27May-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
వరంగల్ - ఖమ్మం - నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికల కోసం మొత్తం 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నిక పోలింగ్ సాయంత్రం నాలుగు గంటల వరకూ కొనసాగుతుంది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో గ్రాడ్యుయేట్ ఓటర్లు వచ్చి తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు.
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
Telangana : కొనసాగుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక.. అంతా ప్రశాంతంగానే
వరంగల్ - ఖమ్మం - నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికల కోసం మొత్తం 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నిక పోలింగ్ సాయంత్రం నాలుగు గంటల వరకూ కొనసాగుతుంది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో గ్రాడ్యుయేట్ ఓటర్లు వచ్చి తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు.
Jc Divakar Reddy : దివాకరం.. ఏం మాట్లాడకపోతే ఎలా... ఎవరు గెలుస్తారో చెప్పయ్యా సామీ?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి జేసి దివాకర్ రెడ్డి అంటే తెలియని వారుండరు. ఆయన నోటికి అంత పవర్ ఉంది. ఆయన ఏదైనా మాట్లాడితే నిర్మొహమాటంగా మాట్లాడతారని ప్రతి ఒక్కరూ భావిస్తారు. ఎందుకంటే సీనియర్ నేతగా ఆయనకున్న అనుభవంతో పాటు ఎన్నికలను చూసిన ఆయన మాటలకు విలువ ఉంటుంది. అలాగే ఆయన పోలింగ్ తర్వాత కూడా అనేక సార్లు చెప్పింది నిజమయిందంటారు.
Hyderabad : హైదరాబాద్ లో కొత్త వైరస్.. బాధపడుతున్న నగరవాసులు
హైదరాబాద్ లో కొత్తరకం వైరస్ బయటపడినట్లుంది. నగరవాసులు ఎక్కువుగా ఆరోగ్యపరమైన ఇబ్బందులకు గురవుతున్నారు. గత కొద్ది రోజులుగా ఆసుపత్రులకు జనం క్యూ కడుతున్నారు. అయితే పెద్దగా ఇబ్బంది పెట్టకపోయినా గొంతు నొప్పి, ఒళ్లునొప్పులు, జలుబుతో అనేక మంది బాధపడుతున్నారు. ఇది వైరస్ ప్రభావమేనని వైద్యులు చెబుతున్నారు. గత వారం నుంచి ఇలాంటి రకమైన లక్షణాలతో ఎక్కువమంది ఆసుపత్రులకు వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు.
చంద్రబాబు స్కెచ్ వర్క్ అవుట్ అయింది.. ఆయన కోరుకున్నదీ అదే... జరిగిందీ అదేగా?
బీజేపీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారంటూ చంద్రబాబు పై ఎన్నికలకు ముందు చాలా మంది సోషల్ మీడియా వేదికగా అనేక రకాలుగా వ్యాఖ్యానాలు చేశారు. బీజేపీతో పొత్తు కొన్ని వర్గాలను దూరం చేస్తుందని మొత్తు కున్నారు. కానీ చంద్రబాబు వినిపించుకోలేదు. ఆయన లెక్కలు ఆయనకుంటాయి. ఆయన వ్యూహం ఆయనకు తప్ప మరొకరికి తెలియదు.
Remal Cyclone : తుపాను హెచ్చరిక.. ఎవరూ ఇళ్లలో నుంచి బయటకు రావద్దు
రెమాల్ తుపాను తీరం తాకినట్లు వాతావరణ వాఖ తెలిపింది. బంగ్లాదేశ్ లోని మంగ్లా పోరటు సమీపంలోని ఖేపుపుర మధ్య ఆదివారం అర్ధరాత్రి సమయంలో తపాను తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అందుకు తగినట్లుగానే తీరాన్ని తాకినట్లు అధికారులు తెలిపారు. తుపాను తీరం దాటే సమయంలో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని పేర్కొంది.
కవిత బెయిల్ పిటీషన్ విచారణ రేపటికి వాయిదా
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటీషన్ పై నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. విచారణను రేపటికి వాయిదా వేసింది. కవిత బెయిల్ పిటీషన్లను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల కవిత మార్చి 15వ తేదీన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు.
Bengaluru Rave Party : సినీ నటి హేమకు వైరల్ ఫీవర్ అట.. విచారణకు రాలేదట
బెంగళూరు పోలీసుల విచారణకు తాను ఈరోజు విచారణకు హాజరు కాలేనని సినీనటి హేమ లేఖ రాశారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమకు బెంగళూరు సీసీబీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. డ్రగ్స్ తీసుకున్నట్లు విచారణలో వెల్లడి కావడంతో నటి హేమకు నోటీసులు ఇచ్చారు. సోమవారం హాజరు కావాలని కోరారు.
IPL 2024 : ఇంత దారుణ ఓటమా? ఫైనల్స్లో ఇంత చెత్తగా ఎవరైనా ఆడతారా?
కోల్కత్తా నైట్ రైడర్స్ తో జరిగిన ఫైనల్స్ లో సన్రైజర్స్ హైదరాబాద్ భారీ ఓటమి చవి చూసింది. లీగ్ మ్యాచ్ లలో ఇరగదీసి ఆడిన సన్రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్ లో తడబడినా తేరుకుని ఫైనల్స్ కు చేరుకుంది. అయితే ఫైనల్స్ లో ఈసారి కప్పు గ్యారంటీ అనుకున్న సమయంలో దారుణ ఓటమిని సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఫైనల్స్ లో ప్రతి ఒక్కరూ చేతులెత్తేసినట్లే కనిపించింది. అసలు ఫైనల్స్ లాగా మ్యాచ్ జరగలేదు.
రాష్ట్ర అధికారిక చిహ్నం ఫైనల్ చేయడానికి
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతుంది. రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఈ ఏడాది జూన్ 2వ తేదీన తెలంగాణ అవతరణ దినోత్సవాలను అద్భుతంగా చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరుండి అన్ని చూసుకుంటున్నారు.
రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువతి మృతి
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువతి మృతి చెందారు.యాదాద్రి జిల్లా యాదిరిగుట్ట మండల యదగిరిపల్లి కి చెందిన సౌమ్య అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మరణించింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో అతివేగంతో వచ్చిన కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిందని పోలీసులు తెలిపారు.