మద్దాలి గిరి పార్టీని వీడిన తర్వాత…?
రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. గుంటూరు జిల్లా వెస్ట్ నియోజకవర్గంలో మాత్రం గత ఏడాది ఎన్నికల్లో టీడీపీ గెలుపు గుర్రం ఎక్కింది. రాష్ట్రంలో విజయం [more]
రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. గుంటూరు జిల్లా వెస్ట్ నియోజకవర్గంలో మాత్రం గత ఏడాది ఎన్నికల్లో టీడీపీ గెలుపు గుర్రం ఎక్కింది. రాష్ట్రంలో విజయం [more]
రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. గుంటూరు జిల్లా వెస్ట్ నియోజకవర్గంలో మాత్రం గత ఏడాది ఎన్నికల్లో టీడీపీ గెలుపు గుర్రం ఎక్కింది. రాష్ట్రంలో విజయం సాధించిన 23 మంది టీడీపీ ఎమ్మెల్యేల్లో గుంటూరు వెస్ట్ నుంచి మద్దాలి గిరి విజయం సాధించారు. గతంలోనూ ఇక్కడ టీడీపీ గెలుపు గుర్రం ఎక్కింది. అయితే, ఇప్పుడు మాత్రం పరిస్థితి దారుణంగా తయారైంది. 2014లో ఇక్కడ నుంచి గెలిచిన టీడీపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి.. తర్వాత కాలంలో చంద్రబాబు ప్రభుత్వంపై ఫైరయ్యారు. రెడ్డివర్గానికి అన్యాయం జరుగుతోందని గళం విప్పారు.
వరసగా రెండు సార్లు టీడీపీ గెలిచి…
ఈ క్రమంలోనే ఆయన చంద్రబాబు ప్రభుత్వంపై ఆ పార్టీ నేతగా ఉంటూనే విమర్శలు గుప్పించడం అప్పట్లో తీవ్ర వివాదానికి దారితీసింది. అయితే.. చంద్రబాబు ఆయనపై ఎలాంటి చర్యలూ తీసుకోకుండానే ఆయనంతట ఆయనే గత ఏడాది ఎన్నికలకు ముందు జగన్ పార్టీలోకి చేరిపోయారు. ఇక, గుంటూరు వెస్ట్ నుంచి వైశ్య సామాజిక వర్గానికి చెందిన మద్దాలి గిరిధర్‌కు చంద్రబాబు టికెట్ ఇచ్చారు. గత ఏడాది కొత్త నాయకులు అందరూ వైఎస్సార్ గాలిలో తునాతునకలు అయినా.. గుంటూరు జిల్లాలో సీనియర్ నేతలు కూడా మట్టి కరిచినప్పటికీ.. మద్దాలి గిరి మాత్రం జగన్ సునామీని తట్టుకుని మరీ విజయం సాధించారు. పోనీలే.. రాజధాని ప్రాంతంలో ఒక్క ఎమ్మెల్యే అయినా గెలిచారన్న ఆనందం టీడీపీకి మిగిలింది.
ఎవరు గెలిచినా…..?
అయితే, ఇంతలోనే మద్దాలి గిరిధర్ కూడా వైసీపీ గూటికి చేరిపోయి.. అనధికారికంగా ఆయన వైఎస్సార్ పార్టీ నేతగా చలామణి అవుతున్నారు. దీంతో గుంటూరు వెస్ట్‌లో టీడీపీ జెండా మోసే నాయకుడు ఎవరూ కనిపించడం లేదు. ఇటీవల కమ్మ వర్గానికే చెందిన కోవెలమూడి రవీంద్రకు పగ్గాలు అప్పగించినా ఆయనతో పార్టీకి ఒరిగిందేమి లేదు. పైగా ఎవరిని నమ్ముదామన్నా కూడా చంద్రబాబుకు ఇప్పుడు భయం వెంటాడుతోంది. ఇప్పటికే మోదుగుల, మద్దాలి గిరిధర్ ఎఫెక్ట్‌తో ఈ నియోజకవర్గం నుంచి ఎవరు గెలిచినా.. తనపై తిరుగుబాటు చేస్తున్నారన్న భావన చంద్రబాబును వెంటాడుతోంది.
వైసీపీకి మాత్రం నలుగురు నేతలు….
ఇక ఈ నియోజకవర్గంలో వైసీపీకి ఇప్పుడు ఏకంగా నలుగురైదుగురు కీలక నాయకులు ఉన్నారు. టీడీపీ నుంచి గెలిచిన మద్దాలి గిరిధర్ ఇప్పుడు వైసీపీ చెంత చేరిపోయారు. ఇక జగన్‌కు అత్యంత సన్నిహితుడు అయిన లేళ్ల అప్పిరెడ్డి సైతం ఈ నియోజకవర్గంలో పార్టీ తరపున అంతా తానే అయి వ్యవహరిస్తున్నారు. అప్పిరెడ్డి ఇక్కడ 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఇక గత ఎన్నికల్లో ఓడిన చంద్రగిరి ఏసురత్నం కూడా ఉన్నారు. ఆయన ప్రస్తుతం మిర్చి యార్డు చైర్మన్‌గా ఉన్నారు. ఇలా వైసీపీ కీలక నేతలు అందరూ ఇక్కడే కాన్సంట్రేషన్ చేయడంతో ఈ నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి దారుణంగా ఉందని చెబుతున్నారు. మరి చంద్రబాబు ఎలాంటి ఎత్తుగడ వేసి.. ఇక్కడ పార్టీని నిలబెట్టుకుంటారో ? చూడాలి.