25July-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ. 2,91,159 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. సంక్షేమం, అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించినట్లు తెలిపారు. రూ. 2,91,159 కోట్లతో బడ్జెట్.. రెవెన్యూ వ్యయం రూ. 2,20,945 కోట్లు.. మూల ధన వ్యయం రూ. 33,487 కోట్లు అంచనా వేశారు.
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
Telangana Budget: తెలంగాణ బడ్జెట్.. ఏ శాఖకు ఎంత కేటాయించారంటే?
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ. 2,91,159 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. సంక్షేమం, అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించినట్లు తెలిపారు. రూ. 2,91,159 కోట్లతో బడ్జెట్.. రెవెన్యూ వ్యయం రూ. 2,20,945 కోట్లు.. మూల ధన వ్యయం రూ. 33,487 కోట్లు అంచనా వేశారు.
Telangana Budget: తెలంగాణ బడ్జెట్ పై కేసీఆర్ తీవ్ర విమర్శలు
తెలంగాణ బడ్జెట్ పై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ బడ్జెట్ అన్ని వర్గాలను మోసం చేసిందని.. వెన్నుపోటు పొడిచిందని అన్నారు. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడ్డాక సమయమివ్వాలని 6 నెలలపాటు అసెంబ్లీకి రాలేదని.. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ శ్రేణులు పోరడతాయన్నారు.
YS Jagan: నన్ను టార్గెట్ చేసుకోండి.. చంపాలనుకుంటే చంపేయండి: వైఎస్ జగన్
ఏపీలో కూటమి ప్రభుత్వంలో వైసీపీ కార్యకర్తలను చంపేస్తున్నారంటూ ఢిల్లీలో ధర్నా చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతీయ మీడియా ఛానెల్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అమాయక ప్రజలపై దాడులు ఆపాలని, ఏదైనా ఉంటే తనతో తేల్చుకోవాలన్నారు.కావాలంటే నన్ను టార్గెట్ చేయండి.
Weather Update: ఈరోజు కూడా వర్షాలే.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
హైదరాబాద్‌లో వరుసగా ఏడవ రోజు కూడా మేఘావృతమై ఉంది. పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. అంతేకాకుండా హైదరాబాద్ నగరానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌లో మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.
NTR Devara దేవరలో విలన్ గా మరో బాలీవుడ్ హీరో?
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న దేవర సినిమాలో ఓ విలన్ గా చేస్తున్నారు. ఇక హిందీ చిత్రసీమకు చెందిన మరో నటుడు బాబీ డియోల్ కూడా దేవర విలన్ల లిస్టులో భాగమని వార్తలు వస్తున్నాయి. అనిమల్ సినిమాలో విలన్ గా నటించి బాబీ డియోల్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యాడు.
Amazon Order: అమెజాన్ లో ఆర్డర్ పెట్టింది.. ఏమొచ్చిందంటే?
ఆన్ లైన్ లో ఆర్డర్లు పెట్టడం ప్రతి ఒక్కరికీ అలవాటే.. అయితే కొన్ని కొన్నిసార్లు మనం పెట్టిన ఆర్డర్ కాకుండా వేరే వేరే వస్తువులు డెలివరీ చేయబడుతూ ఉంటాయి. కొలంబియాకు చెందిన ఓ మహిళ అమెజాన్ లో తాను పెట్టిన ఆర్డర్ స్థానంలో తొండ రావడంతో ఒక్కసారిగా షాక్ అయింది.
Ragging In AP: పల్నాడులో ర్యాగింగ్.. ఆ వీడియోలు ఎంత దారుణంగా ఉన్నాయంటే?
పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఓ విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న ఆరుగురు విద్యార్థులు ఫిబ్రవరి 2న ఎస్ఎస్ఎన్ కళాశాల హాస్టల్ ఆవరణలో ఎన్సిసి శిక్షణ ఇప్పిస్తామనే నెపంతో 10 మంది డిగ్రీ ద్వితీయ సంవత్సరం విద్యార్థులపై ర్యాగింగ్‌కు పాల్పడ్డారు.
అది తప్పించుకోడానికే వైఎస్ జగన్ ఢిల్లీ డ్రామా: హోం మినిస్టర్
ఏపీ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం జరుగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా ఉండేందుకు ఢిల్లీలో నిరసనకు దిగారని ఏపీ హోం మంత్రి అనిత విమర్శించారు. వైఎస్ జగన్ ఏపీలో గత వారం రోజులుగా 36 హత్యలు జరిగాయంటూ ఆరోపణలు చేస్తున్నారు..
నాన్నా జారుతున్నట్లుగా అనిపిస్తోందని చెప్పింది.. ఇంతలో
తండ్రి కళ్ల ముందరే ఓ కుమార్తె ప్రాణాలు కోల్పోయింది. 20 ఏళ్ల అరిజోనా స్టేట్ యూనివర్శిటీ విద్యార్థిని గ్రేస్ రోహ్లాఫ్ కాలిఫోర్నియాలోని యోస్మైట్ నేషనల్ పార్క్‌లో తన తండ్రితో కలిసి ట్రెక్కింగ్ చేస్తూ ఉండగా పై నుండి కిందపడి మరణించింది. ప్రమాదానికి ముందు.. గ్రేస్ తన తండ్రితో "నాన్న, నా బూట్లు జారుతున్నట్లుగా అనిపిస్తూ ఉంది" అని చెప్పింది.
Bank Holidays August 2024: ఆగస్టులో బ్యాంకు హాలిడేస్.. ఎప్పుడంటే?
ఆగస్టు నెలలో బ్యాంకులకు సెలవులు చాలా ఎక్కువగానే ఉండబోతున్నాయి. ఆగస్ట్ నెలలో రెండు శనివారాలు కాకుండా, స్వాతంత్ర్య దినోత్సవం, రక్షా బంధన్ పండుగ కూడా వస్తుండడంతో బ్యాంకులతో సహా అన్ని ప్రభుత్వ శాఖలు మూసివేయనున్నారు.