టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
ఒక్క సీటు కూడా ఖాళీ లేదే... వారినే జగన్ ఎక్కువ తప్పించనున్నారా...మళ్లీ రోడ్లపైకి బజాజ్ చేతక్, దేవుడి పేరుతో దరఖాస్తు.. నన్ను ఆదుకోవయ్యా రేవంతూ..
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
Revanth Reddy : దేవుడి పేరుతో దరఖాస్తు.. నన్ను ఆదుకోవయ్యా రేవంతూ.. అంటున్న శివయ్య
తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలనకు నెల రోజులు పూర్తయింది. సంక్షేమ పథకాలకు అర్హులను ఎంపిక చేయాలని ప్రజా పాలన కార్కక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. గత నెల 28వ తేదీ నుంచి ఈ నెల 6వ తేదీ వరకూ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించింది.
Myanmar: మయన్మార్ లో విషాదం.. పదిహేడు మంది మృతి
మయన్మార్ లో విషాదం చోటు చేసుకుంది. ఒక గ్రామంపై సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో పదిహేడు మంది చనిపోయారు. వీరిలో తొమ్మిది మంది చిన్నారులున్నారు. పదిహేడు మంది వైమానిక దాడుల్లో మరణించడం అమానవీయ ఘటనగా అంతర్జాతీయ సమాజం గర్హిస్తుంది
నేడు డెడ్ లైన్ ముగియనుంది.. ఏం చేయనున్నారో?
ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీల సమ్మెకు ఈరోజు ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది. ఈరోజు లోపు విధుల్లోకి చేరకుంటే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ఇప్పటికే ఎస్మా చట్టాన్ని ప్రయోగించడంతో అంగన్ వాడీ వర్కర్లు ఈరోజు విధుల్లో చేరతారా? లేదా? అన్నది ఉత్కంఠగా మారింది.
Bilkis Bano Case : బిల్కిస్ బానో కేసులో "సుప్రీం" సంచలన తీర్పు
బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఈ కేసులో ఉన్న పదకొండు మంది దోషులకు క్షమాబిక్షను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. బిల్కిన్ బానో కుటుంబంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురిని దారుణంగా హత్య చేశారు. ఐదు నెలల గర్భిణిగా ఉన్న బానో పై నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
Bajaj Chetak : మళ్లీ రోడ్లపైకి బజాజ్ చేతక్
బజాజ్ చేతక్ కొత్త రూపు సంతరించుకుని మళ్లీ మార్కెట్ లోకి వస్తుందని బిజినెస్ వర్గాలు చెబుతున్నాయి. ఒకప్పుడు బజాజ్ చేతక్ కనిపించని రోడ్డు ఉండేది కాదు. స్కూటర్లలో రారాజు. ఇప్పటికీ పాత బజాజ్ చేతక్ బండ్లు కనిపిస్తూనే ఉంటాయి. హైదరాబాద్ నగరంలో ఎక్కువగా పాలు పోసే వారు ఈ బజాజ్ చేతక్ నే ఉపయోగిస్తుండటం చూస్తుంటాం.
Vijay - Rashmika : ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండ, రష్మిక నిశ్చితార్థం..?
టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ప్రేమ కథ.. ఆడియన్స్ నుంచి సినీ సెలబ్రిటీస్ వరకు ట్రెండింగ్ టాపిక్ అయ్యిపోతుంది. అయితే వీరిద్దరి మధ్య ఉన్నది ప్రేమా..? స్నేహమా..? అనే దానిపై ఓ క్లారిటీ రావడం లేదు. తమ మధ్య ఉన్నది స్నేహం మాత్రమే ప్రేమ కాదు అంటూనే విజయ్ అండ్ రష్మిక.. చాలా సన్నిహితంగా కనిపిస్తూ వస్తున్నారు.
PM Kisan: రైతులకు రూ.8000 సాయం.. పెరగనున్న పీఎం కిసాన్ సాయం!
రైతుల వ్యవసాయాన్ని సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకంలో నగదు మొత్తాన్ని పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది . దీనిపై ఏడాది క్రితమే కథనాలు వచ్చాయి. ఇప్పుడు ఈ అంశం మరింత ముదురుతోంది. ప్రస్తుతం ప్రభుత్వం మూడు విడతలుగా లబ్ధిదారులకు ఏడాదికి మొత్తం రూ.6వేలు అందజేస్తోంది కేంద్ర ప్రభుత్వం
Ys jagan : వారినే జగన్ ఎక్కువ తప్పించనున్నారా...? కారణం అందుకే
వైసీపీలో టిక్కెట్ కలకలం కొనసాగుతూనే ఉంది. ఎవరిని ఎప్పుడు తప్పిస్తారో తెలియకుండా ఉంది. వైసీపీ అధినేత జగన్ అదే పనిలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయన అభ్యర్థులను పెద్దయెత్తున మార్చాలని నిర్ణయించుకున్నారు. గత ఎన్నికలకు సంబంధించిన గణాంకాలు కూడా అవే చెబుతున్నాయి.
Trains : ఒక్క సీటు కూడా ఖాళీ లేదే... అన్నీ అయిపోయాయ్.. ఇప్పుడేటి సేయాలి?
సంక్రాంతి పండగకు అందరూ సొంత ఊళ్ల బాట పడతారు. హైదరాబాద్ నగరం దాదాపు ఖాళీ అయిపోతుంది. ఈసారి వరస సెలవులు రావడంతో ఐటీ ప్రొఫెషనల్స్ కూడా ఇంటికి బయలుదేరి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సంక్రాంతి పండగ కోసం ఇటు టీఎస్ఆర్టీసీ, అటు ఏపీఎస్ఆర్టీసీలు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నాయి.
Ayodhya : బెనారస్ చీరలకు డిమాండ్.. అయోధ్య రామమందిరం నిర్మాణంతో?
అయోధ్యలో ఈ నెల 22వ తేదీన రామమందిరం ప్రారంభం కానుంది. రామ్ లల్లాను ప్రతిష్టించబోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ అమృత ఘడియల కోసం వేచి చూస్తుంది.