8-8-24 టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
నాగార్జున సాగర్ కు జలకళ సంతరించుకుంది. భారీ వర్షాల కారణంగా వరదనీరు సాగర్ జలాశయానికి పోటెత్తుతుంది. దీంతో నాగార్జున సాగర్ లోని 26 గేట్లను ఇరిగేషన్ శాఖ అధికారులు ఎత్తి కిందకు నీటిని విడుదల చేస్తున్నారు. 22 గేట్లను ఐదు అడుగులు, నాలుగు గేట్లను పది అడుగుల మేర ఎత్తారు.
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
Nagarjun Sagar : సాగర్ జలకళను చూసి వద్దామా?
నాగార్జున సాగర్ కు జలకళ సంతరించుకుంది. భారీ వర్షాల కారణంగా వరదనీరు సాగర్ జలాశయానికి పోటెత్తుతుంది. దీంతో నాగార్జున సాగర్ లోని 26 గేట్లను ఇరిగేషన్ శాఖ అధికారులు ఎత్తి కిందకు నీటిని విడుదల చేస్తున్నారు. 22 గేట్లను ఐదు అడుగులు, నాలుగు గేట్లను పది అడుగుల మేర ఎత్తారు.
YSRCP : మారినోళ్లంతా... మేమింతే అంటున్నారుగా... ఇలాగయితే అక్కడ ఎలా?
వైఎస్సార్సీపీలో ఎన్నికలకు ముందు జరిగిన మార్పులు ఇప్పుడు నేతలను ఇబ్బంది పెడుతున్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చి రెండు నెలలు గడుస్తున్నా స్పష్టత లేకపోవడంతో వారంతా ఇప్పుడు తాడేపల్లి జగన్ నివాసం వైపు చూస్తున్నారు. ఎవరు ఎక్కడ ఏం చేయాలో తెలియడం లేదు.
Pawan Kalyan : పవన్ కల్యాణ్ పై ఎన్నో ఆశలు.. మరి పవన్ రాజీపడతారా? సాధిస్తారా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముందు పెద్దటాస్క్ ఉంది. ఆయన నిర్ణయం కోసం ఎంతో మంది జనసేన నేతలు ఎదురు చూస్తున్నారు. గత ఎన్నికల్లో కూటమి విజయం సాధించడంలో పవన్ కల్యాణ్ పాత్రను ఎవరూ కాదనలేరు. పవన్ లేకుంటే కూటమి ఏర్పాటు సాధ్యమయ్యేది కాదు.
Breaking : మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య మృతి
మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పాందుతూ ఆయన మృతి చెందారు. బుద్ధదేవ్ భట్టాచార్య గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 2000 నుంచి 2011 వరకూ బుద్ధదేవ్ భట్టాచార్య పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా కొనసాగారు.
నేడు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా యూనస్ ప్రమాణం
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా మహ్మద్ యూనస్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పదిహేను మంది మంత్రులతో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేసిన తర్వాత సైనిక పాలనలోకి వచ్చేసింది. అయితే రాజకీయ పార్టీలతో చర్చించి అక్కడ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యారు.
Revanth Reddy : అమెరికాలో కొనసాగుతున్న రేవంత్ పర్యటన
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన అమెరికాలో కొనసాగుతుంది. పెట్టుబడులు సాధించే లక్ష్యంగా ఆయన చేస్తున్న పర్యటన సత్ఫలితాలనిస్తుందనే చెప్పాలి. వివిధ పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలతో ఆయన సమావేశమై తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు రావాలని ఆహ్వానిస్తున్నారు.
India Vs Srilanka : ఇక చాల్లే... బ్యాగులు సర్దుకుని వచ్చేయండి బాసూ
వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్స్ వరకూ వచ్చిన టీం ఇండియా. టీ 20 వరల్డ్ కప్ లో విజేతగా నిలిచిన టీం ఇండియా శ్రీలంక చేతిలో దారుణ ఓటమి పాలు కావడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కనీసం ఒక్క మ్యాచ్ లోనూ గెలవకుండా చేతులెత్తేశారంటే.. నిర్లక్ష్యమా? చేతకానితనమా?
Chandrababu : చంద్రబాబుకు అంత ఈజీ కాదు... అయినా గుడ్న్యూస్ చెబుతారటగా
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయడం ఒక సవాల్ గా మారవచ్చు. గత ఎన్నికల్లో సీట్లు రాక కొందరు, పొత్తులో భాగంగా తమ స్థానాలను త్యాగాలను చేసిన తమ్ముళ్లు ఇలా చూసుకుంటూ పోతే 175 నియోజకవర్గాల్లో పెద్ద లిస్టే ఉంది.
Vinesh Phogat : ఇంతటి కఠిన నిర్ణయమా?
భారత్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను రెజ్లింగ్స్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఒలింపిక్స్ ఫైనల్స్ లో వంద గ్రాముల అధిక బరువు ఉందని ఆమె పై నిర్వాహకులు అనర్హత వేటు వేసిన నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. గోల్డ్ మెడల్ సాధించేందుకు బరిలోకి దిగిన వినేశ్ ఫొగాట్ పై అనర్హత వేటు పడటం ఆమె జీర్ణించుకోలేకపోయారు.
ఈ యువతికి ఒకేసారి మూడు ప్రభుత్వోద్యాగాలు
ఒకరికి ఒక ప్రభుత్వ ఉద్యోగం రావడం కష్టంగా మారిన ఈరోజుల్లో ఒక యువతికి మూడు ప్రభుత్వోద్యాగాలు రావడం అంతకంటే ఆనందం ఏముంటుంది. ఇప్పుడు ఆ యువతి ఏ ఉద్యోగంలో చేరాలన్నది నిర్ణయించుకోవడమే. చదువుల్లో రాణిస్తే ప్రభుత్వ ఉద్యోగాలు ఇంటి తలుపులు అవే తడతాయని జయ నిరూపించింది.