March26-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆమ్ ఆద్మీపార్టీ నేతలు ప్రధాని మోదీ ఇంటి ముట్టడికి నేడు పిలుపు నిచ్చారు. దీంతో ఢిల్లీలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రధాని ఇంటి పరిసర ప్రాంతాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని పటేల్ చౌక్ ప్రాంతానికి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చేరుకునే అవకాశముండటంతో ఢిల్లీలో పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు.
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
Delhi : నేడు ప్రధాని ఇంటి ముట్టడి.. ఢిల్లీలో హై అలెర్ట్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆమ్ ఆద్మీపార్టీ నేతలు ప్రధాని మోదీ ఇంటి ముట్టడికి నేడు పిలుపు నిచ్చారు. దీంతో ఢిల్లీలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రధాని ఇంటి పరిసర ప్రాంతాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని పటేల్ చౌక్ ప్రాంతానికి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చేరుకునే అవకాశముండటంతో ఢిల్లీలో పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు.
Big Breaking : కవితకు దక్కని ఊరట.. జ్యుడిషియల్ రిమాండ్ విధించిన న్యాయస్థానం
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీ నేటితో ముగియడంతో ఆమెను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. కస్టడీని పొడిగించాలంటూ ఈడీ పిటీషన్ వేసింది. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ ను ఈడీ అధికారులు కోరారు. మరో వైపు కవిత బెయిల్ పిటీషన్ పై కూడా వాదనలు ముగిశాయి.
Breaking : అనకాపల్లి ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన జగన్
అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి పార్టీ అభ్యర్థిని వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు. అనకాపల్లి నుంచి బూడి ముత్యాలనాయుడును అభ్యర్థిగా ఖరారు చేశారు. ప్రస్తుతం బూడి ముత్యాలనాయుడు మాడుగుల వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనను అనకాపల్లి నుంచి పోటీ చేయించాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు.
Chandrababu : కుప్పంలో ఇంటింటికీ తిరుగుతున్న చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో రెండో రోజు పర్యటిస్తున్నారు. ఆయన నియోజకవర్గంలో ఇంటింటికీ తిరిగి ప్రచారాన్ని నేడు నిర్వహించారు. కుప్పం టీడీపీ నేతలతో కలసి తమ ఇంటికి వచ్చిన చంద్రబాబును మహిళలు హారతులతో స్వాగతం పలికారు.
Xiaomi EV: స్మార్ట్‌ఫోన్ సంస్థ షియోమీ నుంచి ఎలక్ట్రిక్ కార్లు
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో వాహనాల తయారీ సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపాయి. దీంతో ఇప్పటికే మార్కెట్లో చాలా రకాల కార్లు, ద్విచక్ర వాహనాలు ఎలక్ట్రిక్ రూపంలో వచ్చాయి. వానదారులు కూడా ఈవీ వాహనాల వైపు ఆసక్తి చూపుతున్నారు.
IPL 2024 : అందుకే సామీ నువ్వు కుదురుకుంటే చాలునయ్యా.. పరాజయం పరారవ్వక మరేంటి?
కింగ్ అభిమానులు ఎట్టకేలకు గ్రేట్ రిలీఫ్ దొరికింది. తొలి మ్యాచ్ లో ఓటమి పాలు కావడంతో కొంత నిరాశలో ఉన్న బెంగళూరు ఫ్యాన్స్ కు ఎండాకాలంలో కూల్ అయిన వార్తను కోహ్లి అందించాడు. నిన్న పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ విజయాన్ని నమోదు చేసుకుంది.
Uday Kiran : ఉదయ్ కిరణ్‌ని చిరంజీవే.. వైరల్ కామెంట్స్ చేసిన ఉదయ్ కిరణ్ సోదరి..
టాలీవుడ్ హీరో ఉదయ్ కిరణ్ మరణం.. ఇప్పటికి టాలీవుడ్ లో ఓ హాట్ టాపిక్కే. ఆయన ఆత్మహత్య చేసుకోవడం వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటి అనేవి ఎవరికి సరిగ్గా తెలియదు. కానీ ఉదయ్ సూసైడ్ కి బలమైన కారణం.. మెగాస్టార్ చిరంజీవే అంటూ పలువురు విమర్శలు చేస్తూ వస్తుంటారు. చిరంజీవి తన కూతురికి ఉదయ్ కిరణ్ ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. నిశ్చితార్థం వేడుక కూడా జరిపారు.
BJP : నిజమే.. అందరూ అనుకుంటున్నట్లే అభ్యర్థుల ఎంపిక అదే రుజువు చేస్తుందిగా?
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి నోటా కంటే ఓట్ల శాతం తక్కువ అని అంటారు. కమలం పార్టీ నేతలు ఆ మాటంటే కోప్పడతారు కానీ అభ్యర్థుల ఎంపిక చూస్తే తెలియడం లేదూ అని ప్రశ్నలు పార్టీ అగ్రనాయకత్వానికి సూటిగా తాకుతున్నాయి. ఆ పార్టీ ఆరు పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
IPL 2024 : నేడు మరో కీలక మ్యాచ్
నేడు ఐపీఎల్ లో మరో సూపర్ మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ తో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ చెన్నైలో జరగనుంది. రెండు జట్లు కొత్త కెప్టెన్ల తో ఈ సీజన్ లోకి బరిలోకి దిగాయి. ఇరు జట్లు బలంగా కనిపిస్తున్నాయి. రెండు జట్లు ఇప్పటికే ఒక విజయాన్ని నమోదు చేసుకున్నాయి. దీంతో ఇరు జట్ల ఫ్యాన్స్ ఈ మ్యాచ్ లో మంచి ఆటను ఆస్వాదించనున్నాయి.
Mobile Tariff: ఇక బాదుడే.. పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ధరలు
మొబైల్ చార్జీలకు మళ్లీ రెక్కలు రాబోతున్నాయా..? అంటే అవుననే సమాధానం వస్తోంది టెక్ నిపుణుల నుంచి. గత రెండు సంవత్సరాలుగా ఛార్జీలు పెంచని టెలికాం కంపెనీలు ఇప్పుడు ఎన్నికల తర్వాత ఛార్జీలు పెంచేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఒక్కో టెలికం సంస్థ తమ టారిఫ్‌లను 15 శాతం నుంచి 20 శాతం వరకు పెంచే అవకాశాలు ఉన్నాయని బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి.