7August-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
పార్టీ ఫిరాయింపులపై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులను ఎమ్మెల్యేలుగా అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ పిటీషన్ వేసింది.
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
Breaking : పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై తీర్పు రిజర్వ్
పార్టీ ఫిరాయింపులపై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులను ఎమ్మెల్యేలుగా అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ పిటీషన్ వేసింది.
Chandrababu : చంద్రబాబు ఆలోచన అదేనా? అప్పుడే జనం మొగ్గుచూపుతారా?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐదు పదుల రాజకీయ అనుభవం ఉన్న నేత. ఆయనకు ఒకరు వ్యూహాలను నేర్పాల్సిన పనిలేదు. ఆయనకు స్ట్రాటజిస్ట్ అవసరం లేదు. ఎప్పుడు ఏది చేయాలో రాజకీయంగా ఆయనకు తెలిసినంత మరే నేతకు తెలియదు. అందులో నూటికి నూరుపాళ్లు వాస్తవం ఉంది.
Vinesh Phogat : ఒలింపిక్స్ లో ఇండియాకు షాక్...వినేశ్ ఫొగాట్ పై అనర్హత వేటు
ఒలింపిక్స్ లో ఇండియాకుషాక్ తగిలింది. భారత్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పై అనర్హత వేటు పడింది. ఫైనల్ చేరడంతో ఆమెకు గోల్డ్, సిల్వర్ మెడల్ వస్తుందని అందరూ భావించారు. సంతోషపడ్డారు. కాని అందుకు విరుద్ధంగా వినేశ్ ఫొగాట్ పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆమె పై అనర్హత వేటు పడటానికి కారణం బరువు పెరగడమే.
YSRCP : ద్వారంపూడికి ఇక దబిడి దిబిడేనా? అంతా రెడీ చేస్తున్నారా?
కాకినాడ పట్టణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్రమాలపై ప్రస్తుత ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. కాకినాడ పోర్టు నుంచి అక్రమ రేషన్ బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేశారన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికే దీనిపై విచారణ ప్రారంభమయింది. తాజాగా జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో కాకినాడలో రేషన్ బియ్యాన్ని దేశాన్ని దాటించడం గురించి ప్రస్తావించారు.
Prabhas : కేరళకు ప్రభాస్ రెండు కోట్ల విరాళం
సినీనటుడు ప్రభాస్ కేరళ విలయానికి చలించి పోయారు. ప్రభాస్ కేరళ ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కు రెండు కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. తెలుగు హీరోల్లో ఇంత పెద్ద మొత్తాన్ని ప్రకటించి ప్రభాస్ తన ఉదారతను చాటుకున్నారు. కేరళలోని వాయనాడ్ లో కొండచరియలు విరిగిపడి దాదాపు నాలుగు వందల మందికిపైగా మరణించిన సంగతి తెలిసిందే.
44,288 ఉద్యోగాలు.. మార్పులు చేసుకోడానికి సమయం ఇదే
డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ (ఇండియా పోస్ట్) గ్రామీణ డాక్ సేవక్ (GDS) 2024 రిక్రూట్మెంట్ కోసం ఆగస్టు 5, 2024న రిజిస్ట్రేషన్స్ పూర్తయ్యాయి. అభ్యర్థులు అధికారిక ఇండియా పోస్ట్ వెబ్సైట్ indiapostgdsonline.gov.in ద్వారా తమ దరఖాస్తులను సమర్పించారు. అభ్యర్థులు తమ దరఖాస్తులలో ఏమైనా దిద్దుబాటులు ఉన్నా..
Tirumala : తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి
తిరుమల ఘాట్ రోడ్ లో ప్రమాదం జరిగింది. తిరుమల రెండో ఘాట్ చివరి మలుపు వద్ద బైక్ ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో బైకుపై ప్రయాణిస్తున్న ఇద్దరు భార్య భర్తలు మరణించారు. తిరుమల ఘాట్ రోడ్డు మలుపు వద్ద వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. భార్యాభర్తలు తిరుమల దర్శనం కోసం వెళుతుండగా ప్రమాదంలో మరణించారు.
శ్రావణమాసం.. నేటి నుంచి ముహూర్తాలే... మూడు ముళ్లు
శ్రావణ మాసం వచ్చింది. ఆషాఢం వెళ్లింది. నేటి నుంచి మంచి ముహూర్తాలు వచ్చేశాయి. ఈరోజు నుంచి పెళ్లిళ్లు, శుభకార్యాలు జరుపుకోవడానికి వీలుంటుంది. మూఢం, ఆషాఢం కావడంతో మే నెల నుంచి అసలు ముహూర్తాలే లేవు. దాదాపు మూడు నెలల నుంచి ముహూర్తాలు లేకపోవడంతో శుభకార్యాలు జరగడం లేదు.
నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలు దిశగా
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఉదయం పదకొండు గంటలకు సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. ముఖ్యమైన నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశముంది.
13న శ్రీహరి కోటకు పవన్ కల్యాణ్
ఈనెల 13న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ శ్రీహరి కోటకు రానున్నారు. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం శ్రీహరికోట షార్ కు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇస్రో ఆధ్వర్యంలో గత నెల 14 నుంచి ఈ నెల 15 వరకు జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు.