టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
గీజర్గా మారిన పొయ్యి.. సరికొత్త యాప్‌ను సృష్టించిన తెలంగాణ వాసి, షర్మిలకు టచ్ లోకి లీడర్లు.. నాకు టిక్కెట్ ఇవ్వనన్నారు..
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
Telangana : రేపటి నుంచే సంక్రాంతి స్పెషల్ బస్సులు.. మహిళలకు ఉచిత ప్రయాణం
సంక్రాంతి పండగ కోసం సొంత ఊళ్లకు వెళ్లే వారికి టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. సంక్రాంతి పండగ కోసం 4,484 స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసినట్లు టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. రేపటి నుంచి ఈ స్పెషల్ బస్సులు సొంతూళ్లకు వెళ్లే వారి కోసం బయలుదేరనున్నాయి. ఈ నెల 15వ తేదీ వరకూ స్పెషల్ సర్వీసులు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు.
AP MLC : రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీకు తీవ్రగాయాలు
:నెల్లూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. నిన్న అర్థరాత్రి నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రేగడిచెలిక సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొనింది. దీంతో ఎమ్మెల్సీ కారులో ఉన్న పీఏ అక్కడికక్కడే మరణించారు.
Cold Winds : చలిని ఎంజాయ్ చేస్తున్నారట.. మరికొద్ది రోజులు ఇలాగేనట
చలిగాలుల తీవ్రత తగ్గడం లేదు. గత కొన్ని రోజుల నుంచి తెలుగు రాష్ట్రాలలో చలిగాలులు ఎక్కువగానే ఉన్నాయి. వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు రెండు రోజులు మూడు రోజుల పాటు చలిగాలులు ఉంటాయని చెబుతున్నా అవి మాత్రం ఎన్ని రోజులైనా తగ్గడం లేదు.
Sankranthi Movies : ఈ సంక్రాంతి సినిమా రిలీజ్‌ల లిస్ట్ ఇదే..
తెలుగువారు ఘనంగా జరుపుకునే పండుగ సంక్రాంతి. బంధువులంతా ఒక చోట కలిసి ఈ పండగని ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. ఇక ఈ ఆనందాన్ని మరింత రెట్టింపు చేసుకోవడానికి కొత్త సినిమాలు చూడడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఈ పండుగ సమయంలో సినిమా హిట్ ప్లాప్ టాక్ తో సంబంధం ఉండదు.
App: ఇక ఫేక్ ఐడీలకు చెక్.. సరికొత్త యాప్‌ను సృష్టించిన తెలంగాణ వాసి
ఈ రోజుల్లో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా బ్యాంకుల నుంచి అంటూ ఫోన్లు చేస్తూ ప్రజలను నిలువునా దోపిడి చేస్తున్నారు. ఫోన్ కాల్స్ కాకుండా లింక్‌లను పంపుతూ కూడా మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి సైబర్ నేరాలకు చెక్ పెట్టేందుకు ఓ యువకుడు చేసిన ప్రయత్నానికి అందరు ఫిదా అవుతున్నారు.
పొలిటికల్, ఎమోషనల్, ఫ్యామిలీ డ్రామా
వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల కాంగ్రెస్‌లో తన పార్టీని విలీనం చేయడంతో... ఆంధ్రప్రదేశ్‌లో మరో కుటంబ కథా చిత్రం ప్రారంభమైంది. ఇప్పటివరకూ నందమూరి, నారా కుటుంబాల మధ్య నడిచిన ఫ్యామిలీ గొడవలు ఇప్పుడు వైఎస్ కుటుంబంలోకి కూడా ప్రవేశిస్తున్నాయి.
Ginger: రోజూ అల్లం నీటిని తాగడం వల్ల ఎలాంటి ఉపయోగాలో తెలుసా?
ప్రతిరోజూ అల్లం నీటిని తాగడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. స్థూలకాయంతో ఇబ్బంది పడుతుంటే ఎన్ని పనులు చేసినా తగ్గకపోతే అల్లం నీళ్లు తాగాలి. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగడం వల్ల డయాబెటిక్ పేషెంట్లకు గొప్ప ఉపశమనం లభిస్తుంది. మధుమేహం అదుపులో ఉంటుంది.
Breaking: నాకు టిక్కెట్ ఇవ్వనన్నారు.. ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేస్తా
రాయదుర్గం టిక్కెట్ తనకు ఇవ్వలేమని చెప్పారని వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తెలిపారు. అయితే తాను ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు.
Ys Sharmila : షర్మిలకు టచ్ లోకి లీడర్లు.. కాంగ్రెస్ లోకి వరస పెట్టనున్న నేతలు
వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చకా చకా మారుతున్నాయి. ఎక్కువ మంది పాత నేతలు కాంగ్రెస్ లోకి తిరిగి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రులుగా పనిచేసిన వారిలో కొందరు ఇప్పటికే కాంగ్రెస్ లోకి వస్తామని సంకేతాలను పంపుతున్నారట.
Viral Video: గీజర్గా మారిన పొయ్యి.. ఓ వైపు వంట.. మరోవైపు వేడినీరు.. వీడియో వైరల్
కొందరు టెక్నాలజీలో ఎందులోనూ సాటిలేదన్నట్లుగా ఉంటారు. మన కళ్ల ముందే అద్భుతాలు సృష్టిస్తుంటారు. ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. అది అప్పుడప్పుడు బయటకు వస్తుంటుంది. దేనికి పనికి రాని వస్తువులతో ఉపయోగపడే వస్తువుగా తయారు చేస్తుంటారు. అలాంటి వీడియోలు కొన్ని సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంటాయి.