ముఖ్యమంత్రి ఓఎస్డీ అంటూ?
సెక్రెటేరియట్ లో డ్రైవర్ గా ఉద్యోగం చేశాడు .. అక్కడ ప్రభుత్వ ఉద్యోగుల నుండి సీఎం పేషీ వరకు ఎలా ఉంటుందో పూర్తి అవగాహన కు వచ్చాడు [more]
సెక్రెటేరియట్ లో డ్రైవర్ గా ఉద్యోగం చేశాడు .. అక్కడ ప్రభుత్వ ఉద్యోగుల నుండి సీఎం పేషీ వరకు ఎలా ఉంటుందో పూర్తి అవగాహన కు వచ్చాడు [more]
సెక్రెటేరియట్ లో డ్రైవర్ గా ఉద్యోగం చేశాడు .. అక్కడ ప్రభుత్వ ఉద్యోగుల నుండి సీఎం పేషీ వరకు ఎలా ఉంటుందో పూర్తి అవగాహన కు వచ్చాడు .. అక్కడ అధికారులు , రాజకీయ నాయకులు చుట్టూ తిరిగే భాదితులు పరిస్థితులను ఆసరాగా చేసుకొని ఎలాగైనా అక్రమ మార్గం లో డబ్బులు సంపాదించాలని ప్లాన్ చేసుకున్నాడు .. ఇంకేముంది సీఎం పీఏ , ముఖ్యమంత్రి ఓఎస్డీ అంటూ చలామణి అవుతూ ఉద్యోగాలు , డబుల్ బెడ్ రోడ్ ఇల్లులు ఇప్పిస్తానంటూ లక్షలు రూపాయలు అమాయకులను మోసం చేశాడు ఈ కేటుగాడు.
సీఎం పీఏ నంటూ….
అతని పేరు సుధాకర్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా పని చేస్తున్నాడు .. ఎలాగైనా ఈజీ గా డబ్బులు సంపాదించాలనే ప్లాన్ తో ఏకంగా సీఎం పీఏ అంటూ అవతారం ఎత్తాడు .. గతంలో సచివాలయం లో డ్రైవర్ గా పని చేసిన అనుభవం తో అక్కడ జరిగే కార్యకలాపాలు గమనిస్తూ ఎలాగైనా మనం కూడా అడ్డదారుల్లో డబ్బులు సంపాదించాలని ప్లాన్ చేసుకొని అమాయకుల దగ్గర నుండి లక్షలు రూపాయలు వసూళ్లు చేశాడు .. తానూ సీఎం ఆఫీస్ లో పని చేస్తున్న , నేను ఎంత చెపితే అంత , మీకు ఏమి కావాలన్న నేను చిటికెలో పని చేసి పెడుతా అంటూ అందరిని నమ్మించాడు ..
లక్షల్లో అడ్వాన్స్ తీసుకుని…..
నిజమేనేమో అని నమ్మి చాల మంది ఈ సుధాకర్ ఆశ్రయించారు.. మీకు డబుల్ బెడ్ రూమ్ లు ఇప్పిస్తాను అంటూ అమాయకులు నుండి డబ్బులు వసూలు చేశాడు , మరి కొంత మందికి పోలీస్ డిపార్ట్ మెంట్ లో జాబ్ పేరుతో మోసాలు చేశాడు .. ఇక తక్కువ రేట్ కు బంగారం ఇప్పిస్తానని నమ్మబలికి లక్షలు రూపాయలు అడ్వాన్స్ రూపం లో డబ్బులు తీసుకొని మొహం చాటేశాడని పోలీసులు విచారణ లో తేలింది .. అయితే సుధాకర్ కు మరో ఇద్దరు నిందితులు ఈ మోసాల్లో సహకారం అందించినట్లు విచారణ లో తేలింది .. ఓ పార్చునర్ కారు లో వచ్చి , తన ఆఫీస్ అంటూ భాదితులు ను తీసుకొని వెళ్లుతాడు .. పక్కనే కారు డ్రైవర్ సఫారీ డ్రెస్ లో ఉండేలా ప్లాన్ చూసుకుంటూ , ఎవరైనా మాట్లాడానికి వచ్చిన సమయం లో పక్కన ఉన్న డ్రైవర్ సుధాకర్ కు గన్ మెన్ లాగా ప్రవర్తిస్తూ వచ్చే వారిని నమ్మించినట్లు తేలింది .. ఇక ఆఫీస్ లోకి వెళ్ళగానే తన డమ్మీ గన్ను తీసి టేబుల్ మీద పెడుతాడు .. ఓ ఇతను నిజంగా సీఎం కు పీఏ అనేలా అందరిని ఆకట్టుకుంటూ ఇలా మోసాలు చేసినట్లు సీపీ అంజనీకుమార్ తెలిపారు .. ఇలా 80 నుండి 90మంది ని మోసం చేసినట్లు పోలీసులు విచారణ లో తేలిందని తెలిపారు .
కోటిన్నర స్వాధీనం…
దీంతో ఈ గ్యాంగ్ లీడర్ సుధాకర్ పై నిఘా పెట్టి వీరి ఆగడాలకు కళ్లెం వేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు .. సీఎం పీఏ , సీఎం osd పేరుతో ఫేక్ ఐడీ కార్డు తో పాటు డమ్మీ తుపాకీ , ఫార్చూనర్ కార్ , ఫేక్ పోలీస్ ఐడీ కార్డు లు , 14 సెల్ ఫోన్స్ తోపాటు కోటి ముప్పై లక్షలు నగదు , కోటి విలువైన ఇంటి డాక్యుమెంట్లు నిందితులు ముగ్గరు నుండి స్వాధీనం చేసుకున్నారు .. ఈ ముఠా లో కీలక నిందితుడు సుధాకర్ పై గతంలో ఎనిమిది కేసులు ఉన్నట్లు పోలీసులు విచారణ లో తేలింది ..