Tue Apr 22 2025 08:26:37 GMT+0000 (Coordinated Universal Time)
Weather Report : తెలంగాణలో చిరు జల్లులు.. ఏపీలో అదిరిపోయే ఎండ
మార్చి నెల దగ్గర పడుతుంది. ఎండల తీవ్రత ఎక్కువవుతున్న దశలో తెలంగాణ వాసులకు తీపి కబురు వాతావరణ శాఖ తెలిపింది.

మార్చి నెల దగ్గర పడుతుంది. ఎండల తీవ్రత ఎక్కువవుతున్న దశలో తెలంగాణ వాసులకు తీపి కబురు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో ఈరోజు చిరుజల్లులుపడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. రెండు రోజుల క్రితం తెలంగాణ, ఒడిశా మీదుగా ఏర్పడిన ద్రోణి బలహీనపడటంతో అక్కడక్కడా చిరుజల్లులు పడే అవకాశముందని తెలిపింది. అయితే చిరుజల్లులు పడని ప్రాంతంలో మాత్రం గరిష్ట ఉష్ణోగ్రతలునమోదయ్యే అవకాశం కనిపిస్తుందని కూడా తెలిపింది. చిరుజల్లుల పడిన కారణంగా ఎండ తీవ్రతమరింతగా పెరిగే అవకాశముందని కూడా తెలిపింది. అనేక ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలకు చేరుకునే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.
రాను రాను మరింతగా...
వాతావరణ శాఖ చెప్పిన దాని ప్రకారం ఎండల తీవ్రత రాను రాను మరింత పెరిగే అవకాశముందని పేర్కొనడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే ఫ్యాన్ లేకుండా ఇంట్లో ఉండలేని పరిస్థితి వచ్చింది. ఇంకా శివరాత్రి రాకముందే చలి తీవ్రత పూర్తిగా తగ్గిపోయింది. దుప్పట్లు దులిపేసి పక్కన పెట్టేశారు. ఇక ఏసీలు ఆన్ చేస్తున్నారు. చల్లటి వాతావరణంలో ఉండేందుకు ప్రజలు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో అనేక వ్యాధులు కూడా సోకే అవకాశముందని కూడా హెచ్చరిస్తున్నారు. జ్వరంతో పాటు గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారు మరింత ఇబ్బందులు పడే అవకాశముందని కూడా వార్నింగ్ ఇస్తున్నారు.
ఏపీలో ఎండల తీవ్రత...
ఆంధ్రప్రదేశ్ లోనూ ఎండల తీవ్రత అధికంగా ఉంది. విజయవాడ, గుంటూరు, ఒంగోలు వంటి ప్రాంతాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఏపీలో ఇప్పటికే 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు చెబుతున్నారు. అంటే ఈ నెలలోనే నలభై డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరే అవకాశముందని తెలియడంతో ప్రజలు భయాందోళలనకు గురవుతున్నారు. ఉదయం ఎనిమిది గంటల నుంచే భానుడి భగభగలు కనిపిస్తుండటంతో బయటకు రావడానికి జంకుతున్నారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని, ఏదైనా అవసరాల కోసం సాయంత్రం వేళ బయటకు రావాలని సూచిస్తున్నారు.
Next Story