5June-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
నేడు ఢిల్లీలో కేంద్ర మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగనుంది. అయితే గత ఎన్నికలకంటే తక్కువ స్థానాలు రావడంతో ఈ మంత్రివర్గ సమావేశానికి ప్రాధాన్యత ఉంది. ఈసారి ఎన్డీఏ మిత్రుల సహకారంతో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మిత్రులకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది.
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
నేడు కేంద్ర మంత్రి వర్గ సమావేశం
నేడు ఢిల్లీలో కేంద్ర మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగనుంది. అయితే గత ఎన్నికలకంటే తక్కువ స్థానాలు రావడంతో ఈ మంత్రివర్గ సమావేశానికి ప్రాధాన్యత ఉంది. ఈసారి ఎన్డీఏ మిత్రుల సహకారంతో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మిత్రులకు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది.
Andhra Pradesh : సెలవుపై వెళుతున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు.. ప్రభుత్వం మారడంతో?
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారడంతో కొందరు అధికారులు తమ దారి తాము వెతుక్కుంటున్నారు. కొందరు తిరిగి కేంద్ర సర్వీసుకు వెళ్లేందుక ప్రయత్నాలు ప్రారంభించారు. వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారని పేరుపడిన ఐఏఎస్, ఐపీఎస్ లు తమకు ఇంకా పదవీ విరమణకు సమయం ఉండటంతో ఈ ఐదేళ్ల పాటు రాష్ట్రానికి దూరంగా ఉండటమే మేలన్న నిర్ణయానికి వచ్చారు.
Chandrababu Naidu : ప్రత్యేకహోదా సాధించుకునేందుకు ఇదే అసలు సమయం.. అదే జరిగితే ఇక తిరుగుండదుగా?
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నేడు దేశ రాజకీయాల్లో కీలకంగా మారారు. ఎన్డీఏలో అతి పెద్ద పార్టీగా టీడీపీ అవతరించింది. దీంతో అనేక దీర్ఘకాలిక సమస్యలకు ఈ ఎన్నిక ఫుల్స్టాప్ పెడుతుందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. పార్టీని మరింత బలోపేతం చేసుకోవాలనుకున్నా, మరికొన్ని ఎన్నికల్లో తాను అలవోకగా విజయం సాధించాలనుకున్నా చంద్రబాబుకు టైం కలసి వచ్చింది.
YSRCP : నా.. నా.. నా.. అంటే. బటన్ నొక్కేశారా.. బీసీలు ఇలా షాకిచ్చారేమిటి? పెద్ద బొక్కే పెట్టారుగా?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. వైఎస్ జగన్ పార్టీకి కేవలం పదకొండు అసెంబ్లీ స్థానాలే దక్కాయి. జగన్ పార్టీ పెట్టిన తర్వాత ఇంత తక్కువ స్థాయిలో స్థానాలు దక్కడం ఇదే తొలిసారి. అయితే ఇది జగన్ కూడా ఊహించని ఫలితాలు. సంక్షేమ పథకాలు తనకు మరోసారి అధికారాన్ని అందిస్తాయని భావించిన ఆయనకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు షాకిచ్చారు.
Narendra Modi : ఈ నెల 8న నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం
నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారయింది. మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కర్తవ్యపథ్ లో ఈ నెల 8వ తేదీన ఆయన ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Revanth Reddy : బీఆర్ఎస్ ఓట్లను బీజీపీకి బదిలీ చేసింది
తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వదించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చరిత్రలో బీఆర్ఎస్ కు పార్లమెంటు లో స్థానం లేకుండా పోయిందన్నారు. అనేకచోట్ల బీఆర్ఎస్ తన ఓట్లను బీజేపీకి బదిలీచేసిందని చెప్పారు. మెదక్ లో బీఆర్ఎస్ అభ్యర్థిని హరీశ్ రావు నమ్మించి మోసం చేశాడని, లోపాయికారీగా బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతు తెలిపారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
Pinnelli : పిన్నెల్లి అరెస్ట్‌కు రంగం సిద్ధం.. రేపు అదుపులో తీసుకునే అవకాశం
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ కు పోలీసులు సిద్ధమయ్యారు. ఆయనను రేపు ఉదయం అరెస్ట్ చేసే అవకాశం ఉంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై అనేక కేసులున్నాయి. పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంల ధ్వంసం కేసుతో పాటు మూడు హత్యాయత్నం కేసులు ఆయనపై నమోదయ్యాయి.
ఒకే విమానంలో నితీష్.. తేజస్వి.. ఏమైనా జరగొచ్చా?
నేడు ఇండియా కూటమి సమావేశం జరగనుంది. ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే నివాసంలో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై చర్చిస్తారు. భాగస్వామ్య పక్షాలతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయన్న దానిపై భాగస్వామ్య పక్షాలతో కాంగ్రెస్ నేతలు చర్చించనున్నారు. అటు ఎన్డీఏ కూటమి సమావేశం కూడా ఈరోజు సాయంత్రం ఢిల్లీలో జరగనుంది.
Ap Elections : నాటి కలెక్టర్లు.. నేడు ఎమ్మెల్యేలు
ఒకప్పటి నిజామాబాద్ జిల్లా కలెక్టర్లు నేడు ఎమ్మెల్యేలుగా మారారు. ముఖ్యంగా షెడ్యూల్ కులాలకు చెందిన ఐఏఎస్ లను అన్ని రాజకీయ పార్టీలు తమ పార్టీలోకి తీసుకుని టిక్కెట్లు ఇవ్వడం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తుంది. అనేక మంది ఐఏఎస్ లు ఎమ్మెల్యేలుగా మారారు. ఈ ఎన్నికల్లోనూ ఇద్దరు ఎమ్మెల్యేలు రెండు పార్టీల నుంచి పోటీచేసి ఎమ్మెల్యేలుగా గెలిచారు. నిజంగా ఇది కూడా అరుదైన ఘటనగానే చూడాల్సి ఉంది. వేర్వేరు పార్టీలైనా కూటమిలో ఉన్న పార్టీల నుంచి పోటీచేసి వీరిద్దరూ గెలుపొందారు.
T20 World Cup 2024 : చిన్న దేశమైనా అప్రమత్తంగా ఉండాల్సిందే.. ఏమరుపాటుగా ఉంటే మాత్రం?
ఈరోజు టీ20 వరల్డ్ కప్ లో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈరోజు ఐర్లాండ్ లో జరిగే మ్యాచ్ తో ప్రపంచకప్ లో తొలి మ్యాచ్ కు సిద్ధమవుతుంది. న్యూయార్క్ లో రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. అయితే భారత్ బలంగా కనిపిస్తున్నప్పటికీ ఐర్లాండ్ ను తక్కువగా అంచనా వేస్తే అభాసుపాలయ్యే అవకాశముంది. తొలి మ్యాచ్ కావడంతో ఆచితూచి ఆడాల్సి ఉంది. ఐర్లాండ్ వంటి చిన్న దేశమని భావిస్తే రిజల్ట్ తిరగబడే అవకాశముంది.