తూర్పులో పంజా విసురుతున్న చిరుతలు …!
తూర్పు గోదావరి జిల్లా వాసులకు చిరుతల బెడద కొనసాగుతూనే ఉంది. గతంలో పిఠాపురం లో రెండు చిరుతలు, రంగంపేట మండలంలో ఒక చిరుత, రాజమండ్రిలో మూడు చిరుతలు [more]
తూర్పు గోదావరి జిల్లా వాసులకు చిరుతల బెడద కొనసాగుతూనే ఉంది. గతంలో పిఠాపురం లో రెండు చిరుతలు, రంగంపేట మండలంలో ఒక చిరుత, రాజమండ్రిలో మూడు చిరుతలు [more]
తూర్పు గోదావరి జిల్లా వాసులకు చిరుతల బెడద కొనసాగుతూనే ఉంది. గతంలో పిఠాపురం లో రెండు చిరుతలు, రంగంపేట మండలంలో ఒక చిరుత, రాజమండ్రిలో మూడు చిరుతలు హల్ చల్ చేశాయి. వీటిలో పిఠాపురం ప్రాంతంలో ఒక చిరుతను పోలీసులు కాల్చి చంపగా, రంగంపేట ప్రాంతంలోని చిరుతను జనం కొట్టి చంపేశారు. మిగిలిన వాటిని మాత్రం అటవీ అధికారులు విజయవంతంగా బంధించి తిరిగి తూర్పు మాన్యానికి తరలించారు. తాజాగా మరో భారీ చిరుత తూర్పుగోదావరి జిల్లా అంకంపాలెంలోకి ప్రవేశించి గ్రామస్థులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది.
కొబ్బరి చెట్టుపై చిరుత విన్యాసం…
అంకంపాలెం గ్రామంలో తిష్ట వేసిన చిరుత పులి ఇప్పటికే నలుగురు స్థానికులను గాయపరిచింది. జనం ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అటవీ అధికారులు చిరుతను ప్రాణాలతో బంధించేందుకు ప్రయత్నించారు. చిరుత ఉన్న ప్రాంతానికి భారీ సంఖ్యలో చేరుకున్న ప్రజలను అదుపులో పెట్టేందుకు పోలీసులు తిప్పలు పడ్డారు. చిరుతకు మత్తు ఇంజెక్షన్ ద్వారా బంధించడానికి విశాఖ జూకి చెందిన ప్రత్యేక వైద్యులు అంకంపాలెం చేరుకున్నారు. అయితే, ఇవన్నీ తప్పించుకొని చిరుత పారిపోయంది. దీంతో అది ఏ సమయంలో ఎవరిపై దాడి చేస్తుందో అని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
అడవులు అంతరించడంతో…
మనుషుల స్వార్ధానికి అడవులు అంతరించి పోతున్నాయి. ఫలితంగా జనావాస ప్రాంతాల బాట పట్టాయి అడవి జంతువులు. దీంతో క్రూర మృగాల రాకతో మైదాన ప్రాంతాల్లోని వారు హడలిపోతున్నారు. గతంలో తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి, పిఠాపురం, రంగంపేట, ప్రాంతాలవరకు వచ్చిన చిరుతలు ఇప్పుడు మరికొంత దూరం ముందుకు వెళ్లాయి. ధవళేశ్వరం బ్యారేజ్ సెంట్రల్ డెల్టా ప్రాంతంలో ఉండే అంకంపాలెం వరకు వెళ్లడంతో తూర్పు వాసుల్లో గతంలో లేని ఆందోళన ఇటీవల పెరిగిపోతుంది.