ఏపీలో జీతాలు పడుతున్నాయ్!
ఎన్నికల వేళ జగన్ ప్రభుత్వం జాగ్రత్త పడుతున్నట్లు కనిపిస్తోంది. చాలామంది ప్రభుత్వ ఉద్యోగులకు సోమవారం ఉదయాన్నే జీతాలు పడ్డాయ్. ఇకపై, కనీసం ఎన్నికల వరకైనా, ఐదో తేదీలోపు పెన్షన్లు, జీతాలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ప్రతీ నెలా ఒకటో తేదీన జీతాలు పడటం తెలుగు రాష్ట్రాల్లో అరుదుగా మారింది.
ఎన్నికల వేళ జగన్ ప్రభుత్వం జాగ్రత్త పడుతున్నట్లు కనిపిస్తోంది. చాలామంది ప్రభుత్వ ఉద్యోగులకు సోమవారం ఉదయాన్నే జీతాలు పడ్డాయ్. ఇకపై, కనీసం ఎన్నికల వరకైనా, ఐదో తేదీలోపు పెన్షన్లు, జీతాలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ప్రతీ నెలా ఒకటో తేదీన జీతాలు పడటం తెలుగు రాష్ట్రాల్లో అరుదుగా మారింది. ఉద్యోగులు కూడా జీతాలు, భత్యాల పెంపు గురించి ఆలోచించడం మానేస్తున్నారు. ఒకటో తేదీన జీతం వస్తే చాలనుకునే స్థాయికి ‘ఎదిగారు’. రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ఎంప్లాయీస్ను ఆకట్టుకునే ప్రయత్నాలు చేసేవి. వారి కోసం హామీలు గుప్పించేవి. మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో ‘ఐదో తేదీ లోపు జీతాలు ఇస్తామ’ని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం చూస్తే.. ఉద్యోగుల పరిస్థితి అర్థమవుతుంది.
ఏపీ ప్రభుత్వం రాబోయే ఆర్నెళ్లు ఉద్యోగులతో జాగ్రత్తగా ఉండాలనుకుంటోంది. అందుకే సాధ్యమైనంత వరకూ ఐదో తేదీలోపు జీతాలు అకౌంట్లలో పడాలే చర్యలు తీసుకుంటోంది. గత కొన్నాళ్లుగా ఖర్చుల విషయంలో జగన్ ప్రయారిటీలు వేరేగా ఉంటున్నాయి. ఒకటో తేదీన వృద్ధాప పింఛన్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. తర్వాత పోలీస్, జ్యుడిషియరీ, సచివాలయ సిబ్బంది జీతాలు, వాలంటీర్ల వేతనాలు చెల్లిస్తున్నారు. ప్రభుత్వ పెన్షనర్లు, ఇతర విభాగాలు, స్కూలు, కళాశాల బోధన, బోధనేతర సిబ్బందికి చివరిలో జీతాలు వస్తున్నాయి. పదో తేదీలోపు తొంభై శాతం మందికి పైగా జీతాల చెల్లింపులు జరిగిపోతున్నాయి. జీతాల ఆలస్యంపై ఉద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. అది ఎన్నికల నాటికి మరింత పెరగకూడదని ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ దిద్దుబాటు చర్యలు ఉద్యోగులను సంతృప్తి పరుస్తాయో లేదో చూడాలి.