22August-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ముంబై నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానానికి ఈ బెదిరింపు రావడంతో తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో నిలిపి తనిఖీలు జరిపారు. ఉదయం ఎనిమిది గంటలకు తిరువనంతపురం విమానాశ్రయంలో ఐసొలేషన్ బేకు తనిఖీలు చేశారు.
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
విమానానికి బాంబు బెదిరింపు
ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ముంబై నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానానికి ఈ బెదిరింపు రావడంతో తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో నిలిపి తనిఖీలు జరిపారు. ఉదయం ఎనిమిది గంటలకు తిరువనంతపురం విమానాశ్రయంలో ఐసొలేషన్ బేకు తనిఖీలు చేశారు.
17కు చేరిన అనకాపల్లి సెజ్ మృతుల సంఖ్య
అనకాపల్లి అచ్యుతాపురం సెజ్ లో మృతుల సంఖ్య పదిహేడుకు పెరిగింది. నిన్న మధ్యాహ్నం ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ఫార్మా కంపెనీలో లో రియాకర్ట్ పేలిన సంగతి తెలిసిందే. ఈ పేలుడు దాటికి భారీగా ప్రాణ నష్టం సంభవించింది. అరవై మందికి పైగా గాయపడ్డారు.
Andhra Pradesh : ఏపీలో వాహనదారులకు గుడ్ న్యూస్.. త్వరలో తగ్గనున్న పెట్రోలు, డీజిల్ ధరలు
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడినా ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీపై చేసిన విమర్శలకు మాత్రం తాము చెక్ పెట్టేందుకు ప్రయత్నించడం లేదు. నాడు రాజకీయంగా విమర్శలు చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం వాటి గురించి పట్టించకోవడం మానేశారు.
Ranganadh : ఒక్కసారిగా హీరో అయిపోయిన హైడ్రా కమిషనర్ రంగనాధ్
హైదరాబాద్ జంట నగరాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా హైడ్రా గురించే. దాని కమిషనర్ రంగనాధ్ పైనే. అక్రమ నిర్మాణాలను కూల్చివేతలపై హైడ్రా దృష్టి పెట్టింది. గత కొన్ని రోజులుగా అక్రమంగా నిర్మించిన భవనాలను కూల్చివేస్తుంది. గత నెల రోజుల నుంచి చెరువుల కబ్జా పై ఫోకస్ పెట్టింది.
BJP : అలక బూనారా? లేక అసహనంతో ఉన్నారా? ఇంతకీ రీజన్ ఏంటి బాసూ?
ఎన్నికలకు ముందు వరకూ దూకుడుగా ఉన్న నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ పూర్తిగా సైలెంట్ అయిపోయారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పడు ఒంటి కాలి మీద లేచిన ధర్మపురి అరవింద్ తర్వాత పెద్దగా ఎక్కడా కనిపించడం లేదు. అరవింద్ రెండుసార్లు నిజామాబాద్ ఎంపీగా విజయం సాధించారు.
Telangana : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. షెడ్యూల్ వచ్చేసింది
తెలంగాణలో నిరుద్యోగులకు టీజీపీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూపు-2 పరీక్షలకు షెడ్యూల్ విడుదల చేసింది. గ్రూపు 2 పరీక్షలను డిసెంబరు 15, 16 తేదీల్లో నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ అధికారికంగా ప్రకటించింది. వాస్తవానికి గ్రూప్ 2 పరీక్షలు ఈ నెల 7, 8 తేదీల్లో జరగాల్సి ఉన్నా అభ్యర్థుల వినతి మేరకు దానిని ప్రభుత్వం వాయిదా వేసింది.
Hyderabad : హైదరాబాద్ లో వింత ప్రచారం.. ఎవరూ నమ్మొద్దంటున్న పోలీసులు
హైదరాబాద్ లో సోషల్ మీడియాలో ఒక వదంతి వైరల్ గా మారింది. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ ఫోన్ చేస్తే పోలీసు వాహనం వచ్చి ఇంటివద్ద దింపుతుందని ప్రచారం జరుగుతుందన్నారు. పోలీసు వాహనాలు వచ్చి మహిళలను తీసుకెళ్లి దింపుతారని చెప్పడం తప్పుడు ప్రచారమని తెలిపారు.
kalvakuntla Kavitha : ఢిల్లీ ఎయిమ్స్ కు కల్వకుంట్ల కవిత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. దీంతో ఆమెను ఎయిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కవిత ఆరోగ్యం గత కొన్ని రోజులుగా బాగా లేదని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఢిల్లీ ఎయిమ్స్ లో కవితకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న కవిత తరచూ అస్వస్థతకు గురవుతున్నారు.
Breaking : అచ్యుతాపురం మృతుల కుటుంబాలకు కోటి పరిహారం
అచ్యుతాపురంలోని ఫార్మా సెజ్ లో జరిగిన ప్రమాదంపై జిల్లా కలెక్టర్ స్పందించారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. అచ్యుతాపురం సెజ్ లో నిన్న రియాక్టర్ పేలి పదిహేడు మంది మరణించారు. అరవై మంది గాయపడ్డారు. ఈ ఘటనపై స్పందించిన ప్రభుత్వం భారీగా నష్టపరిహారం ప్రకటించింది.
రాహుల్ గాంధీ ప్రాపకం కోసమే రేవంత్ పాట్లు
రైతు రుణమాఫీ, రైతుబంధు ఎప్పుడు చేస్తారో చెప్పాలని మాజీమంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీ సక్రమంగా అమలు చేయలేదని, రైతు బంధు ఇంతవరకూ అమలు చేయలేదని కేటీఆర్ అన్నారు. రాహుల్ వద్ద మార్కులు కొట్టేయడానికే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సచివాలయం ముందు పెడుతున్నారని కేటీఆర్ అన్నారు.