Fri Dec 27 2024 01:56:22 GMT+0000 (Coordinated Universal Time)
కాంగ్రెస్ సీనియర్ నేతకు జీవిత ఖైదు
సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో నిందితుడిగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత సజ్జన్ కుమార్ కు ఢిల్లీ హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ కేసులో సజ్జన్ ను నిర్దోషిగా తీర్పునిచ్చిన ట్రయల్ కోర్టు తీర్పును తోసిపుచ్చింది. 1984లో సిక్కు బాడీగార్డుల చేతిలో ఇందిరా గాంధీ హత్య తర్వాత సిక్కులకు వ్యతిరేకంగా పెద్దఎత్తున అల్లర్లు జరిగాయి. ఈ అల్లర్లలో మొత్తం 2800 మంది చనిపోగా, కేవలం ఢిల్లీలోనే 2100 మంది చనిపోయారు. ఈ అల్లర్లకు సజ్జన్ కుమార్ కుట్ర పన్నారని తేల్చిన ఢిల్లీ కోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించింది. ఈ నెల 31 లోగా ఆయనను లొంగిపోవాల్సిందిగా కోర్టు ఆదేశించింది. కాంగ్రెస్ నేతలు కెప్టెన్ భాగ్మల్, గిరిధర్ లాల్, బల్వాన్ ఖోఖర్ లకు కూడా కోర్టు జీవితఖైదు విధించగా... కిషన్ ఖోఖర్, మాజీ ఎమ్మెల్యే మహేందర్ యాదవ్ లకు పదేళ్ల జైలు శిక్ష విధించింది.
Next Story