March 28-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
వైఎస్ జగన్ ఎక్కడ పర్యటిస్తున్నప్పటికీ ఆయన ఒక్క విషయంలో మాత్రం ఆయన అలెర్ట్ గా ఉంటారు. ఆయన పర్యటిస్తున్న సమయంలో అంబులెన్స్ వస్తే సెక్యూరిటీ వాళ్లకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తారు. అంబులెన్స్ కు దారి ఇవ్వాలని జగన్ తొలి నుంచి చెబుతుంటారు.
నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
Ys Jagan : జగన్ బస్సులో ఉండగా.. అంబులెన్స్ రావడంతో?
వైఎస్ జగన్ ఎక్కడ పర్యటిస్తున్నప్పటికీ ఆయన ఒక్క విషయంలో మాత్రం ఆయన అలెర్ట్ గా ఉంటారు. ఆయన పర్యటిస్తున్న సమయంలో అంబులెన్స్ వస్తే సెక్యూరిటీ వాళ్లకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తారు. అంబులెన్స్ కు దారి ఇవ్వాలని జగన్ తొలి నుంచి చెబుతుంటారు.
TDP : చావోరేవో.. తేల్చుకునేందుకు సిద్ధం.. ఎక్కడో భయం.. అదే సమయంలో ధైర్యం
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఈసారి ఎన్నికలు చావోరేవో సమస్య. ఆయన అధికారంలోకి వస్తేనే పార్టీ మనుగడ ఉంటుంది. లేకుంటే పొరుగున ఉన్న బీఆర్ఎస్ పరిస్థితికి ఏ మాత్రం తీసిపోదు. అది ఆయనకు తెలుసు. వయసు రీత్యా చంద్రబాబు కూడా ఇక ఐదేళ్లలో పార్టీని బలోపేతం చేసే అవకాశముండదు.
TDP : పరిటాల.. వరదాపురం సూరి..ఇద్దరు టిక్కెట్ కోసం పోటీ పడ్డారు.. మధ్యలో వచ్చిన ఆయన?
ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అవతల బలమైన అభ్యర్థి వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఉన్నారు. ఈ సమయంలో ధర్మవరం టిక్కెట్ పంచాయతీలో ఇద్దరు నేతలు కొట్లాడుకోగా మధ్యలో మరొక వ్యక్తి టిక్కెట్ ను ఎగరేసుకుపోయారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ లు తమకు టిక్కెట్ కావాలంటే తమకు కావాలంటూ ఇద్దరూ అమితుమీకి దిగారు.
Kejrival : కేజ్రీవాల్ సమాధానం చెప్పడం లేదు.. విచారణకు సహకరించడం లేదు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు మరో నాలుగు రోజులపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీకి న్యాయస్థానం ఆదేశించింది. ఇప్పటికే ఆరు రోజుల పాటు కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ ను మరో నాలుగు రోజులు అప్పగించింది. కేజ్రీవాల్ కస్టడీ నేడు పూర్తికావడంతో కేజ్రీవాల్ ను ఢిల్లీ రౌస్ అవెన్యూ న్యాయస్థానంలో హాజరుపర్చారు.
IPL 2024 : నేడు మరో సూపర్ మ్యాచ్.. మరోసారి టెన్షన్ తప్పదా?
ఐపీఎల్ సీజన్ 17 మాత్రం ఆరంభం నుంచి ఫ్యాన్స్ ను అలరించేలా సాగుతుంది. స్కోరు ఎంతైనా ఛేజింగ్ లో చివరి వరకూ వచ్చి ఫ్యాన్స్ కు జట్లు చెమటలు పట్టిస్తున్నాయి. నిన్న 276 పరుగుల లక్ష్యాన్ని ముంబయి ఇండియన్స్ ఛేజ్ చేస్తుందేమోనన్న ఉత్కంఠ చివరి వరకూ సాగింది. అలా సాగుతున్న ఈ మ్యాచ్ లలో ఈరోజు మరోసారి రసవత్తర పోరు జరుగుతుంది.
మూవీ షూటింగ్ అని చెప్పి.. పెళ్లి చేసేసుకున్న సిద్ధార్థ్, అతిథి..
సినిమా యాక్టర్స్ సిద్దార్థ్, అదితిరావు హైదరి గత కొంతకాలంగా ప్రేమాయణం నడుపుతూ వస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో వచ్చిన ‘మహాసముద్రం’ మూవీలో నటించిన వీరిద్దరూ.. ఆ టైంలోనే ప్రేమలో పడ్డారు. ఇక అప్పటినుంచి పార్టీలకు, డిన్నర్స్ అండ్ లంచ్స్ అంటూ రెస్టారెంట్స్ కి కలిసి వెళ్తూ కనిపిస్తున్నారు. కానీ ప్రేమ, పెళ్లి విషయం పై మాత్రం ఎక్కడా కామెంట్స్ చేయడం లేదు.
Tamilnadu : టిక్కెట్ రాలేదని ఎంపీ ఆత్మహత్యాయత్నం.. గుండెపోటుతో మృతి
తనకు టిక్కెట్ రాలేదన్న ఆవేదనతో డీఎండీకే పార్లమెంటు సభ్యుడు గుండెపోటుతో మరణించారు. తమిళనాడులో ఈ ఘటన సంచలనం కలిగించింది. డీఎండీకే గశేశ్ మూర్తి 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఈరోడ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
Telangana : ఈరోజు పెళ్లి.. రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి
పెళ్లికి హాజరయ్యేందుకు ట్రాక్టర్ లో వెళుతున్న కుటుంబం ప్రమాదాన బారిన పడింది. ట్రాక్టర్ బోల్తా పడటంతో ముగ్గురు మరణించారు. పెళ్లి కుమార్తెను తీసుకు వచ్చేందుకు ముప్ఫయి మంది ట్రాక్టర్ లో బయలుదేరారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం బాచారం గ్రామానికి చెందిన రమేష్ కు ఆంథోల్ కు చెందిన మమతతో వివాహం జరగాల్సి ఉంది.
IPL 2024 : పాండ్యాకు పైకి చూడటమే సరిపోయింది.. ఈ బాదడం ఏంది బాబాయ్?
నిన్న సన్ రైజర్స్ మ్యాచ్ బ్యాటింగ్ చూసిన వాళ్లకు ఎవరికైనా ఇలాగే అనిపిస్తుంది. బాదుడు అంటే ఇలా ఉంటుందా? ఊచకోతకు ఉదాహరణ ఇదేనా? అని అనిపించక మానదు. నిన్న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ ముంబయి ఇండియన్స్ తో జరిగింది. తొలుత టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
Ys Jagan : తలరాతలు మార్చే ఎన్నిక ఇది.. ఆలోచించి ఓటేయండి
తలరాతలను మార్చే ఎన్నిక ఇది.. అందరు కలసి కట్టుగా కూర్చుని చర్చించుకుని ఓటు వేయాలని వైసీపీ అధినేత జగన్ పిలుపు నిచ్చారు. ఎర్రగుంట్లలో ప్రజలతో ఆయన ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. తాను వయసులో చాలా చిన్న వాడినని, ఇంత చిన్న వయసులో ఎవరైనా ఇన్ని పెద్దపనులను చేశారా?