టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
హోటల్ గది రోజుకు లక్ష... ఎప్పుడూ లేనంత డిమాండ్, ఇండియా కూటమిలో బాత్రూమ్ ముసలం!,న్యూఇయర్ ఈవెంట్లపై సీఎం రేవంత్ సీరియస్..
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
Telangana : ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా
తెలంగాణలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. భూపాలజిల్లాలో ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు అధికారులు ధృవీకరించారు. వీరిలో ఒకరిని వరంగల్ లోని ఏజీఎం ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్చారు. మిగిలిన నలుగురు హోం క్వారంటైన్ లోనే ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Corona Virus : తరుముకొస్తున్న మహమ్మారి.. మరోసారి లాక్ డౌన్ తప్పదా?
దేశంలో మరోసారి కరోనా వైరస్ భయపెడుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. దాదాపు రెండేళ్ల పాటు ప్రశాంతంగా ఉన్న దేశంలో మరోసారి కల్లోలం రేగుతుంది. మరణాల సంఖ్య కూడా పెరుగుతుండటంతో అందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
Ayodhya : హోటల్ గది రోజుకు లక్ష... ఎప్పుడూ లేనంత డిమాండ్
అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం వచ్చ నెల 22వ తేదీన జరగనుంది. ఈ కార్యక్రమానికి దేశంలోని అనేక ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. అయోధ్యలో రామమందిరాన్ని దర్శించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లను కేంద్ర ప్రభుత్వం చేసింది. ప్రత్యేక రైళ్లను నడుపుతుంది.
ఇండియా కూటమిలో బాత్రూమ్ ముసలం!
అసలే గోరుచుట్టు. దానిపై రోకటి పోటు అన్నట్లుంది ఇండియా కూటమి తీరు. రకరకాల సిద్ధాంతాలు, రాద్ధాంతాలు ఒకేచోట చేరి, కలిసి పెట్టుకున్న పొత్తుల కుంపటి అది. ఇటీవల జరిగిన నాలుగు ప్రధాన రాష్ట్రాల ఎన్నికల్లో ఆ కూటమికి మూడు చోట్ల తలబొప్పి కట్టింది. తర్వాత జరిగిన అన్ని పార్టీల సమావేశంలో మరో వివాదం చెలరేగి, ప్రస్తుతం అది బాత్రూమ్ల దగ్గరకు చేరింది.
న్యూఇయర్ ఈవెంట్లపై సీఎం రేవంత్ సీరియస్.. వారిపై కేసు నమోదు
ఇక ఈ ఏడాది మరో ఐదు రోజుల్లో ముగియనుంది. కొత్త సంవత్సరాలో రకరకాల ఈవెంట్లను నిర్వహిస్తుంటారు. డిసెంబర్ 31 రాత్రి నుంచి ఈవెట్లు నిర్వహిస్తుంటారు. అయితే కొత్త సంవత్సరానికి ఈవెట్లకు సిద్ధమవుతున్న వారికి తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. న్యూఇయర్‌కు ఈవెంట్లపై తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు విధించింది.
Hyderabad : న్యూఇయర్ వేడుకలకు ముందు.... 3.14 కోట్ల విలువైన మత్తు పదార్థాల స్వాధీనం
హైదరాబాద్ లో భారీగా మత్తు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. ఆల్పా జోలం ను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. 70 కిలోల మేరకు మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేజీ ఆల్ఫ్రా జోం 2.5 లక్షలకు కొనుగోలు చేసి కస్టమర్లకు 3.5 లక్షలకు విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు.
Jahnvi Kapoor : ఆస్తులు అమ్ముకుంటున్న జాన్వీ కపూర్.. కారణమేంటి..?
అతిలోకసుందరి శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైన నటి 'జాన్వీ కపూర్'. బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ వస్తున్న జాన్వీ.. ఎన్టీఆర్ 'దేవర'తో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. కాగా జాన్వీ కపూర్ కుటుంబానికి ముంబై, చెన్నైలో ఆస్తులు ఉన్న సంగతి తెలిసిందే.
Salaar : పిల్లల్ని సలార్ చూడనివ్వడం లేదని గొడవపెట్టుకున్న తల్లి..
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రెండు భాగాలుగా తెరకెక్కిన ‘సలార్’.. ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 22న ఆడియన్స్ ముందుకు వచ్చింది. భారీ అంచనాలు మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రానికి బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఇక మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో.. ఆడియన్స్ థియేటర్ కి క్యూ కట్టారు.
Hyderabad : న్యూ ఇయర్ వేడుకలకు ఈ పనిచేశారో.. ఇక అంతే
దేశమంతా న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమవుతుంది. డిసెంబరు 31వ తేదీ రాత్రి నుంచే వేడుకలకు అన్ని హోటళ్లు, పబ్ లు సిద్ధం చేస్తున్నాయి. ప్రయివేటు సంస్థలు కూడా వేడుకలను నిర్వహించేందుకు పూనుకుంటున్నాయి. సోషల్ మీడియాలో వేడుకల కోసం ప్రత్యేకంగా టిక్కెట్లను అమ్మే ప్రక్రియను ప్రారంభించాయి.
Sri Reddy : చెల్లివి కాదు.. శూర్పణఖవి.. షర్మిలపై హాట్ కామెంట్స్
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిలపై సినీ నటి శ్రీరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబానికి వైఎస్ షర్మిల క్రిస్మస్ కానుకలను పంపడంపై ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఎక్స్ లో శ్రీరెడ్డి వైఎస్ షర్మిలను ఉద్దేశించిన ట్వీట్ వైరల్ గా మారింది. చెల్లివి కాదు సూర్పనఖ వంటూ హాట్ కామెంట్స్ చేశారు.