టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
వాడకం మామూలుగా ఉండదు! సైబర్ కేటుగాళ్ల చేతిలో మోసపోయి నటి, తెలంగాణ విద్యార్థిని అనుమానాస్పద మృతి 55 పరుగులకే ఆలౌట్..
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
Covid Jn.1 cases in India : తెలంగాణలో పెరుగుతున్న వైరస్ కేసులు
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. హైదరాబాద్ నగరంతో పాటు వైరస్ జిల్లాలకు కూడా వ్యాపించింది. తాజాగా కరోనా పాజిటివ్ కేసులు కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాలో నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తుంది.
Mani Sharma : మణిశర్మని బాధపెడుతున్న పవన్, మహేష్..
టాలీవుడ్ లో మెలోడీ బ్రహ్మగా పేరు సంపాదించుకున్న మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ. చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలకు ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్.. ఇప్పుడు ఆఫర్స్ రావడం లేదని తన బాధని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
55 పరుగులకే ఆలౌట్: రివెంజ్ ప్లాన్ చేసిన భారత్
మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఓటమికి భారత జట్టు రివెంజ్ ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దక్షిణాఫ్రికా చేతిలో మొదటి టెస్టు మ్యాచ్ లో ఇన్నింగ్స్ తేడాతో భారతజట్టు ఓడిపోగా.. కొత్త సంవత్సరంలో భారత జట్టు దక్షిణాఫ్రికా బ్యాటర్లకు చుక్కలు చూపించింది. 55 పరుగులకే సఫారీలను మొదటి ఇన్నింగ్స్ లో పెవిలియన్ చేర్చింది.
Telangana : సంక్రాంతి సెలవులను ప్రకటించిన ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి సెలవులను ప్రకటించింది. పాఠశాలలకు సంక్రాంతి సెలవులను ప్రకటిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ నెల 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకూ సంక్రాంతి సెలవును ప్రకటించింది. ఈ సెలవులు అన్ని విద్యాసంస్థలకు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. మొత్తం ఆరు రోజుల పాటు సంక్రాంతి సెలవులను ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Ys Sharmila : షర్మిలది అతి విశ్వాసంలా అనిపించడం లేదా.. అంత సీన్ లేదంటున్న ఎనలిస్టులు
"తోచీ తోచనమ్మ తోటి కోడలు పుట్టింటికి వెళ్లిందట" ఈ సామెత సోషల్ మీడియాలో వైఎస్ షర్మిలపై వైరల్ అవుతుంది. అయితే ఈ సామెత షర్మిలకు ఎంత వరకూ వర్తిస్తుందన్నది పక్కన పెడితే ఆమె అతి విశ్వాసానికి పోయి ఉన్న ఇమేజ్ కాస్తా పోగొట్టుకునే అవకాశాలు మాత్రం పుష్కలంగానే కనిపిస్తున్నాయి. వైఎస్ షర్మిల మాట తీరును చూస్తుంటేనే అది అర్థమవుతుంది.
న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్: ఆరు పబ్బులు అడ్డంగా బుక్
జూబ్లీహిల్స్‌లోని ఆరు పబ్‌లపై హైదరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. పోలీసులు నిబంధనలను విధించినా కూడా వాటిని పట్టించుకోలేదు ఈ పబ్ ల నిర్వాహకులు. కొత్త సంవత్సర వేడుకల నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ పబ్బులపై కేసు నమోదు చేశారు. పర్యావరణ చట్టం, హైదరాబాద్ సిటీ పోలీసు చట్టాన్ని ఉల్లంఘించినందుకు హాలో, టారో, క్సేనా, మకౌ, లెఫ్ట్ బార్ కిచెన్, గ్రీస్ మంకీ పబ్ లపై కేసు నమోదు చేశారు.
డిసెంబర్ 31న హోటల్లో పార్టీ: అస్సాంలో తెలంగాణ విద్యార్థిని అనుమానాస్పద మృతి
అస్సాంలోని ఐఐటీ గువాహటిలో ఇంజినీరింగ్ చదువుతున్న తెలంగాణకు చెందిన ఓ విద్యార్థిని హోటల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలిని పుల్లూరి ఐశ్వర్యగా గుర్తించారు. ఐఐటీ గువాహటిలో బీటెక్ నాలుగో ఏడాది చదువుతున్న విద్యార్ధినిగా పోలీసులు దృవీకరించారు. ఐఐటీ గువాహటిలో ఈసీఈ చదువుతున్న ఐశ్వర్యతో పాటు ఆమె ముగ్గురు స్నేహితులు నూతన సంవత్సరం వేడుకల నిమిత్తం ఐఐటీ క్యాంపస్‌కు 25 కి.మీల దూరంలోని ఓ హోటల్లో రెండు గదులను బుక్ చేసుకున్నారు.
జనసేనలో వంశీకృష్ణ యాదవ్‌కు కీలక పదవి
ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ కు జనసేన పార్టీ అధినేత బంపర్ ఆఫర్ ఇచ్చారు. విశాఖ జనసేన అధ్యక్షుడిగా నియమించారు. జిల్లా బాధ్యతలను వంశీకృష్ణ యాదవ్ చూసుకుంటారని పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ మేరకు జనసేన పార్టీ అధికార ప్రకటన చేసింది. వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న వంశీకృష్ణ యాదవ్ ఇటీవల పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.
Anjali Patil : సైబర్ కేటుగాళ్ల చేతిలో మోసపోయి లక్షలు పోగుట్టుకున్న నటి
సైబర్ మోసాల పై పోలీసులు ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నా, ఎంత అవగాహనా కల్పిస్తున్నా.. ఎవరో ఒకరు ఇంకా ఈ మోసాలకు బలవుతున్నారు. సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీస్ సైతం ఈ మోసాలకు గురవుతున్నారు. రీసెంట్ ఓ నటి సైబర్ కేటుగాళ్ల చేతిలో మోసపోయి లక్షలు పోగుట్టుకున్నారు.
వాడకం మామూలుగా ఉండదు!
ఈ ఏడాది ప్రధమార్థంలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఇకపై దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చుట్టూ తిరగబోతున్నాయి. గత పదేళ్లలో ఎన్నడూ వినిపించనంతగా ఆయన పేరు ఇప్పుడు వినిపించనుంది. తెలంగాణలో బోణీ కొట్టలేకపోయిన వైఎస్సార్ కుమార్తె షర్మిళ కాంగ్రెస్‌లో చేరుతున్న సంగతి తెలిసిందే.