21June-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
తెలంగాణ రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఉపా ధ్యాయ బదిలీల ప్రక్రి యలో భాగంగా మల్టీ జోన్-2లోని ఉపాధ్యాయు లు బదిలీకి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించనుందని తెలిసింది. ఒకే చోట కనీసం రెండేళ్లు సర్వీసు పూర్తి చేసు కున్న ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా నిర్ణయించారు.
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
Telangana : టీచర్లకు గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్
తెలంగాణ రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఉపా ధ్యాయ బదిలీల ప్రక్రి యలో భాగంగా మల్టీ జోన్-2లోని ఉపాధ్యాయు లు బదిలీకి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించనుందని తెలిసింది. ఒకే చోట కనీసం రెండేళ్లు సర్వీసు పూర్తి చేసు కున్న ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా నిర్ణయించారు.
T20 World Cup 2024 : ఈ పెద్దోళ్లున్నారే.. టెన్షన్ పెట్టడానికి తప్ప ఎందుకూ పనికి రావడం లేదుగా
టీ 20 వరల్డ్ కప్ లో భారత్ సూపర్ 8లో నూ శుభారంభం చేసింది. ఆప్ఘనిస్థాన్ పై విజయం సాధించింది. 47 పరుగుల తేడాతో ఆప్ఫనిస్థాన్ పై విజయం సాధించిన భారత్ జట్టు క్రికెట్ ఫ్యాన్స్ కు కొంత ఆనందం కలిగించినా.. అదే సమయంలో ఆందోళన కూడా నెలకొని ఉంది. ఎందుకంటే సీనియర్ ఆటగాళ్లు వరసగా విఫలమవుతుండటం జట్టు పరిస్థిితి చెప్పకనే చెబుతుంది.
Telangana : అంకెలే అన్నీ సెట్ చేస్తాయి.. ఏపీలో ఒకలా.. తెలంగాణలో మరొకలా?
నిజం.. రాజకీయాల్లో అంకెలే ముఖ్యం. అంకెలే నిర్ణయాలను నిర్దేశిస్తాయి. అవి ప్రజోపయోగమో? లేదో? తెలిపేవి కూడా అంకెలే. పాలిటిక్స్ లో అంకెలకున్న ప్రాధాన్యత మరెక్కడా ఉండదు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అదే జరుగుతుంది. మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికల ఫలితాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు ప్రధాన నిర్ణయాలకు కీలకంగా మారాయనడంలో సందేహం లేదు.
Andhra Pradesh : ఏపీకి గుడ్ న్యూస్ ఇక రాష్ట్రంలోనే షూటింగ్లు.. రెడీ అయిపోతున్న నిర్మాతలు
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారింది. కొత్త ప్రభుత్వంలో ప్రధానంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు. జనసేన పార్టీకి సినిమాటోగ్రఫీ శాఖ లభించింది. ఆ శాఖను జనసేనకు చెందిన కందుల దుర్గేష్ చూస్తున్నారు. దీంతో పాటు స్వతహాగా చంద్రబాబు నాయుడు ఏపీలో టూరిజంతో పాటు సినిమా షూటింగ్ లను కూడా ప్రోత్సహిస్తారు.
BRS : మేలుకుంటే మేలు... లేకుంటే అసలుకే ఎసరు... గ్రౌండ్ లెవెల్ లో సిట్యుయేషన్ ఇదే బాసూ
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ ఫాం హౌస్ కే పరిమితయ్యారు. ఆయన పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రజల్లోకి రావడం మానేశారు. దీంతో కార్యకర్తలు డీలా పడిపోయారు. నేతలు కూడా వెళ్లిపోతున్నారు. తాజాగా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారిపోయారు. మరికొంతమంతి లైన్ లో ఉన్నారని చెబుతున్నారు.
మల్లారెడ్డి కూడా కాంగ్రెస్ లోకి వస్తానంటున్నారు : దానం
తెలంగాణలో బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం పై దానం నాగేందర్ స్పందించారు. మీడియాతో ఆయన చిట్ చాట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు మరో 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
Breaking: రైతు రుణమాఫీ వీరికేనట.. క్లారిటీ వచ్చేసినట్లే
తెలంగాణ మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. 2023 డిసెంబరు 9 కి ముందు లు తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించింది. రైతు రుణమాఫీపైనే ప్రధానంగా చర్చ జరిగింది. ఈ రుణాలను మాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఆగస్టు 15వ తేదీ నాటికి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పారు. రైతులకు సంబంధించిన అజెండాగానే ఈ సమావేశం జరుగుతుంది.
Road Accident : బోల్తా పడిన బస్సు .. నలుగురి మృతి
హిమాచల్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో ఈరోజు ఉదయం జరిగిన బస్సు ప్రమాదంలో నలుగురు మరణించగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. జుబ్బల్ లోని గిల్తాడి రోడ్డుపై బస్సు బోల్తా పడి ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఉదయగిరిలో చిరుత పులి సంచారం.. హడలిపోతున్న ప్రజలు
నెల్లూరు జిల్లా ఉదయగిరిలో చిరుత పులి సంచారం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంది. మేకపాటి గౌతం రెడ్డి కళాశాల సమీపంలో గల అటవీశాఖ నర్సరీ పై భాగంలో చిరుత తిరిగినట్లు స్థానికులు గుర్తించారు. ఈ మేరకు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. నిన్న రాత్రి మేకల మంద నుంచి తప్పిపోయిన మేక పై చిరుత దాడి చేసినట్లు గ్రామస్థులు చెబుతున్నారు.
జులై 2వ తేదీ నుంచి సీఐఎస్ఎఫ్ ఆధీనంలోకి గన్నవరం ఎయిర్పోర్టు
గన్నవరంలోని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం భద్రతను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ తీసుకోనుంది. తాజాగా ఎయిర్పోర్టు అథారిటీ.. డీజీపీకి లేఖ రాసింది. జులై 2వ తేదీ నుంచి సీఐఎస్ఎఫ్ ఆధీనంలోకి విమానాశ్రయం భద్రత వెళ్తుందని డీజీపీకి రాసిన లేఖలో ఎయిర్ పోర్టు అథారిటీ పేర్కొంది