Mon Dec 23 2024 10:04:19 GMT+0000 (Coordinated Universal Time)
నేడు వందేభారత్ రైలు ప్రారంభం
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వందేభారత్ రైలు నేడు ప్రారంభం కానుంది. ప్రధాని మోదీ నేడు వర్చువల్ గా ప్రారంభిస్తారు
తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వందేభారత్ రైలు నేడు ప్రారంభం కానుంది. ప్రధాని మోదీ నేడు వర్చువల్ గా ప్రారంభిస్తారు. రేపటి నుంచి పూర్తి స్థాయిలో సికింద్రాబాద్ - విశాఖపట్నంల మధ్య వందేభారత్ రైలు అందుబాటులోకి వస్తుంది. ఎనిమిదో రైలుగా దక్షిణ మధ్య రైల్వేలో ప్రధాని ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. సికింద్రాబాద్ లో పదో ప్లాట్ఫారంపై ఉన్న రైలు నేడు ప్రధాని ప్రారంభోత్సవం తర్వాత పట్టాలపై పరుగులు తీయనుంది.
ఛార్జీలు ఇవే...
వారంలో ఆదివారం మినహాయించి మిగిలిన ఆరు రోజులు ఈ రైలు అందుబాటులో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. నిన్నటి నుంచే టిక్కెట్లు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచారు. సికింద్రాబాద్ నుంచి విశాఖకు ఛైర్ కార్ టిక్కెట్ రూ.1720లు గా ఉంది. ఎగ్జిక్యూటివ్ ఛైర్కార్ ధర రూ.31,20లుగా ఉంది. ప్రయాణికుల కోరిక మేరకు రైలులో టిఫిన్లు, టీ, ఆహారాన్ని అందిస్తారు. దీనికి ఐఆర్టీసీ అదనంగా ఛార్జీలను వసూలు చేస్తుంది. టిక్కెట్ బుక్ చేసుకునేటప్పుడే ప్రయాణికులు ఆహారం వద్దా? లేదా? అన్నది తెలియజేయాల్సి ఉంటుంది. ప్రధాని ప్రారంభించే ఈ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొననున్నారు.
Next Story