టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
Dharani : నేడు ఐదు జిల్లాల కలెక్టర్లతో కమిటీ సమావేశం
గత ప్రభుత్వం అమలులోకి తెచ్చిన ధరణి పోర్టల్ పై అధ్యయనం చేయడానికి నియమించిన కమిటీ నేడు ఐదు జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానుంది. రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లా కలెక్టర్లతో ప్రత్యేకంగా కమిటీ సభ్యులు సమావేశం కానున్నారు. ధరణి పోర్టల్ పై ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు అందాయి.
Glen Maxwell : పూటుగా తాగి.. స్పృహ కోల్పోయి ఆసుపత్రి పాలయి.. స్టార్ క్రికెటర్ విన్యాసాలు
ఆస్ట్రేలియా జట్టులో మ్యాక్స్‌వెల్ అంటే అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇటీవల భారత్ లో జరిగిన వన్డే వరల్డ్ కప్ లో మ్యాక్స్ వెల్ పేరు ప్రపంచమంతా మారుమోగిపోయింది.
Ayodhya : ఒక్కరోజులో ఇంత మంది దర్శించుకున్నారా.. రామా?
అయోధ్య బాలరాముడిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు క్యూ కడుతున్నారు. లక్షల సంఖ్యలో భక్తులు వస్తుండటంతో అయోధ్య వీధులన్నీ శ్రీరామ నామ స్మరణతో మారుమోగిపోతుంది. నిన్న బాలరాముడిని(బాలక రామ్) ఐదు లక్షల మంది దర్శించుకున్నారని ఆలయ బోర్డు తెలిపింది.
పడవ బోల్తా .. ఆరుగురు మహిళల గల్లంతు
గడ్చిరోలి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వైనగంగా నదిలో పడవ బోల్తా పడిన సంఘటనలో ఆరుగురు మహిళలు గల్లంతుయినట్లు తెలుస్తోంది. ఇద్దరు మహిళల మృతదేహాలు లభ్యమయ్యాయి. అయితే ప్రమాదం సంభవించిన సమయంలో ఎంత మంది పడవలో ఉన్నారన్న విషయం ఇంకా తెలియరాలేదు.
National Girl Child Day: జాతీయ బాలికా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారంటే?
జనవరి 24న ‘నేషనల్ గర్ల్ చైల్డ్ డే’(జాతీయ బాలికల దినోత్సవం) జరుపుకొంటారు.బేటీ బచావో-బేటీ పఢావో పథకాన్ని తీస్కోచ్చాని సందర్బంగా భారత ప్రభుత్వం 2008 నుంచి జనవరి 24ను నేషనల్ గర్ల్ చైల్డ్ డేగా ప్రకటించింది. ఆడపిల్లల్లో సామాజిక అవగాహన(అవేర్ గర్ల్ చైల్డ్-ఎబుల్) పెంచడమే కాకుండా.. విద్య, ఆరోగ్య రంగాల్లో బాలికలు మరింత చురుకుగా ఉండేలా చూడటం కోసం ఈ రోజును ప్రత్యేకంగా కేటాయించారు.
Devara : దేవర వాయిదా.. ఆ రిలీజ్ డేట్‌కి ఆ రెండు సినిమాలు..
ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ 'దేవర'. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా రూపోంతుంది. ఇటీవలే ఈ మూవీ నుంచి చిన్న గ్లింప్స్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చి భారీ అంచనాలు క్రియేట్ చేశారు.
Ayodhya: ఈ బడ్జెట్లో అయోధ్యకు భారీగా నిధులు కేటాయించనున్నారా?
యూపీలోని అయోధ్యలో రామమందిర బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగిన విషయం తెలిసిందే. అయితే దీనికి ప్రధాన మోడీ చేతుల మీదుగా ఈ విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఇక ఆలయం ప్రారంభోత్సవం జరిగిపోయింది. ఫిబ్రవరి 1న బడ్జెట్ కూడా రాబోతోంది.
Brain Health: మీ మెదడుకు చెడు చేసే ఆహారాలు
మన శరీరంలో మెదుడు కీలక పాత్ర పోషిస్తుంది. మెదుడకు సంబంధించి ఏదైనా సమస్యలు తలెత్తితే తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంటుంది. అందుకే జీవనశైలిలో మార్పులు చేసుకుంటూ చెడు అలవాట్లను దూరం చేసుకోవడం ముఖ్యం.
Rk Roja : రోజాను కూడా తప్పిస్తారా..? ప్రత్యర్థులదే పైచేయి అవుతున్నట్లు కనపడుతుందిగా
మంత్రి ఆర్కే రోజాకు ఈసారి ఎన్నికల్లో టిక్కెట్ దక్కే అవకాశాలు కన్పించడం లేదు. నగరి నియోజకవర్గం నుంచి రోజాను తప్పించే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి.
Ys Jagan : మా కుటుంబాన్ని చీల్చే కుట్ర : జగన్ సంచలన కామెంట్స్
కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ లో చెత్త రాజకీయం చేస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. తిరుపతిలో జరుగుతున్న ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్ లో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కాంగ్రెస్, బీజేపీలకు బలం లేదన్నారు.