టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
పవన్ అలాంటి వ్యక్తి అని తెలియదు..కొత్త క్రికెట్ టీంని అనౌన్స్ చేసిన రామ్‌చరణ్..మేము ఛీకొట్టాం.. వాళ్లు తెచ్చుకున్నారు
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
Pawan Kalyan : వ్యూహం ప్రీరిలీజ్ ఈవెంట్లో పవన్‌పై అంబటి విమర్శలు.
విజయవాడలో జరిగిన ఆర్జీవీ 'వ్యూహం' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు చేశారు. టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఏపీ పాలిటిక్స్ ఆధారంగా వ్యూహం, శపథం అనే సినిమాలను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
చారిత్రాత్మక విజయాన్ని సాధించిన మహిళల జట్టు
భారత మహిళల క్రికెట్ జట్టు చారిత్రాత్మక విజయం నమోదు చేసింది. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మహిళల టెస్టు క్రికెట్లో ఆస్ట్రేలియాపై భారత్ కు ఇదే తొలి విజయం. 1977 నుంచి భారత్, ఆస్ట్రేలియా మహిళా జట్ల మధ్య 10 టెస్టులు జరగ్గా...
Breaking: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఐఏఎస్‌ల బదిలీలు
తెలంగాణలో ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి పాలన పగ్గాలు చేపట్టిన తర్వాత కీలక అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వ వ్యవస్థలో ఎన్నో మార్పులను తీసుకుస్తూ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే వివిధ శాఖల్లో అధికారుల బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తోంది ప్రభుత్వం.
సంజయ్ సింగ్ కు ఊహించని షాక్
భారత రెజ్లింగ్ సమాఖ్య నూతన అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ఎన్నికయ్యాక వివాదాలు మరింత ముదిరిపోయాయి. భారత రెజ్లర్ల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం రావడంతో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్యలో నూతనంగా ఎన్నికైన సంజయ్ సింగ్ కార్యవర్గాన్ని సస్పెండ్ చేస్తున్నట్టు కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
Ram Charan : కొత్త క్రికెట్ టీంని అనౌన్స్ చేసిన రామ్‌చరణ్..
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కొత్త క్రికెట్ టీంని తీసుకు రాబోతున్నాడంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక టీంని రామ్ చరణ్ తీసుకు రాబోతున్నాడంటూ వార్తలు వినిపించాయి.
Covid: కరోనా కొత్త వేరియంట్ జీర్ణవ్యవస్థపై దాడి.. శాస్త్రవేత్తల షాకింగ్ విషయాలు
కరోనా 2019 చివరిలో వచ్చింది. ఈ మహమ్మారి 2020 సంవత్సరంలో మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కురిపేసింది. దీనితో పోరాడటానికి, ప్రపంచం మొత్తం కలిసి అనేక వ్యాక్సిన్లను తయారు చేసింది. వ్యాక్సిన్ దాని ప్రభావాన్ని చూపడం ప్రారంభించినందున క్రమంగా కరోనా కేసులు తగ్గాయి
మేము ఛీకొట్టాం.. వాళ్లు తెచ్చుకున్నారు
టీడీపీ అధినేత చంద్రబాబును ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కలవడంపై వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని స్పందించారు. చంద్రబాబునాయుడికి సిగ్గు, శరం, మానాభిమానాలు ఏవీ లేవని ఆయన చర్యల ద్వారా అర్థమవుతుందని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు, లోకేశ్ గతంలో ప్రశాంత్ కిశోర్ గురించి ఏం మాట్లాడారో గుర్తు పెట్టుకోవాలని అన్నారు.
సోది కబుర్లన్నీ... సోషల్ మీడియాలో!
ఎప్పటికెయ్యది ప్రస్తుతకప్పటికా మాటలాడి... అని సుమతీ శతకకారుడు ఓ పద్యం చెప్పాడు. పద్య సారాంశం ఎలా ఉన్నా ఎన్నికల్లో గెలవడం కోసం ఎప్పటికప్పుడు మాటలు మార్చడంలో మన నేతలు ఎంతో ఎత్తుకు ఎదిగిపోయారు. మొన్నటివరకూ తప్పు అనిపించింది, నేడు వారికి రైట్ అనిపిస్తుంది.
Sriya Reddy : పవన్ అలాంటి వ్యక్తి అని తెలియదు.. సలార్ భామ కామెంట్స్..
తమిళ నటి శ్రియారెడ్డి.. ప్రభాస్ సలార్ సినిమాలో ముఖ్య పాత్ర చేసి ప్రస్తుతం నేషనల్ వైడ్ వైరల్ అవుతున్నారు. శ్రియారెడ్డి ఈ మూవీ కంటే ముందే తెలుగు ఆడియన్స్ దృష్టిని ఆకర్షించారు. గతంలో తమిళ హీరో విశాల్ నటించిన 'పొగరు' సినిమాలో శ్రియారెడ్డి నెగటివ్ పాత్రలో ఓ రేంజ్ యాక్టింగ్ చేసి..
ఫ్యాక్ట్ చెక్: ప్రపంచంలోనే అతిపెద్ద లైబ్రరీని చైనాలోని టియాంజిన్‌లో ప్రారంభించారు.. అయితే దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టలేదు
అక్టోబర్ 14, 2023న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 'స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ' పేరిట డాక్టర్ B R అంబేద్కర్ కు చెందిన 19 అడుగుల ఎత్తైన విగ్రహం ఆవిష్కరించారు. ఈ విగ్రహం మేరీల్యాండ్‌లోని అకోకీక్‌లోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ (AIC)లో భాగంగా ఉంది. భారతదేశం వెలుపల ఏర్పాటు చేసిన అంబేద్కర్ కు చెందిన అతిపెద్ద విగ్రహం.