టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
వైసీపీ ముందుగానే అభ్యర్థులు ప్రకటించాలన్న UPI ద్వారా చెల్లింపు.. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలయింది.
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
Inter Exams : తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలయింది. ఫిబ్రవరి 28వ తేదీ నుంచి తెలంగాణలో ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఫిబ్రవరి 28న సెకండ్ లాంగ్వేజీ పేపర్ 1 పరీక్ష జరగనుంది. మార్చి 19వ తేదీ వరకూ ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి 15వ తేదీ వరకూ ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు జరుగుతాయని ఇంటర్ బోర్డు నిర్వహించింది.
Finance Tips: క్రెడిట్ స్కోర్ పెంచుకోవడానికి చిట్కాలు
రుణం పొందడానికి క్రెడిట్ స్కోర్ చాలా ముఖ్యం. ఇది రుణాన్ని పొందడమే కాకుండా, తక్కువ వడ్డీ రేటుకు రుణం పొందటానికి దారితీస్తుంది. అదేవిధంగా క్రెడిట్ స్కోర్ చాలా ముఖ్యమైనది. క్రెడిట్ స్కోర్ అంటే ఏమిటి? ఇది మన రుణ చెల్లింపు శక్తికి కొలమానం. ఇచ్చిన స్కోర్ మన క్రెడిట్ చరిత్ర మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది.
Singareni : సింగరేణి ఎన్నికల్లో అధికార పార్టీకి షాక్.. సీపీఐ అనుబంధ సంస్థదే విజయం
సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ విజయం సాధించింది. కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీ పోరాడినా చివరకు చేతులెత్తేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక మొన్నటి వరకూ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అనుబంధ కార్మికసంఘం టీజబీకేఎస్ అసలు ఖాతా కూడా తెరవక పోవడం విశేషం. మొత్తం మీద సీపీఐ అనుబంధ సంస్థ ఏఐటీయూసీకే బొగ్గు గని కార్మికులు జై కొట్టారు.
Vijayakanth : తమిళ నటుడు విజయకాంత్ కన్నుమూశారు..
తమిళ నటుడు, రాజకీయ నాయకుడు విజయకాంత్.. 71 ఏళ్ళ వయసులో నేడు కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్న విజయకాంత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆయన రీసెంట్ గా కరోనా భారిన పడ్డారు. శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా ఉండడంతో ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందించక సాగారు.
Corona Virus : మళ్లీ విస్తరిస్తున్న కరోనా.. ఒక్కరోజులో ఇన్ని కేసులా?
కరోనా వైరస్ దేశంలో ప్రమాద ఘంటికలను మోగిస్తుంది. రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. మొన్నటి వరకూ కేరళ రాష్ట్రానికే పరిమితమైన కరోనా కేసులు ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో నమోదు అవుతుండటం ఆందోళన కల్గిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 529 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
Salaar Collections : ఆరు రోజుల్లో సలార్ కలెక్షన్స్ ఎంతంటే..
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రెండు పార్టులుగా తెరకెక్కిన 'సలార్' ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 22న ఆడియన్స్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. 'ఖాన్సార్' అనే ఒక అండర్ వరల్డ్ సిటీ సింహాసనం కోసం మూడు ట్రైబల్ ఫ్యామిలీస్ మధ్య జరిగే యుద్ధం నేపథ్యంతో ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. ఇక మూవీలో ప్రభాస్ మాస్ యాక్షన్ కి బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్ధలవుతున్నయి.
క్రికెటర్ కాదు కంత్రీ: రిషబ్ పంత్ ను కూడా కోట్లలో మోసం
ఆ యువకుడు తానొక క్రికెటర్ అంటూ చెప్పుకుని పెద్ద ఎత్తున మోసానికి తెగబడ్డాడు. 25 ఏళ్ల హర్యానాకు యువకుడు.. గతంలో U-19 క్రికెటర్ గా కొన్ని మ్యాచ్ లు ఆడాడు. అయితే ఈజీ మనీకి అలవాటు పడిన అతడు పలు లగ్జరీ హోటళ్లు, రిసార్ట్‌లను మోసం చేయడమే కాకుండా.. వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్‌ను కూడా కోట్లలో మోసం చేశాడు. మినాంక్ సింగ్ అనే వ్యక్తి విలాసవంతమైన జీవనం గడపడం కోసం మోసాలకు తెగబడ్డాడు.
PM Modi: మోడీ ఖాతాలో మరో రికార్డ్.. ప్రపంచ నేతలందరినీ అధిగమించి..
ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన నాయకుడిగా మారారు. ఈ విషయంలో అతను ఇప్పటికే ప్రపంచ నాయకులందరినీ మించిపోయాడు. మోదీ పేరుకు మరో అరుదైన ఘనత చేరింది. పీఎం మోడీ తన యూట్యూబ్ ఛానెల్లో 2 కోట్ల మంది సభ్యులను కలిగి ఉన్న ప్రపంచంలోనే మొదటి నాయకుడిగా నిలిచారు.
UPI Update: స్కానింగ్ లేకుండా కూడా UPI ద్వారా చెల్లింపు.. త్వరలో కొత్త ఫీచర్
UPI అనేది ప్రజల దైనందిన జీవితంలో భాగమైపోయింది. చిన్న కొనుగోళ్ల నుండి పెద్ద చెల్లింపుల వరకు ప్రజలు UPIని ఉపయోగించడం ప్రారంభించారు. ఇది నగదుపై ప్రజల ఆధారపడటాన్ని తగ్గించడమే కాకుండా, చెల్లింపు ప్రక్రియను కూడా చాలా సులభం చేసింది.
Ys Jagan : జగన్ కెలుక్కుని మరీ..? ఎన్నికలకు ముందే మొదలయిన వార్
అధికారంలో ఉన్న వైసీపీ ముందుగానే అభ్యర్థులు ప్రకటించాలన్న అత్యుత్సాహం ఆ పార్టీకి ఇబ్బందులను తెచ్చిపెట్టింది. అనేక నియోజకవర్గాల్లో మార్పులు, చేర్పులు చేపట్టడం కూడా సమస్యలు తెచ్చి పెడుతున్నాయి. నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తుండటంతో ఎమ్మెల్యేల అనుచరులు రోడ్డుపైకి వచ్చి ఆందోళనలకు దిగుతున్నారు.