బిగ్ బ్రేకింగ్ : టీడీపీకి షాక్ ….మరో ఎమ్మెల్యే జంప్
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ కి మరో షాక్ తగలనుంది. టీడీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దాలి గిరి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. మంత్రి వెల్లంపల్లి [more]
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ కి మరో షాక్ తగలనుంది. టీడీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దాలి గిరి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. మంత్రి వెల్లంపల్లి [more]
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ కి మరో షాక్ తగలనుంది. టీడీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దాలి గిరి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. మంత్రి వెల్లంపల్లి తో కలిసి సీఎం జగన్ ని మద్దాలి గిరిని మరికొద్ది సేపట్లో కలవనున్నారు. గత ఎన్నికల్లో మద్దాలి గిరి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలిచారు. రాజధాని రైతుల ఆందోళన నేపథ్యంలో గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే వైసీపీ వైపు వస్తే బాగుంటుందని వైసీపీ భావిస్తోంది. ఇటీవలే వల్లభనేని వంశీ టీడీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాజధాని తరలింపు అంశం వివాదాస్పద అంశంగా మారిన నేపథ్యంలో మద్దాలి గిరి వైసీపీ వైపు చూడటం ఆసక్తికరంగా మారింది. అయితే పార్టీలో చేరకుండా స్వతంత్ర అభ్యర్థిగా మద్దాలి గిరి కొనసాగుతారని తెలుస్తోంది.