4July-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
భారత్ క్రికెట్ టీం ప్రధాని నరేంద్ర మోదీ తో సమావేశమయ్యారు. ఆయనతో కలసి బ్రేక్ఫాస్ట్ చేశారు. వెస్టిండీస్ లో టీ20 వరల్డ్ కప్ ను సొంతం చేసుకున్న టీం ఇండియా ఈరోజు ఉదయం భారత్ కు చేరుకుంది. ప్రధాని నివాసానికి వెళ్లింది. తన నివాసానికి వచ్చిన టీం ఇండియా క్రికెటర్లను మోదీ అందరితో విడివిడిగా పలకరించారు.
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
Narendra Modi : టీం ఇండియాతో ప్రధాని ముచ్చట్లు
భారత్ క్రికెట్ టీం ప్రధాని నరేంద్ర మోదీ తో సమావేశమయ్యారు. ఆయనతో కలసి బ్రేక్ఫాస్ట్ చేశారు. వెస్టిండీస్ లో టీ20 వరల్డ్ కప్ ను సొంతం చేసుకున్న టీం ఇండియా ఈరోజు ఉదయం భారత్ కు చేరుకుంది. ప్రధాని నివాసానికి వెళ్లింది. తన నివాసానికి వచ్చిన టీం ఇండియా క్రికెటర్లను మోదీ అందరితో విడివిడిగా పలకరించారు.
Chief Ministers Meeting : సేమ్ స్పాట్.. సేమ్ ఛెయిర్స్..కానీ సీఎంలే మారారు.. అదీ అసలు సీన్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అవుతున్నారు. ఎల్లుండి సాయంత్రం ఈ సమావేశం ప్రజా వేదికలో జరగనుంది. గతంలోనూ ఇదే ప్రజాభవన్ (అప్పట్లో ప్రగతి భవన్) లో అప్పటి ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ లు సమావేశమయ్యారు. కానీ ఐదేళ్ల కాలం మాత్రం విభజన సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు.
Pawan Kalyan : జనసేనలో హాట్ టాపిక్... పవన్ ను ఢిల్లీ చంద్రబాబు ఎందుకు తీసుకెళ్లలేదు?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులను వరసగా కలుస్తున్నారు. కేవలం నిధులను అత్యధికంగా సమీకరించే దిశగానే చంద్రబాబు హస్తిన పర్యటన పెట్టుకున్నారు. ఆయన నిన్ననే ఢిల్లీకి చేరుకున్నారు.
Breaking : వైసీపీ కార్యాలయాల కూల్చివేతపై హైకోర్టు ఏమందంటే?
వైసీపీ కార్యాలయాల కూల్చివేతలపై నేడు హైకోర్టు తీర్పు వెలువరించింది. చట్ట ప్రకారమే వ్యవహరించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ప్రజలకు ఇబ్బంది కలిగించేలా నిర్ణయాలు తీసుకోకూడదని తెలిపింది. రెండు నెలల్లోగా భవన నిర్మాణాలక అనుమతులు అధికారులకు సమర్పించాలని తెలిపింది.
Andhra Pradesh : సోమవారం నుంచి ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. ఆరోజు నుంచి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 8వ తేదీ నుంచి ఉచిత ఇసుక విధానాన్ని అమలులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇసుక విక్రయాల పై ఒక్క రూపాయి కూడా వసూలు చేయకూడదని నిర్ణయించింది. ఇకపై టన్నుకు ఎనభై ఎనిమిది రూపాయలు మాత్రమే వసూలు చేస్తారు.
Leopard : మహానంది క్షేత్రం వద్ద మళ్లీ చిరుతపులి
మహానంది క్షేత్రం వద్ద మళ్లీ చిరుతపులి కనిపించింది. దీంతో భక్తులు భయపడి పరుగులు తీశారు. నంద్యాల నియోజకవర్గం మహానందిలో చిరుత పులి గత కొద్ది రోజులుగా తిరుగుతుంది. ఇటీవల గోశాల సమీపంలో చిరుత కనిపించింది. ట్రాప్ కెమెరాలో చిరుత కదలికలు కనిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
Andhra Pradesh : ఏపీలో మరో మూడు రోజులు వర్షాలు
ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ గాలుల ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని అధికారులు చెబుతున్నారు. పశ్చిమ గాలుల ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Telangana : నేడు తెలంగాణలో పాఠశాలలు బంద్
దేశవ్యాప్తంగా నేడు పాఠశాలలు, కళాశాలలకు బంద్ కు విద్యార్థి సంఘాలు పిలుపు నిచ్చాయి. నీట్ పరీక్షలపై సమగ్ర విచారణను జరపాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు ఈ బంద్ కు పిలుపు నిచ్చాయి. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూ, పీడీఎస్ఓ, ఎన్ఎస్యూఐ విద్యార్థి సంఘాలు ఈ బంద్ కు పిలుపు నిచ్చాయి.
Lk Advani : అపోలో ఆసుపత్రిలో చేరిన ఎల్కే అద్వానీ
బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ తిరిగి అస్వస్థతకు గురయ్యారు. ఆయనను హుటాహుటిన ఢిల్లీలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఇటీవల అద్వానీకి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఢిల్లీ ఎయిమ్స్ లో చేర్చారు. చికిత్స పొందిన అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. తిరిగి ఆయన అస్వస్థతకు గురి కావడంతో అపోలో ఆసుపత్రిలో చేరి చికిత్స అందిస్తున్నారు.
వైఎస్ వివేకా హత్య కేసులో సాక్షి రంగన్న ఆరోగ్య పరిస్థితి విషమం
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలకమైనే సాక్షిగా ఉన్న వాచ్మెన్ రంగన్న ఆరోగ్యం విషమించింది. ఆయనను మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ కు తరలించారు. రంగన్న వివేకానందరెడ్డి హత్య ఇంట్లో వాచ్మెన్ గా ఉన్నారు. వివేకా హత్య జరిగినప్పుడు ఆయన ఉన్నారు. వివేకా హత్య కేసులో రంగన్నను సీబీఐ కీలక సాక్షిగా పేర్కొంది.