29August-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఆవర్తనం విస్తరించి ఉండటంతో దాని ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతం వద్ద అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
Rain Alert : తెలంగాణకు భారీ వర్ష సూచన
తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఆవర్తనం విస్తరించి ఉండటంతో దాని ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతం వద్ద అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
హైడ్రా సీరియస్ యాక్షన్
హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది. అక్రమ నిర్మాణాలకు అనుమతిచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను కోరింది. ప్రధానంగా చెరువు, నాలా ఉన్న ప్రాంతాల్లో భవన నిర్మాణాలకు అనుమతిచ్చిన వారిపై యాక్షన్ తీసుకోవాలని సూచించింది. అడ్డగోలు అనుమతిచ్చిన అధికారులను వదిలిపెట్టవద్దని కోరింది.
Revanth Reddy : రేవంత్ రెడ్డి అందుకే ఒవైసీని టార్గెట్ చేశారా?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కా వ్యూహంతో వెళుతున్నారు. ఒవైసీ కుటుంబంతో నేరుగా వైరం పెట్టుకుంటున్నారు. ఎవరినీ వదిలేది లేదని, ఒవైసీ అయినా.. మల్లారెడ్డి అయినా విద్యాసంస్థల పేరుతో చెరువుల్లో, నాలాల మీద అక్రమంగా నిర్మించిన కట్టడాలను వదిలిపెట్టేది లేదని తెలిపారు.
TDP : టీడీపీలోకి వెళితే భవిష్యత్ ఉంటుందా?
తెలుగుదేశం పార్టీకి ఐదు దశాబ్దాల చరిత్ర ఉంది. సీనియర్ నేతల నుంచి యువనేతలతో ఆ పార్టీ ఫుల్లు అయిపోయింది. ఇప్పటికే కూటమి ఏర్పడటంతో మిత్ర పక్షాలకు అసెంబ్లీ స్థానాలను సర్దుబాటు చేయాల్సి రావడంతో అనేక మంది టీడీపీ నేతలు తమ టిక్కెట్లను త్యాగం చేయాల్సి వచ్చింది.
బుద్ధవనం సందర్శనకు థాయిలాండ్ బౌద్ధ బిక్షువుల ఆసక్తి
థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లోని వాట్ త్రెమిట్ లో ఉన్న ఫ్ర బుద్ధ మహా సువర్ణ ప్రతిమాకర బౌద్ధాలయ భిక్షులను, బుద్ధవనం బుద్ధిష్ట్ ఎక్స్పర్ట్ కన్సల్టెంట్ మరియు సీఈఓ, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, డా.ఈమని శివనాగిరెడ్డి ఆహ్వానించారు. స్థానిక మహారాణి సిరికిటి నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్న పసిఫిక్ ఆసియా ట్రావెల్ ఏజెన్సీ (పాటా) 50వ సమావేశానికి ఆయన తెలంగాణ పర్యాటకశాఖ ప్రతినిధిగా హాజరయ్యారు.
Breaking : టీటీడీ కీలక నిర్ణయం.. లడ్డూలు ఇక చేదే
తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. లడ్డూలపై ఆంక్షలు విధించింది. ఒకరికి ఒక లడ్డూ మాత్రమే ఇచ్చేలా నిర్ణయం తీసుకుంది. ఆధార్ కార్డు ఉంటేనే భక్తులక అదనపు లడ్డూ ఇస్తారని అధికారులు తెలిపారు. లేకుంటే ఒక భక్తుడికి ఒక లడ్డూ మాత్రమే ఇచ్చేలా డెసిషన్ తీసుకోవడంతో లడ్డూల కోసం భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని రైతులకు గుడ్ న్యూస్
రాజధాని అమరావతి రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకూ పెండింగ్ లో ఉన్న కౌలు మొత్తాన్ని విడుదల చేయడానికి సిద్ధమయింది. రాజధాని రైతులకు గత ప్రభుత్వం కౌలు బకాయీలను చెల్లించలేదు. కొన్ని నెలల నుంచి పెండింగ్ లో పెట్టారు. అయితే కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం రాజధానిపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది.
Andhra Pradesh : గుడ్ న్యూస్...ఈ నెల ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ
ఆంధ్రప్రదేశ్ లో పింఛనుదారులకు గుడ్ న్యూస్‌ను ప్రభుత్వం చెప్పింది. ఒక రోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ నెల 31వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబరు 1న ఆదివారం రావడంతో సెలవు దినం రోజు కంటే ముందుగానే పింఛన్ల పంపిణీ జరగనుంది.
YSRCP : నేడు ఇద్దరు వైసీపీ రాజ్యసభ సభ్యుల రాజీనామా?
ఈరోజు ఇద్దరు వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు పదవికి రాజీనామా చేయనున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన మోపిదేవి వెంకటరమణ, నెల్లూరు జిల్లాకు చెందిన బీద మాస్తాన్ రావులు నేడు రాజ్యసభ స్పీకర్ కు తమ రాజీనామా లేఖలను సమర్పించనున్నారు. నిన్న రాత్రి ఈ ఇద్దరు ఢిల్లీకి చేరుకున్నారు.
Ys Jagan : ఇలాంటి వారికా పదవులిచ్చింది జగనూ... క్లిష్ట సమయంలో హ్యాండ్ ఇస్తున్నారుగా?
అధికారంలో ఉన్ననాళ్లు పదవులు అనుభవించిన నేతలు ఇప్పుడు పవర్ పోగానే పార్టీని వదిలిపోతున్నారు. పెద్ద పెద్ద నేతలే పార్టీని వదిలివెళుతున్నప్పుడు ఇక కిందిస్థాయి నేతల గురించి ఆలోచించాల్సిన పనిలేదేమో. ఎందుకంటే మేయర్లు, కార్పొరేటర్లు పార్టీలు మారడం సర్వసాధారణం.