9June-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
అమరావతి ప్రాంతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆవిష్కరించిన స్థూపాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ప్రాంతంలో జగన్ పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించారు. ఆ సమయంలో కృష్ణాయపాలెం శివారులో శంకుస్థాపన చేశారు. నమూనా ఇంటితో పాటు, స్థూపాన్ని కూడా ఆ సమయంలో ఏర్పాటు చేశారు.
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
Amaravathi : జగన్ ఆవిష్కరించిన స్థూపం ధ్వంసం
అమరావతి ప్రాంతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆవిష్కరించిన స్థూపాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ప్రాంతంలో జగన్ పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించారు. ఆ సమయంలో కృష్ణాయపాలెం శివారులో శంకుస్థాపన చేశారు. నమూనా ఇంటితో పాటు, స్థూపాన్ని కూడా ఆ సమయంలో ఏర్పాటు చేశారు.
BJP : ట్రాక్ రికార్డుకే రెడ్ కార్పెట్... జెండా పట్టుకున్నోళ్లకే ఛాన్స్... ఈసారి నమ్మకున్న వారికే అందలం
భారతీయ జనతా పార్టీ అంటే సహజంగా సిద్ధాంతాలను ఉండే పార్టీ అని నమ్ముతారు. మొన్నటి వరకూ అంతే. ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలకంటే పార్టీని నమ్ముకున్న వారికే అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. అయితే సీట్ల విషయంలో మాత్రం రాజీ పడక తప్పలేదు. గెలుపు గుర్రాలకే ఇవ్వాల్సి రావడంతో బలహీనంగా ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి అధికంగా టిక్కెట్లు ఇచ్చారు.
Andhra Pradesh : చిన్నమ్మకు ఛాన్స్ లేనట్లేనా... ఈసారి ఆర్ఎస్ఎస్ ప్రభావం పనిచేసిందా?
కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చింది. ఈరోజు సాయంత్రం నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. మోదీతో పాటు కొందరు కేంద్ర మంత్రులు కూడా ప్రమాణం చేయనున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరికి దక్కుతుందన్న దానిపై అంచనాలు మాత్రం కొంత రివర్స్ అయ్యాయి.
Andhra Pradesh : ఏపీ మహిళలకు గుడ్ న్యూస్ ఆరోజు నుంచే ఉచిత ప్రయాణం?
ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. ఈ నెల 12న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రసంగంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై క్లారిటీ ఇస్తారని తెలిసింది. ఈ మేరకు ఆర్టీసీ అధికారులతో పాటు రాష్ట్ర ఉన్నతస్థాయి అధికారులు చర్చిస్తున్నారు.
YSRCP : జగనూ బీ అలెర్ట్... వాళ్లు కొంపముంచేటట్లున్నారు భయ్యా? ఆపడం కష్టమేనేమో?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి ఏపీ ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలయింది. పదకొండు శాసనసభ స్థానాలకే పరిమితమయింది. కేవలం నాలుగు పార్లమెంటు నియోజకవర్గాలకే పరిమితమయింది. ఉభయ సభల్లో పదిహేను మంది సభ్యులు వైసీపీకి ఉన్నట్లయింది. టీడీపీకి రాజ్యసభ లో ఎవరూ లేకపోవడంతో ఇప్పుడు ఉభయ సభల్లో దాని బలం పదహారు మాత్రమే. అంటే రెండు పార్టీలకు తేడా ఒకటే.
T20 World Cup 2024 : గెలిచేది మనమే... గెలిపించేది వాళ్లేనట.. అంచానాలు మాత్రం అదుర్స్
ఈరోజు రాత్రికి భారత్ - పాకిస్థాన్ టీ 20 మ్యాచ్ ప్రారంభం కానుంది. వరల్డ్ కప్ లో జరగనున్న తొలి సమరం. అత్యంత టెన్షన్ పెట్టేసే మ్యాచ్ ఇది. కేకలు పుట్టించే కిరాక్ గేమ్ ఇది. చూడటానికి రెండు కళ్లూ చాలవు. వరల్డ్ కప్ అందులోనూ.. పాక్ - భారత్ తలపడుతున్న తొలి పోరు. ఇంతకంటే క్రికెట్ ఫ్యాన్స్ కు ఏం కావాలి? కళ్లార్పకుండా చూడటానికి ఇంతకంటే మించిన మ్యాచ్ ఏముంటుంది.
కన్నీటి పర్యంత మయిన కాబోయే కేంద్ర మంత్రి
నరసాపురం పార్లమెంటు సభ్యుడు శ్రీనివాసవర్మ తనకు కేంద్ర మంత్రి పదవి దక్కడం పట్ల భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన ఊహించని విధంగా కేంద్ర కేబినెట్ లో చోటు దక్కినందుకు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు పాదాభివందనం చేశారు. ఆనందంతో ఆయనకళ్లు చెమర్చాయి. ఇది కార్యకర్తల విజయంగా శ్రీనివాస వర్మ అభినందించారు.
Ys Sharmila : వైఎస్సార్ విగ్రహాలపై దాడులు - వైఎస్ షర్మిల రియాక్షన్
రాష్ట్రంలో వైఎస్సార్ విగ్రహాలపై జరుగుతున్న దాడులపై కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. అల్లరి మూకలు చేస్తున్న వికృత దాడులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరాచకాలు జరగడం అత్యంత దారుణం, మిక్కిలి శోచనీయమని తెలిపారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇలాంటి రౌడీ చర్యలు ఖండించి తీరాల్సిందేనని, ఇది పిరికిపందల చర్య తప్ప మరోటి కాదని వైఎస్ షర్మిల అభిప్రాయపడ్డారు.
రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించనున్నాం : చీఫ్ సెక్రటరీ
రాజధాని ప్రాంతంలో చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ పర్యటించారు.అమరావతి లో ఆగిపోయిన పనులన్నీ త్వరలో ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. అమరావతి రైతులకు రావల్సిన రెండేళ్ల కౌలు నగదు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి క్లియర్ చేస్తామని తెలిపారు. యుద్ద ప్రాతిపాదికన జంగిల్ క్లియరెన్స్ చేపట్టామని ఆయన తెలిపారు.
మోదీ ప్రమాణానికి అరుదైన వ్యక్తికి ఆహ్వానం
ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే ఇందుకోసం ప్రత్యేక అతిధులు కూడా వస్తున్నారు. అయితే అతిధుల్లో పారిశుద్ధ్యకార్మికులతో పాటు ట్రాన్స్జెండర్లకు కూడా ఆహ్వానాలు వెళ్లాయి. అయితే మోదీ ప్రమాణ స్వీకారానికి అతిధిగా వందే భారత్ ట్రైన్ పైలట్ కు ఆహ్వానం అందింది.