5August-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
శ్రీశైలం జలాశయానికి వరద నీరు తగ్గుతుంది. శ్రీశైలం జలాశయం పది గేట్లను పన్నెండు అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు ఇరిగేషన్ అధికారులు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు ఇన్ ఫ్లో 3,46,410 క్యూసెక్కులుగా ఉందని, ఔట్ ఫ్లో 3,74,676 క్యూసెక్కులు గా ఉందని అధికారులు తెలిపారు.
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
Srisailam : తగ్గుతున్న వరద.. ప్రస్తుతం ఇన్ఫ్లో ఎంతంటే?
శ్రీశైలం జలాశయానికి వరద నీరు తగ్గుతుంది. శ్రీశైలం జలాశయం పది గేట్లను పన్నెండు అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు ఇరిగేషన్ అధికారులు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు ఇన్ ఫ్లో 3,46,410 క్యూసెక్కులుగా ఉందని, ఔట్ ఫ్లో 3,74,676 క్యూసెక్కులు గా ఉందని అధికారులు తెలిపారు.
Bangladesh : బంగ్లాదేశ్ లో చెలరేగిన హింస... వంద మంది మృతి.. ఇంటర్నెట్ బంద్
కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కుమారుడు. ప్రస్తుతం ఆయన ఒక ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. డోన్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టీడీపీ లో చేరిన కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి తన కుటుంబ గౌరవం, ప్రతిష్ట కోసమైనా తనకు మంత్రి పదవి దక్కుతుందని భావించారు.
BJP : రేపు బీజేపీ కీలక సమావేశం
స్థానిక సంస్థల ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ సమాయత్తమవుతుంది. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతుంది. అందుకోసం ముందస్తు సమావేశాలను ఏర్పాటుచేసుకుంటుంది. పార్లమెంటు ఎన్నికల్లో ఎనిమిది స్థానాలను గెలిచిన ఊపు మీదున్న బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ముందుండాలని భావిస్తుంది.
కేటీపీఎస్ లో కాలం చెల్లిన ప్లాంట్లు కూల్చివేత
కేటీపీఎస్ పాత ప్లాంట్ లో ఎనిమిది కూలింగ్ టవర్లను అధికారులు కూల్చివేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని కేటీపీఎస్ ఫ్యాక్టరీలో ఉన్న 102 మీటర్ల ఎత్తులో ఉన్న ఎనిమిది కూలింగ్ టవర్లను కూల్చివేశారు. ఇంప్లోజన్ టెక్నాలజీ ద్వారా జెన్కో అధికారుల పర్యవేక్షణలో ఈ కూల్చివేతలు జరిగాయి.
Kodali Nani : కొడాలి నానికి చుక్కలు చూపించనున్నారా? తర్వాత టార్గెట్ ఆయనేనా?
మాజీ మంత్రి కొడాలి నాని ప్రస్తుత ప్రభుత్వానికి టార్గెట్ అని చెప్పాలి. ఎందుకంటే గత ఐదేళ్లు కొడాలి నాని టీడీపీ అగ్ర నేతలపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు వద్ద నుంచి లోకేష్ వరకూ ఎవరిని వదలకుండా ఆయన విమర్శలు చేసేవారు. వ్యక్తిగత దూషణలకు కూడా దిగేవారు.
India Vs Srilanka 2nd Odi Match : యంగ్ ఇండియానే బెటరేమో...సీనియర్లను తప్పించడం మంచిదేమో?
భారత్ - శ్రీలంక రెండో వన్డే మ్యాచ్ చూసిన వారికి ఎవరికైనా ఇదే అనిపించక మానదు. ఎందుకంటే.. రోహిత్ శర్మ ఉన్నంత వరకూ మ్యాచ్ మనదేనని అనిపించింది. కానీ రోహిత్ అవుట్ అయిన తర్వాత వరసపెట్టి క్యూ కట్టారు. ఎవరూ క్రీజులో నిలవలేదు. టీ20 వరల్డ్ కప్ లో విన్నర్ గా నిలిచిన భారత్ జట్టు ఇదేనా?
కవిత బెయిల్ పిటీషన్ పై విచారణ వాయిదా
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై విచారణను న్యాయస్థానం ఎల్లుండికి వాయిదా వేసింది. కవిత దాఖలు చేసిన పలు బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమె డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఈ రోజు విచారణ జరిగింది.తదుపరి విచారణను రౌస్ అవన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరీ భవేజా ఆగస్ట్ 7వతేదీకి వాయిదా వేశారు.
TDP : నేడు కూటమి అభ్యర్థి ఎంపికపై కసరత్తు.. ఫైనల్ చేసే అవకాశం
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిపై నేడు క్లారిటీ వచ్చే అవకాశముంది. నేడు టీడీపీ నేతలు సమావేశమై అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. నిన్న అభ్యర్థి ఎంపికపై చర్చ జరిపినా ఒక నిర్ణయానికి రాకపోవడంతో ఈరోజు మరోసారి సమావేశమై అభ్యర్థిని ఎంపిక చేయాలని నిర్ణయించారు.
వ్యవస్థలను బతికించుకోవడానికి ఎన్నో పోరాటాలు చేశాం : పవన్ కల్యాణ్
వ్యవస్థలను బతికించడానికే ఐఏఎస్, ఐపీఎస్లు పని చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ ప్రజల నమ్మకానికి న్యాయం చేయాలని అన్నారు. గత ప్రభుత్వ పాలనలో తాము ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామని, అనేక పోరాటాలు చేసి తట్టుకుని నిలబడ్డామని తెలిపారు.
ఘోర ప్రమాదం.. ఎనిమిది మంది మృతి
బీహార్ లో ఘోర ప్రమాదం జరిగింది. విద్యుత్తు వైర్లు తగిలి ఎనిమిది మంది మరణించిన ఘటన బీహార్ లలోని హాజీపూర్ జిల్లాలో జరిగింది. ఒక భక్తుల బృందం వెళుతున్న వాహానికి హై టెన్షన్ విద్యుత్తు వైర్లు తగలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అనేక మంది గాయపడ్డారు.