29July-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టులో వరద నీరు చేరుతుంది. దీంతో అధికారులు కొద్దిసేపటి క్రితం మూడు గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేశారు. పది అడుగుల మేరకు గేట్లు ఎత్తి నీటిని కిందకు వదిలారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 878.40 అడుగుల వరకూ ఉంది.
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
Srisailam : శ్రీశైలం ప్రాజెక్టులో మూడు గేట్ల ఎత్తివేత
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టులో వరద నీరు చేరుతుంది. దీంతో అధికారులు కొద్దిసేపటి క్రితం మూడు గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేశారు. పది అడుగుల మేరకు గేట్లు ఎత్తి నీటిని కిందకు వదిలారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 878.40 అడుగుల వరకూ ఉంది.
Chandrababu : నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుకు.. ఎప్పుడూ లేనంత ఆందోళన ఉందా?
నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబుకు ఈసారి పరిపాలన అంత సులువుగా సాధ్యమయ్యేటట్లు కనిపించడం లేదు. విభజన ఆంధ్రప్రదేశ్ ను ఈ దఫా గట్టును పడేయటం చంద్రబాబుకు కత్తిమీద సామే అవతున్నట్లు కనపడుతుంది. ఆయన నోటి నుంచి వెలువడే మాటలను బట్టి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం అంత సులువైన పని కాదు.
BRS : బీఆర్ఎస్ కొత్త నాయకత్వాన్ని కోరుకుంటుందా? పాత నేతలకు చెక్ పడనుందా?
బీఆర్ఎస్ పార్టీ కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టనుంది. వరస ఓటములతో కుదేలయిపోయిన ఆ పార్టీ ఇక సంచలన నిర్ణయాలను తీసుకోవాలని భావిస్తుంది. లేకుంటే పార్టీ మనుగడ కష్టసాధ్యమని అగ్రనాయకత్వం గుర్తించినట్లుంది. అందుకోసమే బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ దీనిపై కసరత్తులు ప్రారంభించారని తెలిసింది.
Free Bus : ఉచిత బస్సులోనే పళ్లుతోముకుంటున్న ఈమెను చూశారా?
ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు కలసి వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రవేశపెట్టారు. దీంతో ఆర్టీసీ బస్సులన్నీ మహిళలతో నిండిపోతున్నాయి. ఎక్కువ మంది మహిళలే బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. మహాలక్ష్మి పధకం ద్వారా ఈ ఉచిత బస్సు సౌకర్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రవేశపెట్టింది.
Breaking : చేపల వేట కోసం రిజర్వాయర్ లోకి దిగి ముగ్గురు యువకుల గల్లంతు
కడప జిల్లా దువ్వూరు మండలం చల్లబసాయపల్లె రిజర్వాయర్ లో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. చేపల వేట కోసం వెళ్లిన ఈ ముగ్గురు నీటి ఉధృతిలో కొట్టుకుపోయారు. కోరం రిజర్వయార్ లో చేపలవేట చేద్దామని భావించిన ముగ్గురు యువకులు కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.
Andhra Pradesh : పింఛన్ల పంపిణీ లో సర్కార్ కీలక ఆదేశాలు
ఆగస్టు నెల సమీపిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పింఛన్ల పంపిణీకి మార్గదర్శకాలను విడుదల చేసింది. లబ్దదారులందరికీ పింఛన్లను ఒక్కరోజులోనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఆగస్టు 1వ తేదీన తెల్లవారు జాము నుంచే పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సచివాలయ సిబ్బంది ముందుగానే పింఛన్లు పంపిణీ చేయాలని తెలిపింది.
Aravind Kejrival : నేడు బెయిల్ పై హైకోర్టులో విచారణ
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటీషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసింది. ఈడీ కేసులో ఇప్పటికే బెయిల్ వచ్చిందని కేజ్రీవాల్ కు సీబీఐ కేసులో కూడా బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తరుపున న్యాయవాదులు వాదించనున్నారు.
ఇంత పెద్ద చేప.. ఎప్పుడూ చూడలేదే...?
మత్స్యకారులకు వలలో చేపలు పడటం సహజమే. అయితే సాధారణంగా చేపల వేటలో అనుకోకుండా ఒక్కోసారి భారీ చేపలు వలలో చిక్కుకుంటాయి. అయితే భారీ చేప ఒకటి మత్య్యకారుల వలలో పడింది. దీని బరువు 1500 కిలోలుగా గుర్తించారు. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం గిలకలదిండి వద్ద సముద్రంలో వేటకు వెళ్లిన జాలర్లకు ఈ చేప చిక్కింది.
India vs Srilanka : దేశం ఏది కాదన్నాయ్యా.. విక్టరీ మాదేనంటున్న టీం ఇండియా
టీ20 వరల్డ్ కప్ లో సూపర్ విక్టరీ సాధించిన భారత్ జట్టు తర్వాత తన విజయాలను వరసగా నమోదు చేస్తూ వస్తుంది. ఇటీవల జింబాబ్వేలో జరిగిన టీ 20 సిరీస్ ను కైవసం చేసుకుని కుర్రాళ్లు కుమ్మేశారు. తొలి మ్యాచ్ లో ఓడిపోయినా తర్వాత మ్యాచ్ లన్నీ తమ పరం చేసుకుని సత్తా చాటారు.
Breaking : పడవ బోల్తా... పందొమ్మిది మంది మృతి
పడవ ప్రమాదంలో పందొమ్మిది మంది మరణించారు. ఏడుగురు ప్రాణాలతో బయటపడగలిగారు. ఇథియోపియా దేశంలోని అమ్హారా ప్రాంతంలోని టెకెజె నదిలో పడవ బోల్తా పడి ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం పడవలో 26 మంది ప్రయాణికులున్నారు. వీరిలో పందొమ్మిది మంది మరణించగా, ఏడుగురు మాత్రం ఈ ప్రమాదం నుంచి బయపడ్డారు.