28May-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడించినట్లు తెలిసింది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే వారి ఫోన్లు ట్యాప్ చేశామని ఆయన అంగీకరించారు. మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు సహకారంతో ట్యాపింగ్ చేసినట్లు తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఆర్థికంగా సాయపడే వారి ఫోన్లు ట్యాప్ చేశామని చెప్పారు. బీఆర్ఎస్ లో లో వ్యతిరేక స్వరం వినిపించే నేతల ఫోన్లను సయితం ట్యాప్ చేసినట్లు భుజంగరావు తెలపారు.
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు బయటకు
ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడించినట్లు తెలిసింది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే వారి ఫోన్లు ట్యాప్ చేశామని ఆయన అంగీకరించారు. మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు సహకారంతో ట్యాపింగ్ చేసినట్లు తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఆర్థికంగా సాయపడే వారి ఫోన్లు ట్యాప్ చేశామని చెప్పారు. బీఆర్ఎస్ లో లో వ్యతిరేక స్వరం వినిపించే నేతల ఫోన్లను సయితం ట్యాప్ చేసినట్లు భుజంగరావు తెలపారు.
Ap Elections : అంకెలు తప్పు చెప్పవుగా.. అదే జరిగితే.. ఈసారి విజయం ఆ పార్టీదేనట.. సెఫాలజిస్టులు ఏమంటున్నారంటే?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు పూర్తయ్యాయి. పోలింగ్ ముగిసినా ఇంకా లెక్కలు మాత్రం తేలడం లేదు. అంచనాలకు అందడం లేదు. ఎవరి లెక్కలు వారివే. ఎవరి ధీమా వారిదే. గెలుపు తమదేనంటూ ఎవరికి వారే ధైర్యాన్ని క్యాడర్ కు నూరిపోస్తున్నారు. కౌంటింగ్ వరకూ క్యాడర్ బలంగా నిలబడాలనే కోరిక కావచ్చు. పార్టీ కిందిస్థాయిలో నీరుగారకుండా ఉండే ప్రయత్నం కావచ్చు.
Tg Venkatesh : బాసూ ఏం జరుగుతుందో చెప్పి కాస్త పుణ్యం కట్టుకోవూ? నరాలు తెగిపోతున్నాయ్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమలో సీనియర్ రాజకీయ నేతగా టీజీ వెంకటేశ్ అందరికీ సుపరిచితుడు. రాజకీయంగా, ఆర్థికంగా బలమైన నేత. ఆయన ఎప్పుడు మాట్లాడినా వివాదమే. కాదు.. వివాదాలనే ఆయన ఎక్కువగా ఆశ్రయిస్తుంటారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి ఆయన మాట్లాడే ప్రతి మాట మీడియాలో హైలెట్ అవుతుంటుంది. వైశ్య సామాజికవర్గానికి చెందిన టీజీ వెంకటేశ్ ధైర్యంగా ఏదైనా చెప్పగలడంలో దిట్ట.
Ap Elections : నెల్లూరు రెడ్లకు అదే సమస్యా... అలా జరగకుండా ఉంటే గెలుపు ఖచ్చితంగా దక్కదేనటగా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు విభిన్నంగా ఉంటాయి. పార్టీలు మారడం అంటూ జరిగితే వారికి ఓటమి తప్పదని గత ఎన్నికల ఫలితాలు రుజువు చేస్తున్నాయి. 2014లో వైసీపీ నుంచి టీడీపీకి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు. అయితే అందులో కొందరికే చివరకు సీటు దక్కింది. సీటు దక్కిన వారిలో ఒక్కరంటే ఒక్కరే గెలిచారు. అదీ అద్దంకి నుంచి గొట్టిపాటి రవికుమార్ మాత్రమే. పార్టీ మారిన మిగిలిన వాళ్లంతా ఓటమి పాలయ్యారు.
T20 World Cup 2024 : టీ 20 ప్రపంచ కప్ కు అంతా సిద్ధం.. దాయాది దేశంతో పోరు ఎప్పుడంటే?
ఐపీఎల్ 17వ సీజన్ ముగిసింది. క్రికెట్ ఫ్యాన్స్ దాదాపు రెండు నెలలు మంచి క్రికెట్ ను ఆస్వాదించారు. గెలుపోటములు ఎలా ఉన్నా అనేక మ్యాచ్ లలో చివరి బంతి వరకూ టెన్షన్ పెట్టారు. అంచనాలు అందని జట్లు ప్లే ఆఫ్ కు చేరుకున్నాయి. అలాగే భారీ అంచనాలున్న జట్లు ముందుగానే ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకున్నాయి. చివరకు ప్లే ఆఫ్ లో కూడా అనుకున్నది జరగలేదు. అందరూ అనుకున్నట్లు జరగకపోవడమే పొట్టి కప్ ప్రత్యేకత.
Delhi Liqour Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ పాత్ర పై ఈడీ ఏమందో తెలుసా?
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో సంచలన విషయాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వెల్లడించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయం కేసీఆర్ కు ముందే తెలుసునని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వివరించింది. కవిత బెయిల్ పిటీషన్ సందర్భంగా విస్తుబోయే విషయాలను ఢిల్లీ హైకోర్టు ముందు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉంచింది. కేసీఆర్ కు ఢిల్లీలో లిక్కర్ వ్యాపారంపై ముందే తెలుసునని ఈడీ తెలిపింది.
ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు
హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో బాంబు పెట్టామంటూ ఆగంతకుడు ఫోన్ చేశాడు. కాసేపట్లో అది పేలిపోతుందంటూ ఆ వ్యక్తి చెప్పడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబు స్క్కాడ్ తో తనిఖీలను ముమ్మరం చేశారు. ఒకవైపు ప్రజా భవన్ లో గాలింపు చర్యలు చేపడుతూనే మరొక వైపు కాల్ చేసిన ఆగంతకుడి కోసం గాలిస్తున్నారు.
Sabarimala : అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన ట్రావెన్ కోర్ దేవస్థానం
అయ్యప్ప భక్తులకు శబరిమలలోని ట్రావెన్ కోర్ దేవస్థానం శుభవార్త చెప్పింది. మాస పూజకు రోజుకు 50 వేల మంది భక్తులను వర్చువల్ క్యూ ద్వారా దర్శనానికి అనుమతించాలని శబరిమల ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటుగా టికెట్లను ఆన్ లైన్ లో విక్రయించనున్నట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం తెలిపింది.
Chiranjeevi : మెగాస్టార్ కు మరో అరుదైన గౌరవం
మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం లభించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చిరంజీవికి గోల్డెన్ వీసాను అందించింది. ఇటీవలే చిరంజీవి పద్మవిభూషణ్ అందుకున్న సంగతి తెలిసిందే. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి యూఏఈ ఈ గోల్డెన్ వీసాతో సత్కరిస్తుంది. దీనిని అరుదైన గౌరవంగా భావిస్తారు.
అగ్నిబాణ్ మళ్లీ వాయిదా.. ఇదే రీజన్
అగ్నిబాణ్ రాకెట్ ప్రయోగం మళ్లీ వాయిదా పడింది. శ్రీహరికోట నుంచి జరగాల్సిన ప్రైవేట్ రాకెట్ అగ్నిబాణ్ ప్రయోగం మరోసారి వాయిదా పడింది. సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ వేదికగా ఈ ఉదయం రాకెట్ ప్రయోగాన్ని నిర్వహించాల్సి ఉంది. అయితే మంగళవారం వేకువ జామున ప్రయోగానికి ముందు సాంకేతిక సమస్య తలెత్తడంతో వాయిదా పడింది.