March20-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
బెంగళూరు నగరంలో తాగునీటి సమస్యకు ఇంకా తెరపడలేదు. నీటి ఎద్దడి ఇంకా కొనసాగుతూనే ఉంది. తాగడానికి, స్నానాలకు కూడా నీళ్లు దొరకక అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. నీటి ట్యాంకర్ల వద్ద యుద్ధాలే జరుగుతున్నాయి. ప్రజలందరూ ట్యాంకర్ వచ్చిందని తెలిస్తే చాలు వచ్చి వాలిపోయి బిందె నీటి కోసం కొట్లాటలకు దిగుతున్నారు.
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
Bengaluru Water Crisis: నీళ్లు లేవు బాబోయ్.. ఖాళీ అవుతున్న ఐటీ కార్యాలయాలు.. ఇంటి బాట పట్టిన ఉద్యోగులు
బెంగళూరు నగరంలో తాగునీటి సమస్యకు ఇంకా తెరపడలేదు. నీటి ఎద్దడి ఇంకా కొనసాగుతూనే ఉంది. తాగడానికి, స్నానాలకు కూడా నీళ్లు దొరకక అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. నీటి ట్యాంకర్ల వద్ద యుద్ధాలే జరుగుతున్నాయి. ప్రజలందరూ ట్యాంకర్ వచ్చిందని తెలిస్తే చాలు వచ్చి వాలిపోయి బిందె నీటి కోసం కొట్లాటలకు దిగుతున్నారు.
Rohit Sharma : రోహిత్ కు అన్యాయం జరిగిందా? లేక తనంతట తానే ఈ పరిస్థితిని తెచ్చుకున్నాడా?
ఇండియన్ కెప్టెన్ గా రోహిత్ శర్మ అరుదైన రికార్డులను సొంతం చేసుకున్నాడు. రోహిత్ శర్మ సీనియారిటీ, సిన్సియారిటీని చూసిన బీసీసీఐ ఆయనకు వరల్డ్ టీ 20 కప్ పగ్గాలు కూడా అప్పగించింది. మైదానంలో ఆటగాళ్లు త్వరగా అవుటయినా.. ప్రత్యర్థి సిక్సర్, ఫోర్ కొట్టినా, క్యాచ్ మిస్ అయినా ఆటగాళ్లపై చిరాకు పడటం రోహిత్ బలహీనత కావచ్చు.
IPL 2024 : కొత్త.. కెప్టెన్సీ వచ్చినా.. ...జెర్సీ ఛేంజ్ అయినా.. మరి జట్టు మారుతుందా?
IPL 2024 :మరో రెండు రోజుల్లో ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం కానుంది. సన్ రైజర్స్.. పేరులోనే రైజర్స్ కానీ గత ఐపీఎల్ లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. సన్ రైజర్స్ హైదరాబాద్కు విపరీతమైన ఫ్యాన్స్ ఉండేవారు. కానీ అది ఒకప్పుడు. కానీ ఆ టీం గత రెండు సీజన్ లో చూపించిన పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత హైదరాబాద్ జట్టు ఫైనల్స్ చేరుకోవడం మాట అటుంచి... కనీసం సెమీ ఫైనల్స్ కు చేరుకుంటుందా?
Ap Politics : నా మీద కులముద్ర వేసినా సరే.. నా మద్దతు ఆ పార్టీకే
ఆంధ్రప్రదేశ్ లో తన మద్దతు ఎన్డీఏ కూటమికేనని లోక్సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ తెలిపారు. రేపటి నుంచి తనపై కులముద్ర వేస్తారని తెలుసునని, అయినా రాష్ట్ర అభివృద్ధి కోసం తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన తెలిపారు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు ఇవ్వాలని ఆయన ప్రజలకు పిలుపు నిచ్చారు. ఈ కూటమితోనే రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Actor Mohan Babu: "Vote for Glass"- జనసేనకి ఓటు వెయ్యండి అంటున్న మోహన్ బాబు, మనోజ్..
"Vote for Glass"-ఏపీలో రానున్న అసెంబ్లీ ఎన్నికల చాలా రసవత్రంగా మారాయి. వైస్సార్సీపీ, టీడీపీ, జనసేన, కాంగ్రెస్, బీజేపీ.. ఇలా ఐదు పార్టీల నుంచి బలమైన నేతలు బరిలో నిలుస్తున్నారు. వీరిలో ఎవరు గెలుస్తారు అన్నది చాలా ఆసక్తికరంగా మారింది. కాగా పవన్ కళ్యాణ్ కి ఈసారి ఫిలిం ఇండస్ట్రీ నుంచి కొంచెం సపోర్ట్ వస్తున్నట్లు కనిపిస్తుంది. గత ఎన్నికల్లో జనసేన గురించి సినీ పరిశ్రమకి చెందిన ఏ వ్యక్తి మాట్లాడలేదు.
How To Apply ISRO student project Trainee: ఇంటర్న్షిప్, స్టూడెంట్ ప్రాజెక్ట్ ట్రైనీ స్కీమ్లను తీసుకొచ్చిన ఇస్రో
How To Apply ISRO student project Trainee:ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ఇటీవల ఇంటర్న్షిప్ స్కీమ్, స్టూడెంట్ ప్రాజెక్ట్ ట్రైనీ స్కీమ్లను తీసుకుని వచ్చింది. స్పేస్ సైన్స్, సాంకేతిక రంగంలో ప్రతిభను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ స్కీమ్ లను ప్రవేశపెట్టింది. ఈ విభాగంలో ఆసక్తిని కొనసాగించడానికి, ఆచరణాత్మక అనుభవాన్ని పొందాలనుకునే భారతదేశానికి చెందిన విద్యార్థులకు ఈ కార్యక్రమాన్ని తీసుకుని వచ్చారు.
TeaTime Uday Tangella : టీ టైం నుంచి గ్లాస్ పార్టీ వరకూ.. కాకినాడ ఎంపీ అభ్యర్థిగా... ప్రస్థానం అదిరిపోయిందిగా
కాకినాడ పార్లమెంటు స్థానానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. కాకినాడ పార్లమెంటు నుంచి ఉదయ్ పోటీ చేస్తారని ఆయన ప్రకటించారు. మరో మాట కూడా అన్నారు. అమిత్ షా, మోదీ తనను పార్లమెంటుకు పోటీ చేయమంటే తాను కాకినాడ నుంచి ఉదయ్ పిఠాపురం నుంచి తాను పోటీ చేస్తామని కూడా పవన్ ప్రకటించారు.
Sim Card New Rules: సిమ్ కార్డులపై కొత్త రూల్.. జూలై 1 నుంచి అమలు
మీరు మొబైల్ వినియోగదారు అయితే సిమ్ కార్డ్ ఉపయోగిస్తుంటే మీరు జాగ్రత్తగా ఉండాలి. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే TRAI SIM కార్డ్లకు సంబంధించి కీలక మార్పు చేసింది. ఇది జూలై 1, 2024 నుండి అమలు కానుంది. ఈ నియమం భారతదేశంలోని SIM కార్డ్ వినియోగదారులకు వర్తిస్తుంది.
Foods for diabetes:డయాబెటిస్ వారికి ఏ పిండి రొట్టె తింటే షుగర్ లెవల్ పెరగదు!
Foods for diabetes:మధుమేహం అనేది మీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన వ్యాధి. శరీరంలో రక్తంలో చక్కెర స్థాయి పెరిగినప్పుడు మధుమేహం వస్తుంది. మధుమేహం నియంత్రణలో ఉండాలంటే మందులతో పాటు ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇది నియంత్రించబడకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. గుండె జబ్బులు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, కళ్ళు వంటి శరీరంలోని అనేక భాగాలను దెబ్బతీస్తుంది. చక్కెరను నియంత్రించడంలో సహాయపడే పిండితో చేసిన రొట్టె గురించి తెలుసుకుందాం.
TDP : తమ నేతకు టిక్కెట్ ఇవ్వాలంటూ టీడీపీ నేత పురుగుల మందు తాగి?
నరసరావుపేట టిక్కెట్ ను అరవిందబాబుకు ఇవ్వాలంటూ టీడీపీ కార్యకర్త ఆత్మహత్యకు ప్రయత్నించారు. పురుగుల మందు తాగిన రామిరెడ్డిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నరసరావుపేట టీడీపీ టిక్కెట్ ను అరవిందబాబుకే ఇవ్వాలంటూ టీడీపీ నేతలు గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు.