అర్ధరాత్రి నియామకం...వెంటనే సోదాలు....!!
సిబిఐ డైరెక్టర్ అలొక్ వర్మపైన ఉహించని రీతిలో వేటు పడింది. రాత్రికి రాత్రికే సిబిఐ డైరెక్టర్ ను మార్చివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. డైరెక్టర్ ను నియమించే కమిటి అర్దరాత్రి ప్రధాని సమీక్షంలో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు.. సీబిఐలో జాయింట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న మన్నెం నాగేశ్వర రావును ఇంఛార్జి డైరెక్టర్ గా నియమించారు. తదుపరి డైరెక్టర్ గా నియమించే వరకు కూడా నాగేశ్వర రావునే పూర్తి బాధ్యతలను నిర్వహిస్తారని ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది. ఈ మేరకు రాత్రికి రాత్రే ఉత్తర్యులను కూడా జారీ చేసింది.అర్ధరాత్రి 2గంటలకు బాధ్యతలను చేపట్టిన నాగేశ్వరరావు వెంటనే రంగంలోకి దిగారు. సీబీఐ కార్యాలయంలో మన్నెం నాగేశ్వరరావు బృందం సోదాలను ప్రారంభించింది. 10, 11వ ఫ్లోర్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆస్తానా, దేవేందర్ మరికొందరి అధికారుల ఛాంబర్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆస్తానా, అలోక్ వర్మలను ప్రభుత్వం సెలవుపై పంపింది.
వరంగల్ జిల్లాకు చెందిన.....
1986 బ్యాచ్ కు చెందిన నాగేశ్వరు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వారు. ఒడిషా క్యాడర్ లో చేరిన నాగేశ్వర రావు డిజిపి స్దాయి వరకు వెళ్లాడు. డిజిపి హొదాలో పనిచేస్తున్న సమయంలో నే చైన్నై జాయింట్ డైరెక్టర్ గా పదవి చేపట్టారు. అక్కడ విధులను నిర్వహిస్తున్న సమయంలో సిబిఐ లో మరొక మెట్టు ఎక్కారు. వివాదాలకు దూరంగా వుండే నాగేశ్వర్ కు ఉహించని రీతిలో సీఐబి ఇంచార్జీ పదవి దక్కింది. ఇక పొతే సీబిఐలో పనిచేస్తున్న డైరెక్టర్ అలోక్ వర్మతో పాటుగా జాయింట్ డైరక్టర్ గా పనిచేస్తున్న ఆస్తానా మధ్యలో వివాదం తలెత్తింది. దీనితో పాటుగా ఇద్దరు పరస్పరంగా దూషణలు చేసుకున్నారు. లంచం తీసుకున్నారన్న ఆరోపణలతో ఆస్దానా పైన సీబిఐ కేసు నమోదు చేసి విచారణ కు ఆదేశాలు జారీ చేసింది.
రాజకీయ దుమారం...
మాంసం ఎగుమతి దారుడు ఖురెషీ నుంచి లంచం తీసుకున్నారన్న ఆరొపణలు వున్నాయి. ఇప్పటి ఈ కేసులో సీబిఐనే సిబిఐ అధికారులపైన కేసు నమోదు చేసి విచారణ ఆరంభించింది.దీనికి తొడుగాసీబిఐలో ఆదనపు ఎస్ పి స్థాయి అధికారి దేవేంద్ర ను కూడా సీబిఐ అరెస్టు చేసింది. ఈ వ్యవహారంపై రాజకీయ దూమారం చెలరేగింది. ప్రతిపక్షాలు ఈ సిబిఐ వ్యవహారంపైన పెద్ద ఎత్తున్న విమర్శలు చేశారు. స్వయంగా ప్రధాని దీనిపైన సమీక్షించారు. చివరకు ఈ వ్యవహారం చిలికి గాలి వానలాగా మారింది. దీంతో డైరెక్టర్ వర్మకు ఉద్యాసన పలుకుతూ ఇంచార్జీ డైరెక్టర్ గా నాగేశ్వర రావును నియమించారు.