Wed Jan 15 2025 21:56:28 GMT+0000 (Coordinated Universal Time)
ఉత్తమ్ వారించడం ఆశ్చర్యం కలిగించింది
సీట్ల కేటాయింపుపై కాంగ్రెస్ హైకమాండ్ మరోసారి పునరాలోచించుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి పేర్కొన్నారు. తన స్వంత స్థానమైన సనత్ నగర్ టిక్కెట్ ను టీడీపీకి వదిలేయడం పట్ల మర్రి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ మేరకు ఆయన శనివారం తన అనుచరులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... హైకమాండ్ పెద్దలు తనకు టిక్కెట్ ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. తాను గెలవనని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వాదించడం ఆశ్చర్యానికి గురిచేసిందని ఆయన పేర్కొన్నారు. ఎల్లుండి సాయంత్రం లోగా ఆయన ఏదో ఒకటి తేల్చాలని పార్టీ నేతలకు అల్టిమెటం ఇచ్చారు. ఎల్బీనగర్ టిక్కెట్ పట్టుబట్టిన కాంగ్రెస్ నేతలు సనత్ నగర్ ను టీడీపీకి వదిలేశారని ఆరోపించారు.
Next Story