29May-టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్
హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రక్రియ ప్రారంభం అయింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులను రెడీ చేసినట్లు తెలసింది. హైదరాబాద్ నగరంలో ఉన్న శివారు మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో దాని ప్రక్రియ నిలిచిపోయింది.
(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )
శివారు మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో విలీనం?
హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రక్రియ ప్రారంభం అయింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులను రెడీ చేసినట్లు తెలసింది. హైదరాబాద్ నగరంలో ఉన్న శివారు మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో దాని ప్రక్రియ నిలిచిపోయింది.
Breaking : సూర్యలంక బీచ్ లో గల్లంతయిన నలుగురు తెలంగాణ యువకులు
బాపట్ల సూర్యలంక బీచ్ లో యువకులు గల్లంతయ్యారు. హైదరాబాద్ నుంచి సూర్యలంక బీచ్ కు విహార యాత్రకు వచ్చిన యువకులు గల్లంతయినట్లు సమాచారం. గల్లంతయిన యువకుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతయిన యువకుల కోసం కోస్ట్ గార్డ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపడుతున్నారు. బాపట్ల జిల్లాలోని నాగరాజు కాల్వలో ఈ ఘటన జరిగిందంటున్నారు.
Vegetables : కొండెక్కిన కూరగాయల ధరలు .. కొనలేక వినియోగదారుల అవస్థలు
కూరగాయల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అకాల వర్షాలతో ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయి. గాలివాన దెబ్బకు అనేక పంటలు దెబ్బతినడంతో కూరగాయలు ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. దిగుమతులు కూడా తక్కువగా ఉండటంతో ధరలు పెరుగుతాయని అంటున్నారు. వర్షం కురవడమే కాకుండా, గాలివానకు పంటలు తీవ్రంగా నష్ట పోవడంతో ఉత్పత్తి కూడా తగ్గిందన్నది వ్యాపార వర్గాల నుంచి వినిపిస్తున్న వాదనగా ఉంది.
T20 World Cup : గ్రూపులో బలమైనది భారత్ మాత్రమేనట.. గెలుపుపై అంచనాలివీ
టీ 20 వరల్డ్ కప్ మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం కానుంది. జూన్ రెండో తేదీ నుంచి ప్రపంచ దేశాల మధ్య సమరం స్టార్ట్ అవుతుంది. దాదాపు ఇరవై దేశాలు ఈ పోటీలో తలపడనున్నాయి. అందులో ఏ గ్రూపులో భారత్ ఉంది. అయితే ఈ గ్రూపులో ఉన్న మ్యాచ్ లో భారత్ తలపడుతుంది. గ్రూప్ ఎలో భారత్, కెనడా, ఐర్లాండ్, పాకిస్థాన్, అమెరికా జట్లు ఉన్నాయి. ఇండియా కెనడా, ఐర్లాండ్, పాకిస్థాన్, అమెరికా జట్లను ఎదుర్కొనాల్సి ఉంటుంది.
Mudragada : ముద్రగడ వైసీపీకి బలమా? బలహీనతగా మారారా? హాట్ టాపిక్ ఇన్ ఫ్యాన్ పార్టీ
ఒక్కోసారి రాజకీయాలు తాము ఒకటి తలిస్తే మరొక దిశగా పయనిస్తాయి. అనుకున్న దారిలో పయనించకపోవడానికి అనేక కారణాలుంటాయి. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తయినా ప్రతి చిన్న అంశంలోనూ పోస్టుమార్టం జరుగుతుంది. ఎంతగా అంటే కులాల వారీగా అనుకూలమా? వ్యతిరేకమా?
Telangana : విత్తనాల కోసం రైతన్నల పడిగాపులు
విత్తనాల కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. దుక్కి దున్ని రెడీ గా ఉంచిన భూముల్లో విత్తనాలు నాటేందుకు రైతులు విత్తనాల కోసం వ్యవసాయ శాఖ కార్యాలయాల వద్ద క్యూ కడుతున్నారు. ఉదయాన్నే వచ్చి చెప్పులు, టవళ్లు వరసలో ఉంచి తాము టిఫిన్లు చేసేందుకు బయటకు వెళ్లారు. తెలంగాణ వ్యాప్తంగా అనేక జిల్లాల్లో విత్తనాల కోసం ఇదే పరిస్థితి నెలకొంది. ప్రధానంగా జీలుగు, జనుము, పత్తి విత్తనాల కోసం రైతులు క్యూ కడుతున్నారు. విత్తనాలు దొరకడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
Ap Elections : ఆ నియోజకవర్గాలపైనే ఆశలు... ఈసారి క్లీన్ స్వీప్ చేస్తామంటున్న వైసీపీ
గత ఎన్నికల్లో గెలిచిన స్థానాలను ఈసారి కూడా నిలబెట్టుకుంటామని, అదనంగా మరికొన్ని స్థానాలను కైవసం చేసుకుంటామని వైసీపీ హైకమాండ్ లెక్కలుగా వినిపిస్తున్నాయి. గత ఎన్నికలకంటే ఈ ఎన్నికల్లో తాము అన్ని స్థానాల్లో క్లీన్ స్వీప్ చేయడం గ్యారంటీ అన్న విశ్వాసంతో వైసీపీ నేతలున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 29 ఎస్సీ నియోజకవర్గాలున్నాయి.
Bengaluru Rave Party Case : సినీనటి హేమకు మరోసారి నోటీసులు
టాలీవుడ్ నటి హేమకు బెంగళూరు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. జూన్ 1న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. బెంగళూరు రేవ్ పార్టీలో హేమ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీలో హేమ రక్తనమూనాలను పరీక్షించగా డ్రగ్స్ వాడినట్లు తేలిందని పోలీసులు తెలిపారు. దీంతో ఆమెకు తొలిసారి నోటీసులు ఇచ్చారు.
Vijayawada : బెజవాడలో కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి.. ఉన్నతాధికారుల సీరియస్
విజయవాడలో కలుషితనీరు తాగి ఇద్దరు మరణించడంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. విజయవాడలోని మొగల్రాజపురంలో కలుషిత నీరు తాగి రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు మృత్యువాత పడటం కలకలం రేపింది. మరో ముప్ఫయి మందికి కలుషిత నీరు తాగడంతో అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో ఆసుపత్రలలో చేరారు. కలుషిత నీరు తాగి ఆసుపత్రుల పాలయిన వారి సంఖ్య రోజురోజుకూ పెరుుగుతుంది.
Aadhaar Update: ఆధార్ పై మరో కీలక అప్డేట్ ఇదే
ఆధార్ కార్డుపై తప్పుడు వదంతలు నమ్మవద్దని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా మరోసారి స్పష్టం చేసింది. జూన్ 14వ తేదీ లోపు ఆధార్ కార్డును అప్డేట్ చేసుకుంటే ఉచితంగా చేస్తారని తెలిపింది. అయితే ఆ తర్వాత అప్డేట్ చేయాలనుకుంటే మాత్రం కొంత రుసుము తప్పదని యూఐడీఏఐ తెలిపింది. దీనిని సోషల్ మీడియాలో కొందరు వక్రీకరించి పదేళ్లు దాటిన ఆధార్ కార్డు చెల్లదంటూ ప్రచారం చేస్తున్నారని దానిని నమ్మవద్దని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపింది.