9July-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
గత ఏడాది కాలంలో 23 పోలీస్ స్టేషన్ల పరిధిలోని సిబ్బంది స్వాధీనం చేసుకున్న ఐదు కోట్ల రూపాయలకు పైగా విలువైన మాదక ద్రవ్యాలను రాచకొండ పోలీసులు ధ్వంసం చేశారు. నిషేధిత పదార్థాలను యాదాద్రి భోంగీర్ జిల్లా కేంద్రంలో ప్రత్యేక కమిటీ ఆధ్వర్యంలో దహనం చేశారు.
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
ఐదు కోట్ల విలువైన డ్రగ్స్ ను రాచకొండ పోలీసులు ఎలా ధ్వంసం చేశారంటే?
గత ఏడాది కాలంలో 23 పోలీస్ స్టేషన్ల పరిధిలోని సిబ్బంది స్వాధీనం చేసుకున్న ఐదు కోట్ల రూపాయలకు పైగా విలువైన మాదక ద్రవ్యాలను రాచకొండ పోలీసులు ధ్వంసం చేశారు. నిషేధిత పదార్థాలను యాదాద్రి భోంగీర్ జిల్లా కేంద్రంలో ప్రత్యేక కమిటీ ఆధ్వర్యంలో దహనం చేశారు.
మళ్లీ వార్తల్లో నిమ్మగడ్డ ప్రసాద్.. ఈసారి ఏమైందంటే?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తులకు సంబంధించిన వాన్‌పిక్ కేసు నిందితుడు నిమ్మగడ్డ ప్రసాద్‌కు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసింది. జగన్ కంపెనీల్లో రూ.
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎలాంటి సమాధానాలు ఇస్తున్నారంటే?
వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు విచారించారు. ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లా పాల్వాయిగేటు పోలింగ్ బూత్‌లోని ఈవీఎంను పగలగొట్టిన కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు అయ్యారు. విచారణలో తొలి రోజు పిన్నెల్లి ఏ మాత్రం సహకరించలేదని పోలీసులు చెబుతున్నారు.
LPG eKYC: వంట గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్
LPG సిలిండర్ల కోసం eKYC ప్రమాణీకరణ ప్రక్రియను పూర్తీ చేయడానికి ఎటువంటి గడువు లేదని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పష్టం చేశారు. గ్యాస్ వినియోగదారుల ఈకేవైసీ గడువుకు ఎలాంటి డెడ్ లైన్ లేదన్నారు.
Virat Kohli: బ్రేకింగ్: విరాట్ కోహ్లీ పబ్ పై కేసు నమోదు
నిర్ణీత సమయానికి మించి ఓపెన్ చేసి ఉంచినందుకు విరాట్ కోహ్లీకి చెందిన వన్8 కమ్యూన్ పబ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. సమయానికి మించి ఆపరేట్ చేస్తున్నందుకు MG రోడ్‌లోని అనేక ఇతర పబ్, బ్రీవరీలపై బెంగళూరు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. డిసిపి సెంట్రల్ ప్రకారం..
Weather Report: కోస్తాకు భారీ వర్ష సూచన.. మరి తెలంగాణలో!!
తెలుగు రాష్ట్రాలతో వరుణుడు దోబూచులాడుతూ ఉన్నాడు. మేఘాలు మెండుగా ఉన్నా.. వర్షం మాత్రం పెద్దగా పడడం లేదు. దీంతో రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, ద్రోణి కారణంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారాయి.
అస్సాంలో ప్రిన్సిపాల్ గా ఒంగోలు వ్యక్తి.. విద్యార్థిని మందలించడంతో!!
ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలుకు చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ అస్సాంలోని శివసాగర్‌లో ఇంటర్మీడియట్ విద్యార్థి చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. కెమిస్ట్రీ సరిగా చదువుకోవడం లేదనే కారణంగా ప్రిన్సిపాల్ రాజేష్ ఓ విద్యార్థిని మందలించడంతో ఈ సంఘటన జరిగింది. విద్యార్థి కోపంతో రాజేష్ క్లాసులు చెబుతున్న సమయంలో కత్తితో దాడి చేశాడు.
విజయవాడలో ఆటో డ్రైవర్ కిడ్నీని ఎలా లాక్కున్నారంటే?
విజయవాడ నగరంలో కిడ్నీ రాకెట్ గుట్టు రట్టు అయిన కొద్ది రోజులకే గుంటూరు జిల్లాలో మరో బాధితుడు తనకు జరిగిన మోసాన్ని బయట పెట్టాడు. కిడ్నీ రాకెట్లో జి మధుబాబు అనే ఆటో రిక్షా డ్రైవర్ కూడా బాధితుడేనని తేలింది. విజయవాడకు చెందిన ఓ ముఠా తన ఒక కిడ్నీకి బదులుగా 30 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చిందని తెలిపింది.
విషాదం.. ప్రముఖ సింగర్ భర్త హఠాత్మరణం
భారతీయ పాప్ ఐకాన్ ఉషా ఉతుప్ భర్త మరణించారు. జానీ చాకో ఉతుప్ కోల్‌కతాలో మరణించినట్లు వారి కుటుంబ సభ్యులు ధృవీకరించారు. 78 ఏళ్ల జానీ తన నివాసంలో టీవీ చూస్తున్నప్పుడు అసౌకర్యానికి గురయ్యారు. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.
BCCI Prize Money: 125 కోట్లలో మొహమ్మద్ సిరాజ్ కు ఎంత వస్తుందంటే?
భారత మెన్స్ క్రికెట్ జట్టు T20 ప్రపంచ కప్ ఫైనల్ లో విజయం సాధించగా.. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) టైటిల్ గెలుచుకున్న జట్టు, కోచింగ్ సిబ్బందికి 125 కోట్ల ప్రైజ్ మనీని ఇస్తున్నట్లు ప్రకటించింది. బార్బడోస్‌లో జరిగిన ఉత్కంఠభరితమైన ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఆరు పరుగుల తేడాతో ఓడించి, 11 ఏళ్ల నిరీక్షణ అనంతరం భారత జట్టుకు ఐసీసీ ట్రోఫీ దక్కింది.