టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
మళ్ళీ విజృంభిస్తున్న కరోనా.. ,వాలంటీర్లకు ఊహించని గుడ్ న్యూస్, ఉగ్రం-సలార్ పోలికపై.. ఇప్పుడా చెప్పేది
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
JN.1 Variant : మళ్ళీ విజృంభిస్తున్న కరోనా.. పెరుగుతున్న కేసులు మరణాలు..
దేశవ్యాప్తంగా కరోనా మళ్ళీ విజృంభిస్తుంది. JN.1 అనే కొత్త వేరియంట్ ప్రజలని మళ్ళీ భయబ్రాంతులకు గురి చేస్తుంది. భారత్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతూ మళ్ళీ పాత రోజులను గుర్తు చేస్తుంది. గడిచిన 24 గంటల్లో ఇండియా వైడ్ 358 కేసులు నమోదు కాగా ఆరుగురు మరణించినట్లు సమాచారం.
ఉగ్రం-సలార్ పోలికపై.. ఇప్పుడా చెప్పేది
సలార్ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుండి కొంత మంది సినీ అభిమానులు ఈ సినిమా కన్నడ బ్లాక్ బస్టర్ 'ఉగ్రం' రీమేక్ అంటూ చెప్పుకొచ్చారు. ఉగ్రం సినిమాను బాగా రిచ్ గా భారీ ఎత్తున తీస్తున్నాడు ప్రశాంత్ నీల్ అంటూ కొందరు సోషల్ మీడియాలో అదే పనిగా ప్రచారం చేశారు. అది కూడా ప్రశాంత్ నీల్ తీసిన సినిమానే!!
వారందరి చేతుల్లోకి 4.34 లక్షల ట్యాబ్ లు
ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల చేతుల్లోకి ట్యాబ్ లు వచ్చేసాయి. 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబ్ ల పంపిణీని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వరుసగా రెండో ఏడాది కూడా విద్యార్థులకు ప్రభుత్వం ట్యాబ్ లను ఇస్తోంది.
వాలంటీర్లకు ఊహించని గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రాగానే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకుని వచ్చారు. ఇదొక విప్లవాత్మక నిర్ణయం అంటూ వైసీపీ నేతలు చెబుతూ వస్తున్నారు. చాలా సమయాల్లో ఈ వాలంటీర్ వ్యవస్థ గొప్పగా పని చేసిందని కూడా ప్రశంసలు దక్కాయి. ప్రతి పక్షాలు ఈ వ్యవస్థపై సంచలన ఆరోపణలు కూడా చేశాయి.
పవన్ కళ్యాణ్ కు ఆ ఎన్నికలను గుర్తు చేసిన సజ్జల
వచ్చే ఎన్నికల కోసం మారీచ శక్తులు మళ్లీ ఏకమయ్యాయని.. సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఓడించడానికి ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టాయని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. 2019 ఎన్నికల్లో టీడీపీకి పవన్ కళ్యాణ్ ఎందుకు మద్దతివ్వలేదని ప్రశ్నించారు. ఇప్పుడు ఎందుకు చేతులు కలిపారో ప్రజలకు చెప్పాలని అన్నారు.
ఇకపై పార్లమెంట్ కు పహారా వారే!!
ఇటీవల లోక్ సభలో భద్రతా ఉల్లంఘన ఘటన దేశం మొత్తాన్ని కుదిపేసింది. అంత ధైర్యంగా ఎలా వచ్చారనే విషయాన్ని చాలా మందికి షాకింగ్ గా నిలిచింది. ఈ ఘటన తర్వాత కేంద్రం అప్రమత్తమైంది. పార్లమెంట్ భవనం భద్రతను మరింత పటిష్టం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. లోక్ సభ, రాజ్యసభ భవనాల భద్రతను CISF బలగాలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Hyderabad : వైన్ షాప్‌లను తొలిగించాలంటూ హయత్ నగర్ వాసులు ధర్నా..
మద్యం షాపులతో సాధారణ ప్రజలకు ఎప్పుడూ ఇబ్బంది ఎదురవుతూనే ఉంటుంది. ఇక జనావాసాల మధ్య బార్ షాపులు పెట్టడం వల్ల అక్కడ నివసించే ప్రజలు.. తాగుబోతులు, పోకిరిలతో సమస్యలు ఎదుర్కోవడం అనేది తప్పదు. తాజాగా హైదరాబాద్ హయత్ నగర్ డివిజన్ లో వీరభద్ర కాలనీ వాసులు.. వైన్ షాప్ తొలిగించాలంటూ ధర్నా చేపట్టారు.
Yatra 2 : వైఎస్ జగన్ బర్త్‌డే కానుకగా యాత్ర 2 ఫస్ట్ లుక్..
నేడు డిసెంబర్ 21న ఏపీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బర్త్ డే సందర్భంగా ప్రతి ఒక్కరు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా జగన్ కి విషెస్ తెలియజేశారు. ఇక జగన్ లైఫ్ స్టోరీ కథాంశంతో తెరకెక్కుతున్న సినిమాల నుంచి బర్త్ డే కానుకలు ఆడియన్స్ ముందుకు వచ్చాయి.
Chhattisgarh : పుష్ప సినిమా చూసి స్ఫూర్తి పొందారేమో.. అంబులెన్స్‌లో స్మగ్లింగ్..
ఈ మధ్య సినిమాలు చూసి జనాలు బాగా స్ఫూర్తి పొందుతున్నారట. సినిమాల్లో తెలివిగా చేసే క్రైమ్ లని అలానే బయట చేస్తూ నేరాలకు పాల్పడుతున్నారు. ఈక్రమంలోనే గతంలో పుష్ప సినిమా చూసి ఎర్రచందనం స్మగ్లింగ్ ని పాల్పడిన సంఘటనలు విన్న సంగతి తెలిసిందే.
కబడ్డీ క్రీడాకారిణికి అర్జున అవార్డు..!
కబడ్డీ క్రీడాకారిణిని అర్జున అవార్డు వరించింది. హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్ జిల్లాలోని షిల్లైకు అసెంబ్లీ చెందిన శిరోగ్ కుమార్తె రీతు నేగి. భారత మహిళా కబడ్డీ జట్టు కెప్టెన్. రీతు నేగి నిన్న ప్రకటించిన 2023 అర్జున అవార్డుకు ఎంపికైంది. రీతు నేగి ఎంపికతో జిల్లా సిర్మౌర్‌లో ఆనందం వెల్లివిరిసింది