21May-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
ఉత్తర్ప్రదేశ్ లో ఒక షూ కంపెనీ వ్యాపారి ఇంట్లో కరెన్సీ కట్టలు బయటపడ్డాయి. ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలో విస్తుబోయే విధంగా నగదు కట్టలు బయటపడటంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఒక చెప్పుల వ్యాపారి ఇంట్లో 100 కోట్ల రూపాయలు ఆదాయపు పన్ను శాఖ అధికారులు సీజ్ చేశారు.
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
కరెన్సీ కట్టలు... ఈ వ్యాపారి ఇంట్లో ఇంత పెద్దమొత్తంలో నగదు లభించడమా?
ఉత్తర్ప్రదేశ్ లో ఒక షూ కంపెనీ వ్యాపారి ఇంట్లో కరెన్సీ కట్టలు బయటపడ్డాయి. ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలో విస్తుబోయే విధంగా నగదు కట్టలు బయటపడటంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఒక చెప్పుల వ్యాపారి ఇంట్లో 100 కోట్ల రూపాయలు ఆదాయపు పన్ను శాఖ అధికారులు సీజ్ చేశారు.
Ap Elections : ఆరుగురు మాజీ సీఎంల కుమారులు...ఈసారి గెలిచేదెవరో?
ఆరుగురు మాజీ ముఖ్యమంత్రి కుమారులు ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో రంగంలో ఉన్నారు. వీరిలో ఎవరు గెలుస్తారు? ఎవరు తండ్రి పేరును నిలబెడతారన్నది మాత్రం ఆసక్తికరంగానే సాగుతుంది. ఆంధ్రప్రదేశ్ 2014 ఎన్నికల వరకూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ల తనయులు ఈసారి ఒక్కో పార్టీ నుంచి తలపడుతున్నారు. మూడు ప్రధాన పార్టీల్లోనూ మాజీ ముఖ్యమంత్రుల కుమారులు పోటీ చేస్తున్నారు.
మృత్యువు ఇలా కూడా వచ్చేయొచ్చు
మృత్యువు ఎప్పుడు? ఎలా? ముంచుకొస్తుందో తెలియదు. మనకు తెలియకుండానే దాని ఒడిలో ఒదిగిపోవాల్సిన పరిస్థిితి వస్తుంది. అందుకు తాజా ఉదాహరణ బొల్లారం కంటోన్మెంట్ ఆసుపత్రిలో జరిగిన ఘటనే ఉదాహరణ అని చెప్పాలి. చికిత్స నిమిత్తం బొల్లారం కంటోన్మెంట్ ఆసుపత్రికి దంపతులు ద్విచక్ర వాహనంపై వచ్చారు. ఆసుపత్రి ప్రాంగణంలోకి వస్తుండగా ఒక చెట్టు విరిగి వారిపై పడింది.
Ap Elections : ఉత్తరాంధ్రలో ఊపు ఆ పార్టీకే ఉందంటగా.. అందుకే అంత ధైర్యంగా ఉన్నారా?
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తయినా పార్టీ నేతలు ఇంకా పోస్టుమార్టం చేసుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి నివేదికలు తెప్పించుకుని పోలింగ్ ఎవరికి అనుకూలంగా జరిగిందన్న దానిపై ఒక స్టడీ చేస్తున్నారు. పోలింగ్ కు, ఫలితాల వెల్లడవడానికి ఇరవై రోజులు సమయం ఉండటంతో లెక్కలతో కాలక్షేపం చేస్తున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే సీట్లు పెరుగుతాయా?
Bengaluru Water Crisis : అకాల వర్షాలు.. బెంగళూరు నగరానికి మాత్రం వరమేగా?
బెంగళూరు నగరంలో తాగునీటి సమస్య తీరినట్లే. వర్షాలు కురుస్తుండటంతో నీటి ఎద్దడి నుంచి బెంగళూరు నగరం బయటపడింది. ఎగువన వర్షాలు పడటంతో కావేరి నదిలో నీరు వచ్చి చేరుతుండటంతో చాలా వరకూ నీటి ఎద్దడి ప్రమాదం తప్పి పోయినట్లే. దీంతో పాలకుల నుంచి నగరవాసులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు భూగర్భ జలాలు పెరగడంతో బోరు నీరు కూడా పుష్కలంగా వస్తుండటంతో సాధారణ స్థితికి బెంగళూరు నగరం చేరుకున్నట్లే కనిపిస్తుంది.
Ap Elections : పెద్దారెడ్డి సవాల్ విన్నారా? జేసీ కాలుదువ్వడాన్ని చూశారా? తాడిపత్రిని ఆపేదెవరు?
కొడవళ్లు.. కత్తులు... నాటు బాంబులు.. హత్యలు.. ప్రతీకార ఘర్షణలు.. తాడిపత్రి నియోజకవర్గం ఒకప్పుడు అట్టుడికిపోయేది. రెండు వర్గాల మధ్య జరిగే ఘర్షణలో ఎందరో అమాయకులు బలయ్యారు. వారి కుటుంబాలు ఇప్పటికీ కోలుకోలేదు. అలాంటి తాడిపత్రిలో మళ్లీ ఇప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేచినట్లే కనపడుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఘర్షణలు జరిగాయి. పోలీసులు కూడా ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయారంటే అతిశయోక్తి కాదేమో.
హైదరాబాద్ లో ఏసీబీ సోదాలు.. ఆరు చోట్ల ఏకకాలంలో
ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న సమాచారంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు హైదరాబాద్ లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి హైదరాబాద్ నగరంలోని ఆరు ప్రదేశాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ అధికారులు దాడులు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆయన ఇంటితో పాటు బంధువులు, సన్నిహితుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు సోదాలు జరుపుతున్నారు.
Breaking : అనంతపురంలో ఎన్ఐఏ సోదాలు
అనంతపురం జిల్లాలో రాయదుర్గంలో నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ తనఖీలు నిర్వహిస్తుంది. దీంతో పట్టణంలో ఒకింత కలకలం రేగింది. రిటైర్డ్ హెడ్ మాస్టర్ అబ్దుల్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దీంతో ఏం జరుగుతుందో అర్ధం కాక ప్రజలు ఆందోళనలో ఉన్నారు. అనంతపురంలో ఎన్ఐఏ అధికారుల సోదాలు హాట్ టాపిక్ గా మారింది.
26న మావోయిస్టుల బంద్ కు పిలుపు
మావోయిస్టులు బంద్ కు పిలుపు నిచ్చారు. మే 26న బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపు నిచ్చింది. బీజాపూర్, సుకుమా ధంతేవాడ జిల్లాల బంద్ కు పిలుపు ఇచ్చింది. ఇటీవల ఛత్తీస్గడ్ దండకారణ్యంలో వరసగా జరగుతున్న ఎదురుకాల్పుల్లో పదుల సంఖ్యలో మావోయిస్టులు మరణించిన నేపథ్యంలో బంద్ కు పిలుపు నిచ్చారు.
Arogya Sri : రేపటి నుంచి ఏపీలో ఆరోగ్య శ్రీ సేవల నిలిపివేత
రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్య శ్రీ సేవలను నిలపివేస్తున్నట్లు స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం తెలిపింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖలో తెలియజేసింది. మే 22వ తేదీ నుంచి ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. పెండింగ్ బిల్లులు అధిక మొత్తంలో రావాల్సి ఉండటంతో దానిని నిలిపేయాలని నిర్ణయించుకున్నామని చెప్పింది.