టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల డేట్ ఫిక్స్! సలార్ ట్విట్టర్ రివ్యూ..గుడ్‌న్యూస్.., తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర, Pallavi Prashanth: బ్రేకింగ్.. బెయిల్ వచ్చింది
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు
హన్మకొండ జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎల్కతుర్తి మండలం పెంచికలపేట సమీపంలోని శాంతినగర్ వద్ద ఎదురుగా వస్తున్న కారును ఓ లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
Salaar Review : సలార్ ట్విట్టర్ రివ్యూ.. పబ్లిక్ టాక్ ఏంటి..?
ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ మెయిన్ లీడ్స్ లో ఫ్రెండ్షిప్ కథాంశంతో ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన మూవీ 'సలార్'. రెండు పార్టులుగా రూపొందుతున్న ఈ సినిమా మొదటి భాగం 'సీజ్ ఫైర్' నేడు ఇండియా వైడ్ భారీ స్థాయిలో రిలీజ్ అయ్యింది. ఆల్రెడీ కొన్ని చోట్ల బెనిఫిట్ షోలు పడిపోయాయి.
హైదరాబాద్ లో రిస్క్ చేసి ప్రజల ప్రాణాలను కాపాడిన ట్రాఫిక్ పోలీసులు
హైదరాబాద్ ఎర్రమంజిల్ కాలనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పంజాగుట్ట సమీపంలో ఎర్రమంజిల్ కాలనీలో ఉన్న భవనం ఆరో అంతస్తులోని పెంట్‌హౌస్‌లో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్‌తో దట్టమైన పొగలు వ్యాపించడంతో అందులో ఉంటున్న కుటుంబం బయటకు రాలేకపోయింది.
సింగరేణి ఎన్నికల విషయంలో ఇలా డిసైడ్ అయిన కేసీఆర్
సింగరేణి ఎన్నికలకు తెలంగాణ హైకోర్టు ఇటీవలే అనుమతి ఇచ్చింది. అయితే కోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 27న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధ సంఘమైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పోటీ చేయవద్దని ఆయన ఆదేశించారు.
LPG Gas Price: గుడ్‌న్యూస్.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర
మరో వారం రోజుల్లో ఈ ఏడాది ముగియనుంది. కొత్త సంవత్సరానికి ముందు గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్ చెప్పాయి ఆయిల్ కంపెనీలు. గ్యాస్ సిలిండర్ ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరపై 39 రూపాయలు తగ్గింది. ఈ తగ్గింపు 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్‌పై ఉంది.
Pallavi Prashanth: బ్రేకింగ్.. బెయిల్ వచ్చింది
బిగ్ బాస్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్ కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బిగ్ బాస్ లో విన్నర్ అయిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో వద్ద నానా రచ్చ జరిగింది. ఈ ఘటనలో పోలీసులు పల్లవి ప్రశాంత్ ను అరెస్టు చేశారు. ఇప్పటికే పోలీసులు పలువురిని అరెస్టు చేయడంతో పాటు.. పల్లవి ప్రశాంత్అతని సోదరుడిని కూడా అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.
వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెండింగ్ చలాన్లపై భారీగా డిస్కౌంట్‌ను ప్రకటించబోతోందని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే..! అయితే ఇప్పుడు పెండింగ్ చలాన్ల విషయంలో తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని తేలింది. 2 కోట్లకు పైగా పెండింగ్ చలాన్లు ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం రాయితీ కల్పించాలని నిర్ణయం తీసుకుంది.
ఒకే కారులో బావాబామ్మర్ధులు.. కేటీఆర్, హరీష్‌రావు ఫోటోలు వైరల్
మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావుల ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చిన విషయం విధితమే. ఇందులో భాగంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల డేట్ ఫిక్స్!
ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. మార్చి చివర్లో లేదా ఏప్రిల్ మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరిగే అవకాశాలున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు లోక్‌సభ ఎన్నికలు కూడా ఒకేసారి జరగనున్నాయి. ఫిబ్రవరి మూడోవారంలో ఎన్నికల సంఘం ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
అనూహ్యం.. దక్షిణాఫ్రికా నుండి తిరిగొచ్చిన విరాట్ కోహ్లీ
భారత క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటిస్తుండగా.. విరాట్ కోహ్లీ అనూహ్యంగా భారత్ తిరిగొచ్చాడు. కోహ్లీ కుటుంబపరమైన ఎమర్జెన్సీ కారణంగా స్వదేశానికి వచ్చాడని, దక్షిణాఫ్రికాతో డిసెంబరు 26 నుంచి జరిగే తొలి టెస్టు నాటికి జట్టుతో కలుస్తాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
కశ్మీర్ లో ఉగ్రవాదుల ఘాతుకం
జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదులు మరో దారుణానికి ఒడిగట్టారు. సైనిక కాన్వాయ్‌పై ఉగ్రవాదులు జరిపిన మెరుపు దాడిలో ఐదుగురు జవాన్లు అమరులయ్యారు. పూంఛ్ జిల్లాలోని డేరా కి గలి సమీపంలో రెండు సైనిక వాహనాలపై గురువారం మధ్యాహ్నం సాయుధ ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు.