April23-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
రేపు బెంగళూరులో జీరో షాడో డే జరగనుంది, బెంగళూరు నగరంలో నీడ కనిపించకుండా దాదాపు ఆరు నిమిషాల పాటు ఉండనుంది. బుధవారం మధ్యాహ్నం 12.17 గంటలనుంచి 12.23 గంటలవరకూ జీరో షాడో ఉంటుందని తెలిపారు. నీడ కనిపించకుండా పోయే ఈ అరుదైన దృశ్యాన్ని తిలకించేందుకు అనేక మంది ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
Bengaluru : రేపు బెంగలూరులో జీరో షాడో
రేపు బెంగళూరులో జీరో షాడో డే జరగనుంది, బెంగళూరు నగరంలో నీడ కనిపించకుండా దాదాపు ఆరు నిమిషాల పాటు ఉండనుంది. బుధవారం మధ్యాహ్నం 12.17 గంటలనుంచి 12.23 గంటలవరకూ జీరో షాడో ఉంటుందని తెలిపారు. నీడ కనిపించకుండా పోయే ఈ అరుదైన దృశ్యాన్ని తిలకించేందుకు అనేక మంది ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.
Pawan Kalyan : పవన్ కు ఆస్తులెన్ని ఉన్నాయో.. అప్పులు కూడా?
ఈరోజు పిఠాపురం జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేసిన సందర్భంలో పవన్ కల్యాణ్ తన ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయిదేళ్ళ సంపాదన రూ.114.76 కోట్లు అని ఆయన ఎన్నికల అఫడవిట్ లో పేర్కొన్నారు. ప్రభుత్వానికి చెల్లించిన పన్నులు రూ.73.92 కోట్ల రూపాయలని చెప్పారు. ఆయన ఇచ్చిన విరాళాలు రూ.20 కోట్ల రూపాయలు న్నాయని తెలిపారు. పవన్ తనకు అప్పులు రూ.64.26 కోట్లు ఉన్నట్లు అఫడవిట్ లో పేర్కొన్నారు.
BJP : వ్యూస్ వచ్చాయని ఓట్లు వచ్చిపడతాయా? పాతబస్తీలో నెగ్గుకు రాగలరా?
తెలంగాణలో అన్ని లోక్‌సభ నియోజకవర్గాల కంటే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది మాత్రం హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గమే. ఎందుకంటే ఇందుకు ప్రత్యేక కారణాలున్నాయి. ఒకరు ముస్లింపార్టీకి చెందిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పోటీ చేస్తుండగా, ఆయనపై రూపంలోనూ, భాష్యంలోనూ హిందుత్వాన్ని కనపరుస్తున్న కొంపెల్ల మాధవీలత బీజేపీ నుంచి బరిలోకి దిగుతుంది.
TDP : నారాయణ ఈసారి సిలబస్ మార్చాడట.. నెగ్గడం కోసం న్యూ స్కూల్ ఓపెన్ చేశాడంట్రోయ్
పొంగూరు నారాయణ... ఆయన రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు సుపరిచితులైన నేత. నారాయణ విద్యాసంస్థల అధినేతగా ఆయన అందరికీ తెలిసిన వాడే. గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన నారాయణ ఈసారి మాత్రం గెలవాలన్న కసితో తిరుగుతున్నారు. గత ఎన్నికల్లో నేర్చుకున్న పాఠాలు ఇప్పుడు ఆయన తనకు కలసి వస్తుందని భావిస్తున్నారు.
T20 World Cup : గెలవాలంటే.. ప్రయోగాలు చేయాల్సిందేనట .. పాత వాసనలకు స్వస్తి చెప్పాలంటున్నారే
టీ 20 వరల్డ్ కప్‌కు సమయం దగ్గర పడుతుంది. మరో రెండు నెలల్లో ప్రారంభం కానుంది. మన దేశంలో కాకపోయినా ఈసారి కప్ కొట్టేటట్లు జట్టు ఎంపిక ఉండాలని భారత్ లో క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. వరల్డ్ కప్ వన్డే కప్ చేజారిపోయిన నేపథ్యంలో టీ 20 వరల్డ్ కప్ లో విజేతగా నిలిచేందుకు జట్టు ఎంపిక ఉపయోగపడాలని ఫ్యాన్స్ ఎక్కువ మంది ఆశలు పెట్టుకుంటున్నారు.
KCR : సారుకు అర్థమయినట్లుంది.. నేల మీద నడిచేటట్లే ఉన్నట్లుందిగా
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ ప్రజల ఇచ్చిన దెబ్బకి దిగివచ్చినట్లే కనపడుతుంది. ఆయన నేల మీదకు నడుస్తున్నట్లే కనపడుతుంది. మూడోసారి ముఖ్యమంత్రి అవ్వాలనుకున్న ఆయనకు గత ఎన్నికల్లో ప్రజలు ఊహించని షాక్ ఇచ్చారు. పోనీ .. ఐదేళ్లు వెయిట్ చేద్దాంలే అనుకుంటే ఒకవైపు ఢిల్లీలోని మోదీ తన కుటుంబ సభ్యులు గుంజుకుని జైల్లో పెడుతున్నారు.
IPL 2024 : ఇంత విధ్వంసమేంటి సామీ.. ఇలాగయితే మిగిలిన జట్ల పరిస్థిత ఏంటి భయ్యా?
ఐపీఎల్ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు దూసుకుపోతుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలుస్తూ వెళుతుంది. మమ్మలి ఎవడు కొట్టేది అంటూ ఒకరు కాకపోతే మరొకరు రాయల్స్ జట్టులో క్లిక్ అవుతుండటంతో ఎంతటి స్కోరునయినా సునాయాసంగా విజయం సాధిస్తుంది.
వాలంటీర్లపై హైకోర్టు కీలక ఆదేశాలు
వాలంటీర్లపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఎంతమంది వాలంటీర్లు రాజీనామా చేశారో వివరాలు ఇవ్వాలని కోరింది. రాజీనామాలు ఎంత మంది చేశారు? ఎంతమంది వాలంటీర్లు రాజీనామా చేయకుండా ఉన్నారో తెలపాలని కోరింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ కు ఏపీ హైకోర్టు ఆదేశించింది.
Supreme Court : పతంజలికి సుప్రీంకోర్టు మరోసారి అక్షింతలు
ఆయుర్వేద సంస్థ పతంజలి సంస్థకి మరోసారి సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది. ప్రజలను తప్పుపట్టించే విధంగా ప్రకటనలు ఇచ్చారని వేసిన పిటీషన్ పై విచారణ జరిగింది. అయితే ఈ సందర్భంగా రాందేవ్ బాబా తరుపున న్యాయవాది ముకుల్ రోహిత్గీ వాదించారు. ఇప్పటికే రాందేవ్ బాబా క్షమాపణలు చెప్పారని, 67 ప్రధాన న్యూస్ పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చారని తెలిపారు.
Malaysia : ఆకాశంలో హెలికాప్టర్లు ఢీ.. పది మంది మృతి
మలేసియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గగనతలనంలో రెండు హెలికాప్టర్లు ఢీకొన్నాయి. పది మంది సిబ్బంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మలేసియా నావికాదళానికి చెందిన హెలికాప్టర్లు ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. ఒక హెలికాప్టర్ నేలమీదపడిపోగా, మరొక హెలికాప్టర్ స్విమ్మింగ్ పూల్ లో పడిపోయింది.