బాబు అక్రమాస్తులపై ఏసీబీ కోర్టు
చందద్రబాబు అక్రమాస్తుల కేసు పై లక్ష్మీ పార్వతి వేసిన పిటీషన్ పై ఏసీబీ కోర్టు విచారణ చేపట్టింది. ఆదాయానికి మించిన ఆస్తులు చంద్రబాబు కలిగి ఉన్నాడని, ఆస్తుల [more]
చందద్రబాబు అక్రమాస్తుల కేసు పై లక్ష్మీ పార్వతి వేసిన పిటీషన్ పై ఏసీబీ కోర్టు విచారణ చేపట్టింది. ఆదాయానికి మించిన ఆస్తులు చంద్రబాబు కలిగి ఉన్నాడని, ఆస్తుల [more]
చందద్రబాబు అక్రమాస్తుల కేసు పై లక్ష్మీ పార్వతి వేసిన పిటీషన్ పై ఏసీబీ కోర్టు విచారణ చేపట్టింది. ఆదాయానికి మించిన ఆస్తులు చంద్రబాబు కలిగి ఉన్నాడని, ఆస్తుల పై సమగ్ర విచారణ జరిపించాలని లక్ష్మీ పార్వతి పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు పై ఏసీబీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరిపించాలని లక్ష్మీ పార్వతి కోరారు. చంద్రబాబు పై స్టే వెకేట్ అయిన వివరాలను కోర్టుకు సమర్పించారు. ఈరోజు ఏసీబీ కోర్టుకు లక్ష్మీ పార్వతి హాజరయ్యారు. 1978 నుంచి 2005 వరకు చంద్రబాబు కు ఉన్న ఆస్తుల వివరాలను కోర్టుకు లక్ష్మీ పార్వతి తెలిపారు. చంద్రబాబు నాయుడు ఆస్తులకు సంబంధించిన కేసు రీజిస్టర్ కాకముందే హైకోర్టు నుండి స్టే ఎలా తెచుకున్నాడో తెలపాలని లక్ష్మీ పార్వతి ప్రశ్నించారు. మొదటి ఎమ్మెల్యే గా 300 రూపాయలు తీసుకున్న చంద్రబాబు అక్రమంగా వేల కోట్ల రూపాయలు సంపాదించారని లక్ష్మీ పార్వతి ఆరోపించారు. చంద్రబాబు ఆస్తుల పై సమగ్ర విచారణ కు అదేశం ఇవ్వాలని ఏసీబీ కోర్టును లక్ష్మీ పార్వతి కోరారు. హైకోర్టు లో ఇప్పటికే ఈ కేసుపై స్టే ఉందని కోర్టుకు చంద్రబాబు తరపున న్యాయవాది తెలిపారు. తదుపరి విచారణను ఈ నెల 14 కు వాయిదా వేసింది.