23June-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. డలాస్ లో జరిగిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన విద్యార్థి మరణించాడు. పల్నాడు జిల్లా యాజిలికి చెందిన గోపీకృష్ణ అమెరికాలో ఎంఎస్ చదువు పూర్తి చేశాడు. అనంతరం ఒక స్టోర్ లో పార్ట్ టైం ఉద్యోగం చేస్తన్నాడు. అయితే స్టోర్ లోకి వచ్చిన పదహారేళ్ల యువకుడు గోపీకృష్ణపై కాల్పులు జరిపాడు.
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
Breaking : అమెరికాలో కాల్పులు.. ఏపీ విద్యార్ధి మృతి
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. డలాస్ లో జరిగిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన విద్యార్థి మరణించాడు. పల్నాడు జిల్లా యాజిలికి చెందిన గోపీకృష్ణ అమెరికాలో ఎంఎస్ చదువు పూర్తి చేశాడు. అనంతరం ఒక స్టోర్ లో పార్ట్ టైం ఉద్యోగం చేస్తన్నాడు. అయితే స్టోర్ లోకి వచ్చిన పదహారేళ్ల యువకుడు గోపీకృష్ణపై కాల్పులు జరిపాడు.
Parlament : రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం
రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలుత ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటు సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇప్పటికే ప్రొటెం స్పీకర్ గా భర్తృహరి మహతాబ్ ఎంపికయిన సంగతి తెలిసిందే. ఆయన సభ్యులందరి చేత నూతనంగా ఎన్నికయిన పార్లమెంటు సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకరాం చేసిన తర్వాత లోక్సభ ప్రతిపక్ష నేత ప్రమాణం చేయనున్నారు.
TDP : చంద్రబాబు వారికే ప్రయారిటీ ఇస్తారటగా ఆ 31 మందికి ఏమిస్తారో? హాట్ టాపిక్
అవును.. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే గెలిచిన వాళ్లు సరే. ఎన్నికల్లో టిక్కెట్లు పొంది ఓటమి పాలయిన వాళ్లు సరే. కానీ త్యాగాలు చేసిన తమ్ముళ్ల మాటేమిటి? అన్న చర్చ ఇప్పుడు పార్టీలో జోరుగా సాగుతుంది. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేసింది.
YSRCP : జేసీబీల శబ్దంతో దడ... ఎప్పుడు ఏది కూలుస్తారోనన్న టెెన్షన్.. ఆక్రమిస్తే అంతేగా.. అంతేగా..!
వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయాలకు వరస నోటీసులు అందుతున్నాయి. ఇప్పటికే తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని సీఆర్డీఏ అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఇక జిల్లాల్లో కూడా అధికారులు వరసగా నోటీసులు పంపుతున్నారు. గత ఐదేళ్లలో అన్ని జిల్లాల్లో వైసీపీ కార్యాలయాలను నిర్మించాలని నాయకత్వం నిర్ణయించింది.
Etala Rajender : దమ్మున్నోడే పగ్గాలు చేపట్టాలి
మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పోరాటం చేసే వాళ్లే నియమితులు కావాలని మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ అన్నారు. దమ్మున్నోడు వస్తేనే పార్టీ మరింత బలోపేతం అవుతుందని అన్నారు. గల్లీ లీడర్లు, వీధి నాయకులు నాయకత్వం చేపడితే పార్టీ బలోపేతం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఫేక్ పియాజియో పార్ట్స్ అమ్ముతూ.. అడ్డంగా దొరికిపోయారు
వాహనాలకు సంబంధించిన స్పేర్ పార్ట్స్ విషయంలో చాలా అనుమానాలు ఉంటాయి. సాధారణంగా షో రూమ్ లకు వెళితే చాలా ఎక్కువ డబ్బులు వసూలు చేస్తుంటారనే భయం మనందరికీ ఉంటుంది. అలాగని లోకల్ మెకానిక్ దగ్గరకు వెళితే ఎలాంటి స్పేర్ పార్ట్స్ అమ్ముతారో.. అసలు అవి నిజమో కాదో కూడా మనం తెలుసుకోలేము.
చిరుత దాడి.. ఒకరికి గాయాలు.. కలకలమేగా?
చిరుత పులులు గ్రామాల్లోకి వచ్చి కలవర పెడుతున్నాయి. సాధారణంగా ఎండాకాలం తాగునీరు, ఆహారం కోసం అటవీ ప్రాంతం నుంచి గ్రామాల్లోకి చిరుత పులులు వస్తాయని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే వర్షాలు కురుస్తున్నప్పటికీ ఆహారం కోసం గ్రామాల మీదకు వచ్చి పశువులు, మేకలపై దాడులు చేస్తున్నాయని ప్రజలు ఆందోళన చేస్తున్నారు. అటవీ ప్రాంత సమీపంలో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
Prabhas : డార్లింగ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన సర్కార్
ప్రభాస్ నటించిన కల్కి సినిమాకు టిక్కెట్ ధరలను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 27వ తేదీ నుంచి జులై 4వ తేదీ వరకూ అదనపు షోలు వేసుకునేందుకు కూడా థియేటర్ల యాజమాన్యాలకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
T20 World Cup : ఇదేందయ్యా... ఇట్లా జరిగిందే.. ఛాంపియన్స్ కు చిత్తుగా ఓడించారుగా.. ఒకరకంగా వరల్డ్ కప్ గెలిచినట్లేగా
టీ 20 వరల్డ్ కప్ లో సంచలనం నమోదయింది. ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియాను ఆప్ఘనిస్థాన్ ఓడించింది. ఊహించని ఈ విజయంతో వరల్డ్ కప్ లో మరే సంచలనాలు నమోదవుతాయన్న ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. అవును... ఎవరూ ఊహించలేదు. ప్రపంచంలోనే మేటి జట్టుగా పేరున్న ఆస్ట్రేలియాను ఓడించింది పసికూన ఆప్ఘనిస్థాన్.
Hyderababd : హైదరాబాద్ లో భారీ వర్షం.. తడిసి ముద్దయిన నగరం
హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఎల్.బి.నగర్ లోనూ భారీ వర్షపాతం నమోదయింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.