస్టులను కలిపి రిలీజ్ చేయనుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభం
ఎన్టీఏ పార్లమెంటరీ పార్టీ సమాశం ప్రారంభమయింది. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. లోక్సభ సమావేశాలు ముగియనున్న సమయంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. తొలిసారి ఎన్డీఏ పక్షాల పార్లమెంటు సభ్యులతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం కానున్నారు.
Delhi : ఢిల్లీలో నేడు, రేపు భారీ వర్షాలు.. హై అలెర్ట్ ప్రకటన
ఢిల్లీలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆరెంజ్ అలెర్ట్ ను వాతావరణ శాఖ విడుదల చేసింది. ఢిల్లీలో వర్షం అంటేనే భయపడిపోతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. వాహనాలు కూడా ట్రాఫిక్ లో చిక్కుకుని అనేక ఇబ్బందులు పడ్డారు.
జనసైనికులకు పవన్ వార్నింగ్.. ఎందుకంటే?
పిఠాపురంలో జనసైనికులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చారు.పిఠాపురం నిర్వహించిన సభలో పవన్ మాట్లాడుతుండగాజనసేన కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేస్తూ నినాదాలు చేశారు. వారి నినాదాలతో పవన్ ప్రసంగం వినిపించకుండా పోయింది. దీంతో ఒక్కసారిగా అసహనానికి డిప్యూటీ సీఎం పవన్ గురయ్యారు.