Mon Dec 23 2024 14:32:05 GMT+0000 (Coordinated Universal Time)
కరోనా విలయం.. ఇకపై వారాంతపు లాక్ డౌన్!
రోజువారీ టెస్టుల్లో కరోనా పాజిటివిటీ రేటు 40 శాతం దాటిపోయింది. గడిచిన 24 గంటల్లో మొత్తం 1,15,357 కరోనా పరీక్షలు
దేశంలో కరోనా మహమ్మారి జడలు విప్పింది. అక్కడ, ఇక్కడ అనే బేధం లేకుండా అన్ని రాష్ట్రాల్లోనూ మాయదారి వైరస్ రెచ్చిపోతోంది. ఫస్ట్, సెకండ్ వేవ్ ల కన్నా థర్డ్ వేవ్ ప్రభావం అంతకుమించి కనిపిస్తోంది. విపరీతంగా పెరుగుతోన్న కరోనా, ఒమిక్రాన్ కేసులను ఎలా కట్టడి చేయాలో తెలియక అధికార యంత్రాంగం తలలు పట్టుకుంటోంది. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితీ ఇలాగే ఉంది. రోజువారీ కేసులు వేలల్లో నమోదవుతుండటంతో అందరిలోనూ ఆందోళన పెరిగిపోతోంది. దైవభూమిగా పేరొందిన కేరళలోనూ కరోనా ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది.
Also Read : నేటి నుంచి తెలంగాణలో ఫీవర్ సర్వే
గడిచిన 24 గంటల్లో కేరళలో 50 వేల కొత్తకేసులు నమోదయ్యాయి. 2022లో అక్కడ అత్యధికంగా నమోదైన రోజువారీ (జనవరి20) కేసులివే. రోజువారీ టెస్టుల్లో కరోనా పాజిటివిటీ రేటు 40 శాతం దాటిపోయింది. గడిచిన 24 గంటల్లో మొత్తం 1,15,357 కరోనా పరీక్షలు జరిగాయి. పాజిటివిటీ రేటు 40.21 శాతంగా నమోదైంది. ఇక రాష్ట్రంలోని తిరువనంతపురంలో అత్యధికంగా 9,720 కేసులు నమోదయ్యాయి. ఆ తరువాతి స్థానంలో ఎర్నాకులం ఉంది. కోజికోడ్, త్రిసూర్, కొట్టాయం కొల్లంలో వరుసగా 3,002, 4,016, 3,627, 3,091 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 1,99,041 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం మరిన్ని ఆంక్షలు ప్రకటించింది. వచ్చే రెండు ఆదివారాలు (జనవరి 23,30) పూర్తి లాక్ డౌన్ విధిస్తున్నట్లు తెలిపింది. అలాగే ప్రయాణాలపై కూడా కొత్త ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. అత్యవసరమైన సేవలు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. లాక్ డౌన్ తో ఆదివారాలు మాల్స్, థియేటర్లు మూతపడనున్నాయి. 10, 12వ తరగతి విద్యార్థులకు కూడా ఆన్లైన్లోనే తరగతులు నిర్వహించనున్నారు. శుక్రవారం నుంచి పాఠశాలల్లో తరగతులు ఉండవు.
Next Story