ఇంక పారిపోలేవులే..!
సుజనా చౌదరి కథ కంచికి చేరేట్లే వుంది. ఎన్ డి ఏ నుంచి తెలుగు దేశం వైదొలగిన తర్వాత అందరికంటే ఎక్కువ ఇబ్బంది పడుతున్న వ్యక్తి సుజనా చౌదరి అని తెలిసిందే. ఎన్ డి ఏ లో వున్నంతవరకు అరుణ్ జైట్లీ అండతో క్షేమంగా వున్న సుజనాకి తెలుగు దేశం మద్దతు ఉపసంహరించిన తరువాత సి. బి. ఐ. మరియు ఇ.డి. ల సెగ గట్టిగానే తగిలింది.
విదేశాలకు పారిపోయే అవకాశం లేదు..
తాజాగా ఈరోజు సుజనాకి సి.బి.ఐ. లుక్ అవుట్ నోటీసులు జారీ చెయ్యడంతో విజయ్ మాల్యా, నీరవ్ మోడీ లాగా విదేశాలకు పారిపోయే అవకాశం కూడా మూసుకుపోయినట్టే. తెలుగు దేశం ఎన్ డి ఏ నుంచి వైదొలగడం సుజనా పాలిటి శాపమయ్యింది. ఎంకి పెళ్లి సుబ్బి చావుకి రావడమంటే ఇదే మరి...
మీడియా పై దౌర్జన్యం..
ఈడీ రైడ్స్ జరుతున్నాయని కవరేజ్ చేయడానికి వెళ్లిన మీడియాపై, ఇంటి ముందు కెమెరాల తో షూట్ చేయొద్దని సుజనా చౌదరి బెదిరించారు. మీడియా రిపోర్టర్ల ను వెళ్లిపోవాలని పోలీసులు, సెక్యురిటి గార్డులు చేతితో నెట్టివేశారు. ఈడీ రైడ్స్ పై సుజనా చౌదరి ఇంకా స్పందించలేదు.