ఆమోదం… నిరవధిక వాయిదా
శాసనసభలో మండలి రద్దుపై జగన్ ప్రసంగం తర్వాత ఓటింగ్ నిర్వహించారు. ఈ ఓటింగ్ లో శాసనమండలి సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ పాల్గొన కూడదని [more]
శాసనసభలో మండలి రద్దుపై జగన్ ప్రసంగం తర్వాత ఓటింగ్ నిర్వహించారు. ఈ ఓటింగ్ లో శాసనమండలి సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ పాల్గొన కూడదని [more]
శాసనసభలో మండలి రద్దుపై జగన్ ప్రసంగం తర్వాత ఓటింగ్ నిర్వహించారు. ఈ ఓటింగ్ లో శాసనమండలి సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ పాల్గొన కూడదని స్పీకర్ సూచించారు. వీరిద్దరు శాసనసభ సభ్యులు కానందున పక్కన కూర్చోవాలని స్పీకర్ తమ్మినేని సీతారాం ఆదేశించారు. మండలి రద్దు తీర్మానంపై జరిగిన ఓటింగ్ లో సభ్యులందరూ నిల్చోవాలని స్పీకర్ కోరారు. శాసనసభ సిబ్బంది లెక్కింపు చేపట్టారు. జగన్ ప్రతిపాదించిన శాసనమండలి రద్దు తీర్మానంపై 133 మంది సభ్యులు అనుకూలంగా ఓట్లు వేశారు. వ్యతిరేకించిన వారు లేరు. దీంతో శాసనభలో శాసనమండలి తీర్మానం ఆమోదం పొందిందని స్పీకర్ ప్రకటించారు. తర్వాత స్పీకర్ శాసనసభను నిరవధికంగా వాయిదా వేశారు.